తెలుగు న్యూస్  /  Entertainment  /  After Pathaan Success Shahrukh Khan Deepika Padukone Reunite For Jawan Here The Details

Shahrukh Khan Deepika Padukone: అప్పుడు హీరోయిన్ - ఇప్పుడు స్పెష‌ల్ సాంగ్‌ - జ‌వాన్ కోసం మ‌రోసారి హిట్ కాంబో?

02 April 2023, 11:39 IST

  • Shahrukh Khan Deepika Padukone: ప‌ఠాన్ త‌ర్వాత మ‌రోసారి షారుఖ్‌ఖాన్‌, దీపికా ప‌డుకోణ్ జోడీ సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెర‌వ‌నుంది. వీరిద్ద‌రు క‌లిసి చేయ‌బోతున్న ఆ సినిమా ఏదంటే...

షారుఖ్‌ఖాన్‌, దీపికా ప‌డుకోణ్
షారుఖ్‌ఖాన్‌, దీపికా ప‌డుకోణ్

షారుఖ్‌ఖాన్‌, దీపికా ప‌డుకోణ్

Shahrukh Khan Deepika Padukone: షారుఖ్‌ఖాన్‌, దీపికాప‌డుకోణ్ జంట‌గా న‌టించిన ప‌ఠాన్ సినిమా బాలీవుడ్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా చ‌రిత్ర‌ను సృష్టించింది.. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా 1050 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకొని రికార్డుల‌ను తిర‌గ‌రాసింది.

ట్రెండింగ్ వార్తలు

Siddharth Heeramandi Review: కాబోయే భార్య నటించిన హీరామండిపై సిద్ధార్థ్ రివ్యూ ఇదీ

Prasanna Vadanam OTT: ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆరోజే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

Kubera Nagarjuna: కుబేర నుంచి నాగార్జున ఫస్ట్ లుక్.. SRH vs RR మ్యాచ్‌ లైవ్‌లో గ్లింప్స్ రిలీజ్

Shaitaan OTT: ఓటీటీలోకి ఒక్క రోజు ఆలస్యంగా బ్లాక్ బస్టర్ హారర్ మూవీ.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

ఈ సూప‌ర్ హిట్ మూవీ త‌ర్వాత మ‌రోసారి షారుఖ్‌ఖాన్‌, దీపికా ప‌డుకోణ్ జోడీ సిల్వ‌ర్‌స్క్రీన్‌పై మెర‌వ‌బోతున్న‌ది. ప‌ఠాన్ త‌ర్వాత అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో జ‌వాన్ అనే సినిమాచేస్తోన్నాడు షారుఖ్‌ఖాన్‌. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈసినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ సినిమాలో దీపికా ప‌డుకోణ్ ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌బోతున్న‌ట్లు బాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. మాస్ ప్రేక్ష‌కుల్ని అల‌రించేలా ఓ స్పెష‌ల్ సాంగ్‌ను ప్ర‌త్యేకంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ కంపోజ్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఏప్రిల్ సెకండ్ వీక్ త‌ర్వాత ముంబైలో ఈ పాట చిత్రీక‌ర‌ణ‌ను మొద‌లుపెట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. షారుఖ్‌ఖాన్‌, న‌య‌న‌తార‌తో పాటు దీపికా ప‌డుకోణ్‌పై షూట్ చేయ‌నున్న ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తోంద‌నిఅంటున్నారు.

జూన్ 2న హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో జ‌వాన్ సినిమాను రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కోలీవుడ్ న‌టుడు విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. జ‌వాన్ సినిమాతోనే న‌య‌న‌తార బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. జ‌వాన్ సినిమాలో త‌మిళ అగ్ర న‌టుడు విజ‌య్‌తో పాటు సంజ‌య్‌ద‌త్ అతిథి పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.