తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sobhita Dhulipala: నాగ చైతన్య తొడిగిన ఎంగేజ్‌మెంట్ రింగ్‌‌‌తో తొలిసారి బయటికి వచ్చిన శోభిత

Sobhita Dhulipala: నాగ చైతన్య తొడిగిన ఎంగేజ్‌మెంట్ రింగ్‌‌‌తో తొలిసారి బయటికి వచ్చిన శోభిత

Galeti Rajendra HT Telugu

06 September 2024, 12:32 IST

google News
  • Naga Chaitanya Engagement Ring: నాగచైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఇద్దరూ తమ బంధాన్ని గోప్యంగా ఉంచుతూ వచ్చారు. అయితే ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. 

ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో శోభిత ధూళిపాళ్ల
ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో శోభిత ధూళిపాళ్ల

ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో శోభిత ధూళిపాళ్ల

Sobhita Dhulipala Engagement Ring: అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల తమ డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ ఇస్తూ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టులో అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ జంట నిశ్చితార్థం చేసుకోగా.. అప్పటి నుంచి ఈ జంట బయట ఎక్కువగా కనిపించడం లేదు.

ఎట్టకేలకి అభిమానుల నిరీక్షణకి తెరదించుతూ శోభిత ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైంది. ఆ ప్రోగ్రామ్‌లో తీసిన ఫొటోల్ని సోషల్ మీడియాలో అభిమానులతో శోభిత పంచుకుంది. ఆ ఫొటోల్లో శోభిత నిశ్చితార్థ ఉంగరం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఉంగరం ఫస్ట్ లుక్‌లో శోభితా ధూళిపాళ్ల

చీర కట్టులో మెరిసిన శోభితకి ఆ క్లాసీ ఎంగేజ్‌మెంట్ రింగ్ మరింత అందాన్ని జోడించిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. యానిమల్ ప్రింట్ చీర కట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. నలుపు, స్లీవ్ లెస్ బ్లౌజ్‌ను ధరించింది. అయితే ఫొటోల్లోని ఆమె డ్రెస్ కంటే డైమండ్ రింగ్ గురించే ఇప్పుడు ఎక్కువగా చర్చ నడుస్తోంది.

పెళ్లి వేదిక, తేదీపై సస్పెన్స్

నాగ చైతన్య, శోభితల నిశ్చితార్థం ఆగస్టు 8న జరిగింది. కానీ ఇప్పటి వరకు వీరి వివాహం తేదీ గురించి మాత్రం క్లారిటీ రాలేదు. ఎంగేజ్‌మెంట్‌కి ముందు ముంబైలో జరిగిన యాంగ్రీ యంగ్ మెన్ ప్రీమియర్ షోలో శోభితను కాబోయే భర్త గురించి అడిగినప్పుడు చెప్పడానికి చాలా సిగ్గుపడింది.

హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగ చైతన్య‌‌ను పెళ్లి గురించి అడిగితే.. పెళ్లి తేదీ, వేదిక ఇంకా ఏమీ ఖరారు కాలేదని స్పష్టత ఇచ్చారు. నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సాయిపల్లవితో కలిసి 'తండేల్' చిత్రంలో నటిస్తున్నాడు. వందనా కటారియా సితార చిత్రంలో శోభిత నటిస్తోంది. ప్రస్తుతం ఇద్దరి చేతుల్లో సినిమాలు ఉండటంతో.. పెళ్లికి కొంచెం టైమ్ తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

వేణుస్వామి మళ్లీ జోస్యం

నాగచైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ వార్త వెలుగులోకి రాగానే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తెరపైకి వచ్చారు. ఈ ఇద్దరి జాతకం గురించి చెప్తూ మరో మూడేళ్లు.. అంటే 2027 వరకు ఇద్దరికీ అంతా బాగుందన్నారు. కానీ ఆ తర్వాత మాత్రం ఓ మహిళ కారణంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చి విడిపోతారని వేణుస్వామి జోస్యం చెప్పారు.

గతంలో కూడా ఇలానే నాగ చైతన్య, సమంత జాతకాలను వేణుస్వామి విశ్లేషించి విడిపోతారని జోస్యం చెప్పారు. దాంతో అప్పట్లో అక్కినేని అభిమానులు, సమంత అభిమానులు వేణుస్వామిపై విరుచుకుపడ్డారు. కానీ వేణుస్వామి అంచనా వేసినట్లే చైతన్య, సమంత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

తదుపరి వ్యాసం