Samantha: తెలంగాణ ప్రభుత్వానికి సమంత రిక్వెస్ట్ ఇదీ.. అలా చేయాలంటూ సలహా.. ఇన్‌స్టా స్టోరీ వైరల్-samantha ruth prabhu welcomes hema committee report urges telangana government to take this step ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha: తెలంగాణ ప్రభుత్వానికి సమంత రిక్వెస్ట్ ఇదీ.. అలా చేయాలంటూ సలహా.. ఇన్‌స్టా స్టోరీ వైరల్

Samantha: తెలంగాణ ప్రభుత్వానికి సమంత రిక్వెస్ట్ ఇదీ.. అలా చేయాలంటూ సలహా.. ఇన్‌స్టా స్టోరీ వైరల్

Hari Prasad S HT Telugu
Aug 30, 2024 10:39 PM IST

Samantha: సమంత రుత్ ప్రభు తెలంగాణ ప్రభుత్వానికి ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ తన రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో సమంత చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందో చూడండి.

తెలంగాణ ప్రభుత్వానికి సమంత రిక్వెస్ట్ ఇదీ.. అలా చేయాలంటూ సలహా.. ఇన్‌స్టా స్టోరీ వైరల్
తెలంగాణ ప్రభుత్వానికి సమంత రిక్వెస్ట్ ఇదీ.. అలా చేయాలంటూ సలహా.. ఇన్‌స్టా స్టోరీ వైరల్

Samantha: సమంత రుత్ ప్రభు శుక్రవారం (ఆగస్ట్ 30) తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఓ స్టోరీ పోస్ట్ చేసింది. అందులో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టును స్వాగతించడంతోపాటు తెలంగాణ ప్రభుత్వం ముందు ఓ విన్నపాన్ని ఉంచింది. ఐదేళ్ల కిందట ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సబ్ కమిటీ సమర్పించిన రిపోర్టును బయట పెట్టాలని, అందుకు తగినట్లుగా ప్రణాళికలు రూపొందించాలని కోరింది.

సమంత పోస్ట్ వైరల్

మలయాళం సినిమా ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు వచ్చిన విషయం తెలుసు కదా. ఈ రిపోర్టు తర్వాత ప్రతి ఇండస్ట్రీలోని యాక్టర్స్ స్పందిస్తున్నారు. తాజాగా సమంత కూడా ఈ రిపోర్టుపై స్పందిస్తూ శుక్రవారం (ఆగస్ట్ 30) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ స్టోరీ పోస్ట్ చేసింది.

"తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని మా మహిళలంతా హేమ కమిటీ రిపోర్టును స్వాగతిస్తున్నాం. కేరళలో వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) చేస్తున్న కృషిని అభినందిస్తున్నాం. వాళ్ల కృషే ఈ ఉద్యమానికి దారి తీసింది.

ఆ డబ్ల్యూసీసీ నుంచి స్ఫూర్తి పొందే.. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మహిళల కోసం ఏర్పడిన సపోర్ట్ గ్రూపు ది వాయిస్ ఆఫ్ వుమెన్ 2019లో ఏర్పాటైంది. లైంగిక వేధింపులపై సబ్ కమిటీ సమర్పించిన రిపోర్టును పబ్లిష్ చేయాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

ఇది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసే మహిళల రక్షణ చర్యల కోసం ప్రభుత్వం, ఇండస్ట్రీ చేపట్టబోయే విధానాలకు తోడ్పడుతుంది" అనే వాయిస్ ఆఫ్ వుమెన్ ప్రకటనను సమంత స్టోరీస్ లో పోస్ట్ చేసింది.

మలయాళం ఇండస్ట్రీలో వేధింపులు

మలయాళం సినిమా ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు నిజమే అని హేమ కమిటీ రిపోర్టు వెల్లడించిన విషయం తెలిసిందే. అక్కడి మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ లో ఉన్న సభ్యులపైనే ఎన్నో ఆరోపణలు రావడంతో అందరూ రాజీనామా చేశారు. నటుడు, ఎమ్మెల్యే అయిన ముఖేష్ పైన కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.

ఇటు తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా కొందరు తమ గళం విప్పారు. ఈ ఇండస్ట్రీలో వేధింపులు చాలా దారుణంగా ఉన్నాయని, ఎన్నో ఏళ్లుగా పరిస్థితిలో మార్పు రాలేదని తమిళ నటి కుట్టి పద్మిణి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత పోస్ట్ పై చర్చ జరుగుతోంది.