Venuswamy Couple Video : ఇదే మా మరణ వాంగ్మూలం, వేణుస్వామి దంపతుల సంచలన వీడియో-venu swamy couple sensational video on senior journalist blackmailing ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Venuswamy Couple Video : ఇదే మా మరణ వాంగ్మూలం, వేణుస్వామి దంపతుల సంచలన వీడియో

Venuswamy Couple Video : ఇదే మా మరణ వాంగ్మూలం, వేణుస్వామి దంపతుల సంచలన వీడియో

Bandaru Satyaprasad HT Telugu
Aug 19, 2024 10:14 PM IST

Venuswamy Couple Video : ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి దంపతులు సంచలన వీడియో విడుదల చేశారు. తమను ఓ సీనియర్ జర్నలిస్ట్ రూ.5 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తు్న్నారని ఆరోపించారు. అంత డబ్బు తమ వద్ద లేదని ఇక మాకు మరణమే శరణ్యమని ఆవేదన చెందారు.

ఇదే మా మరణ వాంగ్మూలం, వేణుస్వామి దంపతులు సంచలన వీడియో
ఇదే మా మరణ వాంగ్మూలం, వేణుస్వామి దంపతులు సంచలన వీడియో

Venuswamy Couple Video : రాజకీయ నేతలు, సెలబ్రిటీల జాతకాలు చెప్పే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చిక్కుల్లో పడ్డారు. నిన్నటి వరకూ సెలబ్రిటీల భవిష్యత్తు గురించి సంచలన ప్రకటనలు చేసిన ఆయనకు వింత పరిస్థితి ఎదురైంది. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ గెలుస్తోందన్న వేణుస్వామి ప్రిడిక్షన్ తప్పడంతో..ఇకపై పొలిటికల్, సెలబ్రిటీల జాతకాలు చెప్పనని ఈ మధ్య ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఇంతలోనే నాగచైతన్య, శోభిత ఫ్యూచర్ గురించి చెప్పి లేని కష్టాలు తెచ్చిపెట్టుకున్నారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో వేణుస్వామి లక్ష్యంగా ట్రోలింగ్ మొదలైంది. నాగచైతన్య, సమంత ఎపిసోడ్ కు ఈ జాతకం ఎక్స్ టెన్షన్ అని వేణుస్వామి కవర్ చేసుకున్నా సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థలు వేణుస్వామిని వదలడంలేదు. దీంతో వేణుస్వామి సతీమణి వీణా శ్రీవాణి ఎంటర్ అయ్యి...కొన్ని మీడియా సంస్థలే ఇందుకు కారణమని ఫైర్ అయ్యారు. తాజాగా వీరిద్దరూ సంచనలన వీడియో పోస్టు చేశారు.

ఓ ప్రముఖ జర్నలిస్ట్ తమను రూ.5 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు వేణుస్వామి దంపతులు. ఈ మేరకు వారిద్దరూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ ఓ వర్గం తమను వేధిస్తుందని, ఓ ఫోన్‌ కాల్‌ ఆడియోను విడుదల చేశారు. తమ వద్ద అంత డబ్బు లేదని, ఇక మాకు ఆత్మహత్య శరణ్యం అంటూ సంచలన ప్రకటన చేశారు. మమ్మల్ని రూ. 5 కోట్లు అడుగుతున్నారని, అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తీసుకురాగలం ప్రశ్నించారు.

ఇదే మా మరణ వాంగ్మూలం

నా బంగారం, నా కూతురు బంగారం అమ్మినా అంత డబ్బు రాదని వేణుస్వామి సతీమణి వాపోయారు. వాళ్లు డిమాండ్ చేసిన డబ్బు ఇచ్చే వరకు మమ్మల్ని వదిలేలా లేరని, దీంతో ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నామని వీడియో రిలీజ్ చేశారు. ఒకవేళ మేము ఆత్మహత్య చేసుకున్నా దానిని కూడా తప్పుగానే క్రియేట్‌ చేస్తారని ఆరోపించారు. సోషల్‌ మీడియాలో తమపై జరుగుతున్న దుష్పచారాన్ని తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నామని వాళ్లే వార్తలు ఇస్తారన్నారు. మా చావును అలా ఉపయోగించుకోకూడదనే ఈ వీడియో చేశామన్నారు. ఈ వీడియోను మా మరణ వాంగ్మూలంగా తీసుకుంటారని ఆశిస్తున్నామని వేణుస్వామి దంపతులు అన్నారు. వారు పోస్టు చేసిన ఒక్క ఆడియోనే కాదు, మా వద్ద ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయని, మమ్మల్ని మమ్మల్ని ఇంకొన్ని రోజులు బతకనిస్తే ఇంకా వాళ్ల గురించి సాక్ష్యాలు ఈ ప్రపంచానికి చూపిస్తామన్నారు.

హీరో నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటారని చెప్పిన వేణుస్వామి పేరు ఒక్కసారిగా మీడియాలో మారుమోగిపోయింది. ఈ వాస్తవం కావడంతో ఆయన మరింత పాపులర్ అయ్యారు. ఆ తర్వాత చాలా మంది సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను చెబుతూ వచ్చారు. రాజకీయాల్లో కూడా ఆ పార్టీ గెలుస్తుంది, ఈ నేత సీఎం అవుతారని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో వేణుస్వామికి కాస్త పొలిటికల్ మైలెజ్ వచ్చింది. ఎన్నికల్లో వేణుస్వామి చెప్పినట్లు జరక్కపోవడం, నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో చిక్కుల్లో పట్టారు.

సంబంధిత కథనం