Salaar Trending: నేడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘సలార్’.. ఎందుకో తెలుసా!-prabhas prithvi raj sukumaran movie salaar tredning in social media on international friendship day ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Trending: నేడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘సలార్’.. ఎందుకో తెలుసా!

Salaar Trending: నేడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘సలార్’.. ఎందుకో తెలుసా!

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 04, 2024 03:00 PM IST

Salaar Movie Trending: సలార్ సినిమా భారీ హిట్ అయింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం గడేడాది డిసెంబర్‌లో థియేటర్లలోకి వచ్చి బ్లాక్‍బస్టర్ కొట్టింది. అయితే, నేడు ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Salaar Trending: నేడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘సలార్’.. ఎందుకో తెలుసా!
Salaar Trending: నేడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘సలార్’.. ఎందుకో తెలుసా! (Instagram)

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా గతేడాది 2023 డిసెంబర్‌లో వచ్చి బంపర్ హిట్ అయింది. ఈ హైవోల్టేజ్ యాక్షన్ చిత్రంలో మలయాళ స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా లీడ్ రోల్ చేశారు. ఈ చిత్రానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. సలార్ మూవీలో ప్రాణస్నేహితులైన దేవగా ప్రభాస్, వరదరాజ మన్నార్‌గా పృథ్విరాజ్ నటించారు. కాగా, సలార్ సినిమా నేడు (ఆగస్టు 4, 2024) సోషల్ మీడియాలో ప్లాట్‍ఫామ్‍ ఎక్స్ (ట్విట్టర్)లో ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే..

ఫ్రెండ్‍షిప్ డే కావటంతో..

సలార్ సినిమాలో స్నేహం ముఖ్యమైన అంశంగా ఉంది. దేవ (ప్రభాస్), వరద రాజమన్నార్ (పృథ్విరాజ్ సుకుమారన్) మధ్య ఫ్రెండ్‍షిప్‍తోనే ఈ మూవీ సాగుతుంది. దీంతో, నేడు (ఆగస్టు 4) అంతర్జాతీయ ఫ్రెండ్‍షిప్ డే కావటంతో సోషల్ మీడియాలో సలార్ హ్యాష్‍ట్యాగ్ ట్రెండింగ్‍లోకి వచ్చింది. ఈ చిత్రం గురించి చాలా మంది పోస్టులు చేస్తున్నారు.

సలార్‌లో స్నేహం

సలార్ మూవీలో వరద రాజమన్నార్‌ను తిట్టినందుకు చిన్నతనంలోనే ఫైట్ చేస్తాడు దేవ. ఆ తర్వాత దేవను కాపాడేందుకు వరద త్యాగం చేస్తాడు. దేవ వేరే చోటికి వెళ్లిపోతాడు. పెద్దయ్యాక ఖాన్సార్‌లో ఎదురుదెబ్బలు తగలడంతో సాయం కోసం తన స్నేహితుడే ఆర్మీ అంటూ దేవను తీసుకెళతాడు వరద రాజమన్నార్. తన స్నేహితుడి కోసం భీకర పోరు చేస్తాడు దేవ. ఇలా సలార్ పార్ట్-1 మూవీ మొత్తం దేవ, వరద స్నేహం చుట్టూ తిరుగుతుంది. హైవోల్టేజ్ యాక్షన్ చిత్రమైనా వీరిద్దరి మధ్య స్నేహాన్ని బాగా హైలైట్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్.

స్నేహమే ప్రధానంగా ఉన్న సలార్ సినిమా నేడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. “ప్రతీ ఒక్కరి జీవితంలో సలార్ ఉండాలి. అందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు” అంటూ సలార్ టీమ్ ట్వీట్ చేసింది. దీంతో ఎక్స్‌లో సలార్ హ్యాష్‍ట్యాగ్ (#Salaar) ట్రెండ్ అవుతోంది.

సలార్ చిత్రానికి పార్ట్-2 కూడా రానుంది. శౌర్యాంగపర్వం పేరుతో ఈ రెండో భాగాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించనన్నారు. అయితే, ప్రాణ స్నేహితులుగా ఉండే దేవ, వరద రాజమన్నార్.. బద్ధ శత్రువులుగా మారనున్నారని ఇప్పటికే మేకర్స్ హింట్ ఇచ్చారు. సలార్ పార్ట్-2పై క్రేజ్ విపరీతంగా ఉంది.

సలార్ సినిమాలో ప్రభాస్, పృథ్విరాజ్ మెయిన్ రోల్స్ చేయగా.. శృతి హాసన్, ఈశ్వరి రావు, జగపతి బాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా.. రవిబస్రూర్ సంగీతం అందించారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ మూవీని నిర్మించారు.

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా భారీ బ్లాక్‍బస్టర్ అయింది. జూన్ 27న రిలీజైన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఇప్పటికే రూ.1,100 కోట్ల కలెక్షన్లను దాటేసింది. ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రం చేస్తున్నారు. తదుపరి సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ చిత్రానికి ఓకే చెప్పారు. హను రాఘవపూడితోనూ ఓ మూవీకి ప్రభాస్ గ్రీన్‍ సిగ్నల్ ఇచ్చారు. వీటి మధ్యలోనే సలార్ 2 చిత్రాన్ని కూడా చేయనున్నారు.