తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Web Series: టీవీలోకి వస్తోన్న తెలుగు సూపర్ హిట్ వెబ్‌సిరీస్ - ఏ ఛానెల్‌లో...ఎప్పుడు చూడాలంటే?

Telugu web series: టీవీలోకి వస్తోన్న తెలుగు సూపర్ హిట్ వెబ్‌సిరీస్ - ఏ ఛానెల్‌లో...ఎప్పుడు చూడాలంటే?

07 October 2024, 14:17 IST

google News
  • Telugu web series: 1990 కాలం నాటి జ్ఞాప‌కాల్నిప్ర‌తి ఒక్క‌రికి గుర్తుచేసిన నైంటీస్ మిడిల్ క్లాస్ బ‌యోపిక్‌ వెబ్‌సిరీస్ టీవీలోకి వ‌స్తోంది. అక్టోబ‌ర్ 12న శ‌నివారం ఈటీవీలో ఈ వెబ్‌సిరీస్ టెలికాస్ట్‌ కాబోతోంది. శివాజీ, వాసుకి ఆనంద్ ఈ వెబ్‌సిరీస్‌లో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

తెలుగు వెబ్‌సిరీస్‌
తెలుగు వెబ్‌సిరీస్‌

తెలుగు వెబ్‌సిరీస్‌

Telugu web series:ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైన తెలుగు వెబ్‌సిరీస్‌ నైంటీస్ మిడిల్ క్లాస్ బ‌యోపిక్‌ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న‌ది. 1990ల కాలం వారికి త‌మ బాల్య‌పు జ్ఞాప‌కాల్ని గుర్తుకుతెచ్చిన మంచి సిరీస్‌గా మ‌న్న‌న‌ల్ని అందుకున్న‌ది. ఈటీవీ ఓటీటీలో నైంటీస్ మిడిల్ క్లాస్ వెబ్‌సిరీస్‌కు 120కిపైగా మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. తెలుగులో హ‌య్యెస్ట్ వ్యూస్ ద‌క్కించుకున్న వెబ్‌సిరీస్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.

టీవీలో టెలికాస్ట్‌...

తాజాగా ఈ వెబ్‌సిరీస్ టీవీలో టెలికాస్ట్ కాబోతోంది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 12న శ‌నివారం ఈటీవీలో ఈ వెబ్‌సిరీస్ ప్ర‌సారం కానుంది. మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల నుంచి వెబ్‌సిరీస్ టెలికాస్ట్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఈటీవీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

శివాజీ రీఎంట్రీ...

నైంటీస్ మిడిల్ క్లాస్ బ‌యోపిక్‌ వెబ్‌సిరీస్‌లో సీనియ‌ర్ హీరో శివాజీ, వాసుకి ఆనంద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ వెబ్‌సిరీస్‌తోనే లాంగ్ గ్యాప్ త‌ర్వాత శివాజీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ముగ్గురు పిల్ల‌ల తండ్రిగా, వారి చ‌దువు కోసం ఆరాట‌ప‌డే మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఉపాధ్యాయుడిగా చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. మౌళి, రోహ‌న్ రాయ్‌, వాసంతిక ఈ సిరీస్‌లో కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సిరీస్‌కు ఆదిత్య హ‌స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డైరెక్ట‌ర్ న‌వీన్ మేడారం ప్రొడ్యూస్ చేశాడు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించాడు. మొత్తం ఆరు ఎపిసోడ్స్‌తో ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో టైటిల్‌తో మేక‌ర్స్ ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు.

మ‌ధ్య త‌ర‌గ‌తి తండ్రి క‌థ‌...

చంద్ర‌శేఖ‌ర్ (శివాజీ) గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్‌లో మ్యాథ్స్ టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. త‌న పిల్ల‌లు ర‌ఘు, దివ్య‌, అర్జున్‌ల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పెంచాల‌ని ఆరాట‌ప‌డుతుంటాడు. పెద్ద కుమారుడు రఘు (మౌళి తనూజ్ ప్రశాంత్).. పదో తరగతిలో జిల్లా ఫస్ట్ వస్తాడని నమ్మకంతో ఉంటాడు. అమ్మాయి దివ్య (వసంతిక) చ‌దువుతో ముందుంటుంది. చిన్నోడు అర్జున్ (రోహన్) మాత్రం ఇద్ద‌రికి భిన్నంగా ఉంటాడు. చ‌దువుపై అస్స‌లు ఆస‌క్తి ఉండ‌దు. ఎందులోనూ ప‌దికి మంచి మార్కులు రావు.

చంద్రశేఖర్, ఆయన భార్య రాణి (వాసుకీ ఆనంద్). మధ్య తరగతి ఆప్యాయతలు, ఆలోచనలతో జీవిస్తుంటారు. సుజిత (స్నేహల్)ను రఘుతేజ ప్రేమిస్తాడు. క్రికెట్ అంటే కూడా ఇష్టపడుతుంటాడు. మరి చంద్రశేఖర్ ఆశించినట్టు రఘుతేజకు పదో తరగతిలో జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? వీరి కుటుంబంలో జరిగిన పరిస్థితులేంటి? ఉపాధ్యాయుడిగా చంద్రశేఖర్ సాధించే ఘనత ఏంటి?

రఘు ప్రేమ సంగతి ఏమైంది? ఆదిత్య దారిలోకి వ‌చ్చాడా? లేదా? అన్న‌దే ఈ సిరీస్ క‌థ‌. 1990 దశకాల్లో సగటు మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే పరిస్థితుల చుట్టూ ఈ కథను దర్శకుడు ఆదిత్య హసన్ రాసుకున్నారు. నైంటీస్ మిడిల్ క్లాస్ మెలోడీస్‌కు సెకండ్ సీజ‌న్ రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

టాలీవుడ్‌లో బిజీ...

నైంటీస్ వెబ్‌సిరీస్‌తో న‌టుడిగా టాలీవుడ్‌లో బిజీ అయ్యాడు శివాజీ. ప్ర‌స్తుతం మూడు సినిమాలు చేస్తాడు. మ‌రోవైపు ద‌ర్శ‌కుడు ఆదిత్య హాస‌న్ టీచ‌ర్ పేరుతో ఓ మూవీ చేశాడు. క‌ల‌ర్స్ స్వాతి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధ‌మైంది.

తదుపరి వ్యాసం