Jai Jai Ganesha Promo: రష్మి డ్యాన్స్ కోసమే జబర్ధస్థ్ చూస్తున్నా - బిగ్‌బాస్ శివాజీ కామెంట్స్‌-kushbu indraja dance skits highlights on jai jai ganesh promo vinayaka chavithi special event telecast on etv on septemb ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jai Jai Ganesha Promo: రష్మి డ్యాన్స్ కోసమే జబర్ధస్థ్ చూస్తున్నా - బిగ్‌బాస్ శివాజీ కామెంట్స్‌

Jai Jai Ganesha Promo: రష్మి డ్యాన్స్ కోసమే జబర్ధస్థ్ చూస్తున్నా - బిగ్‌బాస్ శివాజీ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 06, 2024 02:19 PM IST

Jai Jai Ganesha Promo: సీనియ‌ర్ హీరోయిన్లు ఇంద్ర‌జ‌, ఖుష్బూ ఫ‌స్ట్ ఒకే వేదిక‌పై క‌నిపించ‌బోతున్నారు. వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా ఈటీవీలో జై జై గ‌ణేశా పేరుతో ఓ స్పెష‌ల్ షో టెలికాస్ట్ కానుంది. ఈ షోలో ఇంద్ర‌జ‌, ఖుష్బూల‌తో పాటు హీరో శివాజీ కూడా సంద‌డి చేశాడు.

జై జై గ‌ణేశా ప్రోమో
జై జై గ‌ణేశా ప్రోమో

Jai Jai Ganesha Promo: తెలుగు టీవీ షోస్‌కు జ‌డ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తోన్న సీనియ‌ర్ హీరోయిన్లు ఖుష్బూ, ఇంద్ర‌జ ఫ‌స్ట్ టైమ్‌ ఒకే వేదిక‌పై క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ఈటీవీలో టెలికాస్ట్ అవుతోన్న శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇంద్ర‌జ, జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షోకు ఖుష్బూ జ‌డ్జ్‌లుగా కొన‌సాగుతోన్నారు. వినాయక చవితి స్పెషల్‌గా ఈటీవీలో జై జై గణేశా అనే ఈవెంట్‌లో సీనియ‌ర్ హీరోయిన్లు ఇద్ద‌రు క‌లిసి సంద‌డి చేయ‌బోతున్నారు. జై జై గ‌ణేశా శనివారం ఉదయం 9 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది ఈ స్పెష‌ల్ షోలో ఇంద్ర‌జ‌, ఖుష్బూల‌తో పాటు హీరో శివాజీ పాల్గొన‌నున్నారు. జై జై గ‌ణేశా ప్రోమో యూట్యూబ్‌లో వైర‌ల్ అవుతోంది.

టైమొచ్చింది...వ‌చ్చాను...

ఈ ప్రోమోలో త‌న కామెడీ టైమింగ్‌తో శివాజీ న‌వ్వుల‌ను పంచారు. మా ముగ్గురిని పిలిచి మీరేంటి లేట్‌గా వ‌చ్చారంటూ శివాజీని ఈ ప్రోమోలో నిల‌దీస్తూ ర‌ష్మి క‌నిపించింది. నేను లేట్ రాలేదు. టైమొచ్చింది వ‌చ్చాను అంటూ శివాజీ పంచ్ వేశారు.

పోగ్రామ్‌కు జ‌డ్జ్‌గా రాబోతున్నా...

ఈటీవీలో రాబోతున్న ఒక పోగ్రామ్‌కు జ‌డ్జ్‌గా రాబోతున్న‌ట్లు శివాజీ ప్ర‌క‌టించాడు. హ‌మ్మ‌య్య జ‌డ్జ్‌గానే క‌దా నేనే సేఫ్ అని ర‌ష్మి అన్న‌ది. అది జ‌డ్జ్‌...యాంకారా అన్న‌ది చెబుతా అంటూ శివాజీ ప్ర‌క‌టించాడు. ఇంత‌కీ ఏ షోకు జ‌డ్జ్‌గా వ‌స్తున్నార‌ని శివాజీని ఇంద్ర‌జ రొమాంటిక్‌గా అడిగింది. త‌ర్వాత చెబుతా అని శివాజీ బ‌దులిచ్చాడు.

ఈ ప్రోమోలో కొన్ని ఫ‌న్నీ గేమ్స్‌లో ఇంద్ర‌జ‌, ఖుష్బూ పోటీప‌డిన‌ట్లుగా చూపించారు. ఇంద్రజ‌పై హైప‌ర్ ఆది వేసిన పంచ్‌లు న‌వ్విస్తున్నాయి. వ‌ర‌ద విప‌త్తుపై చేసిన స్కిట్ కంటెస్టెంట్స్‌తో పాటు జ‌డ్జ్‌ల‌ను కంట‌త‌డిపెట్టింది.

బ‌ల‌గం మూవీ స్కిట్‌...

జై జై గ‌ణేషా ఈవెంట్‌లో బ‌ల‌గం మూవీపై స్కిట్ వేశారు. ఈ స్కిట్‌లో బ‌ల‌గం హీరోయిన్ కావ్య క‌ళ్యాణ్ రామ్ పాల్గొన్న‌ది. బోలో కృష్ణ ముకుంద మురారి పాట‌కు ఇంద్ర‌జ‌, ఖుష్బూ డ్యాన్స్ చేశారు. వారి డ్యాన్సుల‌కు శివాజీ ఫిదా అయ్యాడు. మేడ‌మ్...మేడ‌మ్ అంతే అంటూ కామెంట్ చేశాడు.

ర‌ష్మి కోస‌మే జ‌బ‌ర్ధ‌స్థ్ చూడ‌టం మొద‌లుపెట్టా...

చెప్ప‌మ్మ చెప్ప‌మ్మ పాట‌కు ర‌ష్మి చేసిన డ్యాన్స్ ఈ ప్రోమోకు హైలైట్‌గా నిలిచింది. ఈ పాట‌లో గ్లామ‌ర‌స్‌గా ర‌ష్మి క‌నిపించింది. నేను జ‌బ‌ర్ధ‌స్థ్ చూడ‌టం మొద‌లుపెట్టిందే ర‌ష్మి డ్యాన్స్ చూడ‌టం కోసం అంటూ శివాజీ కామెంట్స్ చేయ‌డం న‌వ్వుల‌ను పూయించింది.