Samantha: ఏడాదిన్నర తర్వాత కెమెరా ముందుకు సమంత- తుంబాద్ దర్శకుడితో హారర్ వెబ్‌సిరీస్
Samantha: దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చింది సమంత. హారర్ వెబ్‌సిరీస్ షూటింగ్ మొదలుపెట్టింది. రక్త్ బ్రహ్మాండ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌కు తుంబాద్ ఫేమ్ రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తోన్నాడు.
Samantha: అభిమానులకు సమంత గుడ్‌న్యూస్ వినిపించింది. లాంగ్ గ్యాప్ తర్వాత తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టింది. హారర్ వెబ్‌సిరీస్ షూటింగ్ మొదలుపెట్టింది. మయోసైటీస్ కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు షూటింగ్‌లకు బ్రేక్ తీసుకుంది సమంత. సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు పూర్తిగా దూరంగా ఉన్న సమంత మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టింది. హిందీ వెబ్‌సిరీస్ షూటింగ్‌ను మొదలుపెట్టింది. ఈ విషయాన్ని సమంత స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
తన పేరుతో ఉన్న స్క్రిప్ట్ బుక్ ఫొటోను అభిమానులతో పంచుకున్నది. కనలు కనడం ఎప్పుడూ ఆపోద్దు అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత సెట్స్‌లో అడుగుపెట్టడం ఆనందంగా ఉందంటూ చెప్పింది. రక్త బ్రహ్మాండ్ అంటూ సిరీస్ టైటిల్‌ను ట్యాగ్ చేసింది.
తుంబాద్ దర్శకుడితో...
రక్త్ బ్రహ్మాండ్ వెబ్‌సిరీస్‌కు తుంబాద్ రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తోన్నట్లు తెలిసింది. ఫ్యామిలీ మ్యాన్ దర్శకద్వయం రాజ్ డీకే ఈ సిరీస్‌కు క్రియేటర్స్‌గా, ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తోన్నారు. ఔట్ అండ్ ఔట్ హారర్ కథాంశంతో రక్త్ బ్రహ్మాండ్ వెబ్‌సిరీస్ రూపొందుతోన్నట్లు తెలిసింది. ఈ సిరీస్‌లో ఛాలెంజింగ్ రోల్‌లో సమంత కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
బాలీవుడ్ హీరోలు...
రక్త్ బ్రహ్మాండ్ వెబ్‌సిరీస్‌లో సమంతతో పాటు బాలీవుడ్ హీరోలు అలీ ఫజల్, ఆదిత్యరాయ్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. వారితో పాటు వామికా గబ్బి కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం సమంతతో పాటు ప్రధాన తారాగణంపై ముంబాయిలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోన్నట్లు తెలిసింది.
నెట్‌ఫ్లిక్స్‌లో...
రక్త్ బ్రహ్మాండ్ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. వచ్చే ఏడాది ఆరంభంతో ఈ వెబ్‌సిరీస్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తోన్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది.
ఖుషి తర్వాత బంగారం...
గత ఏడాది ఖుషి మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది సమంత. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది. ఖుషి తర్వాత తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత ఈ ఏడాది తన బర్త్‌డే సందర్భంగా బంగారం పేరుతో ఓ మూవీని అనౌన్స్ చేసింది. ఈ సినిమాను ప్రకటించి ఆరు నెలలు అయినా ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు.
సిటాడెట్ వెబ్‌సిరీస్..
మరోవైపు ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత హిందీలో సిటాటెడ్ హనీ బన్నీ పేరుతో ఓ యాక్షన్ వెబ్‌సిరీస్ చేసింది సమంత. అమెజాన్ ప్రైమ్ వీడియోఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో సమంతతో పాటు వరుణ్ ధావన్ మెయిన్ లీడ్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఈ ఏడాది చివరలోనే ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ కానున్నట్లు సమాచారం.