తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cantonment Brs Candidate : సాయన్న కుటుంబానికే సీటు, కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత?

Cantonment BRS Candidate : సాయన్న కుటుంబానికే సీటు, కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత?

07 April 2024, 22:41 IST

google News
    • Cantonment BRS Candidate : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల అభ్యర్థిగా సాయన్న కుమార్తె నివేదిత పేరును బీఆర్ఎస్ దాదాపుగా ఖరారు చేసింది.
 కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత
కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత

కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత

Cantonment BRS Candidate : సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ ఉపఎన్నిక(Cantonment By Election) బీఆర్ఎస్ అభ్యర్థిని(BRS Candidate) ఆ పార్టీ దాదాపుగా ఖరారు చేసింది. దివంగత సాయన్న కూతురు నివేదిత(Niveditha) పేరును కేసీఆర్ దాదాపుగా ఫైనల్ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన్న గుండె పోటుతో మరణించగా...ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సాయన్న కూతురు లాస్య నందిత (Lasya Nanditha)పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఓఆర్ఆర్ పై జరిగిన ప్రమాదంలో లాస్య నందిత మరణించారు. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ బై ఎలక్షన్ నిర్వహిస్తారు. అయితే ఈ స్థానం నుంచి దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత చెల్లెలు నివేదితకు బీఆర్ఎస్ సీటు కేటాయించింది.

ఫామ్ హౌస్ లో కేసీఆర్ చర్చలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పార్టీ ముఖ్యనేతలతో ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌(farm house)లో ఆదివారం సమావేశమయ్యారు. వరంగల్ లోక్ సభ స్థానం, కంటోన్మెంట్ ఉపఎన్నిక(Cantonment By Election)అభ్యర్థి ఖరారుపై నేతలతో చర్చించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, దివంగత సాయన్న కుటుంబ సభ్యలు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం ఎస్సీ రిజర్వుడ్. ఇక్కడి నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జి.సాయన్న(G Sayanna) విజయం సాధించారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరిలో గుండెపోటుతో మరణించారు. గత నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాయన్న కుమార్తె లాస్య నందితకు(Lasya Nanditha) బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో లాస్య నందిత విజయం సాధించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. దీంతో కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. మే 13న ఉపఎన్నికల జరుగనుంది.

కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్

కంటోన్మెంట్ ఉపఎన్నికలో(Cantonment By Election 2024) కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన పేరును ఖరారు చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. శ్రీ గణేశ్… ఇటీవలే బీజేపీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్(Cantonment) నుంచి బీఆర్ఎస్ తరపున లాస్య నందిత విజయం సాధించారు. బీజేపీ తరపున పోటీ చేసిన శ్రీ గణేశ్ కు 41 వేల ఓట్లు రాగా... నందితకు 59 వేలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో 17,169 ఓట్ల తేడాతో నందిత విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ తరపున గద్దర్ కుమార్తె వెన్నల పోటీ చేయగా...20,825 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే ఈసారి వెన్నెలకు కాకుండా.... పార్టీలో చేరిన శ్రీ గణేశ్ కు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.

తదుపరి వ్యాసం