తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Congress Telangana Manifesto 2024 : తెలంగాణకు కాంగ్రెస్‌ ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల - కీలక హామీలివే

Congress Telangana Manifesto 2024 : తెలంగాణకు కాంగ్రెస్‌ ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల - కీలక హామీలివే

03 May 2024, 14:27 IST

google News
    • Loksabha Elections in Telangana 2024 : పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణకు ప్రత్యేక మేనిఫోస్టును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇందులో ITIR, సుప్రీంకోర్టు బెంచ్, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీతో పాటు పలు ముఖ్య అంశాలను ప్రస్తావించింది.
తెలంగాణకు కాంగ్రెస్‌ ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల
తెలంగాణకు కాంగ్రెస్‌ ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల (T Congress Twitter)

తెలంగాణకు కాంగ్రెస్‌ ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల

Congress Telangana Manifesto 2024 : లోక్ సభ ఎన్నికలకు సంబంధించి జాతీయ స్థాయిలో ‘ఐదు న్యాయాలు’(Congress 5 Nyay) పేరుతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణకు సంబంధించి ప్రత్యేక హామీలను ఇస్తూ అనుబంధ మేనిఫెస్టోను విడుదల చేసింది.  

‘ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం’ పేరుతో ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ(Congress Telangana Manifesto 2024) ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హామీలను ఇచ్చింది.  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్. రీజియన్(ITIR) ప్రాజెక్టును పునఃప్రారంభిస్తామని తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం…  కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, హైదరాబాదులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM),  హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్క నుంచి రాపిడ్ (వేగవంతమైన) రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపింది.

మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలు :

  • భద్రాచల దేవాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామాలు ఎటపాక, గుండాల, పురుషోత్తం పట్నం, కన్నెగూడెం, పిచుకలపాడులు తిరిగి తెలంగాణాలో విలీనం చేస్తామని హామీనిచ్చింది.  పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తామని తెలిపింది. 
  • నీతి అయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ లో ఏర్పాటుతో పాటు తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణం.
  • రామగుండం-మణుగూరు నూతన రైల్వే లైన్ నిర్మాణం చేస్తామని మేనిఫెస్టోలో ప్రస్తావించింది.  తెలంగాణకు నాలుగు నూతన సైనిక పాఠశాలల కేటాయింపుతో పాటు కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంచుతామని పేర్కొంది. 
  • నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు,  జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం నిర్మాణం.
  • తెలంగాణలో నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు.
  • అధునాతన వైద్య పరిశోధనల కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ICMR) పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు.
  • 73 మురియ 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ సర్పంచ్ లకు నేరుగా బదిలీ చేస్తామని హామీ.
  • ప్రతి ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ ఏర్పాటు.
  • కొత్త ఇండస్ట్రీయల్ కారిడార్ల ఏర్పాట్లు.
  • అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక, వినోద కేంద్రం.
  •  మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ హోదా.
  • తెలంగాణలో డ్రై పోర్టు ఏర్పాటుతో పాటు హైదరాబాదులో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చింది.

తదుపరి వ్యాసం