Sammakka Sarakka Tribal University : సమ్మక్క - సారక్క ట్రైబల్ వర్శిటీలో అడ్మిషన్లు - కోర్సులు, ముఖ్య తేదీలివే-mulugu sammakka sarakka central tribal university admission notification 2024 released check full details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sammakka Sarakka Tribal University : సమ్మక్క - సారక్క ట్రైబల్ వర్శిటీలో అడ్మిషన్లు - కోర్సులు, ముఖ్య తేదీలివే

Sammakka Sarakka Tribal University : సమ్మక్క - సారక్క ట్రైబల్ వర్శిటీలో అడ్మిషన్లు - కోర్సులు, ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Mar 10, 2024 12:43 PM IST

Sammakka Sarakka Central Tribal University Admissions : సమ్మక్క - సారక్క ట్రైబల్ వర్శిటీ(Sammakka Sarakka Central Tribal University) నుంచి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ లో దరఖాస్తులు ప్రారంభం కాగా.. మార్చి 26వ తేదీ వరకు స్వీకరించనున్నారు.

సమ్మక్క - సారక్క ట్రైబల్ వర్శిటీలో అడ్మిషన్లు
సమ్మక్క - సారక్క ట్రైబల్ వర్శిటీలో అడ్మిషన్లు

Sammakka Sarakka Central Tribal University Admissions 2024: తెలంగాణలోని ములుగు జిల్లాలో సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్శిటీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటీవలే తాత్కాలిక భవనాలను కూడా ప్రారంభించారు. ఇదే సమయంలో వర్శిటీలో ప్రవేశాల కోసం అడ్మిషన్ల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. బీఏ ప్రోగ్రామ్ లో కోర్సులను ఆఫర్ చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదలైంది. ఇందులో ఇంగ్లీష్ అనర్స్ తో పాటు సోషల్ సైనెన్స్ కోర్సులు ఉన్నాయి. నాలుగేళ్ల కాలపరిమితితో వీటిని ప్రవేశపెట్టారు. దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం కాగా.... మార్చి 26వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.

ముఖ్య వివరాలు :

అడ్మిషన్ల ప్రకటన - సమ్మక్క- సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ, ములుగు, తెలంగాణ

ప్రవేశాలు - బీఏ

సబ్జెక్టులు - బీఏ - ఇంగ్లీష్ ఆనర్స్, బీఏ సోషల్ సైన్సెస్ హానర్స్)

కోర్సు కాలపరిమితి - నాలుగేళ్లు

అర్హతలు - 60 మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ప్రవేశాల ప్రక్రియ విధానం - సెంట్రల్ యూనివర్శిటీ ఎంట్రెన్స్ పరీక్ష -2024 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

దరఖాస్తులు - ఆన్ లైన్

దరఖాస్తులకు చివరి తేదీ - మార్చి 26,2024.

దరఖాస్తుల లింక్ - https://exams.nta.ac.in/CUET-UG

వర్శిటీ అధికారిక వెబ్ సైట్ - https://ssctu.ac.in/

ములుగు జిల్లాలో ఏర్పాటైన సమ్మక్క - సారక్క సెంట్రల్ వర్శిటీని(Sammakka Sarakka Central Tribal University) రూ. 889 కోట్లతో పూర్తి చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్ లో తరగతులను ప్రారంభించగా… త్వరలోనే పూర్తిస్థాయి భవనాలను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తోంది.

CUET UG 2024 Notification: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ లేదా సీయూఈటీ యూజీ 2024 కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలు కల్పించే పోర్టల్ ను ఎన్టీఏ ప్రారంభించింది. అభ్యర్థులు సీయూఈటీ యూజీ 2024 అధికారిక వెబ్సైట్ https://exams.nta.ac.in/CUET-UG లో ద్వారా అప్లై చేసుకోవచ్చు.

సీయూఈటీ యూజీ 2024 (CUET UG 2024) కోసం దరఖాస్తు ఫారాన్ని సమర్పించడానికి చివరి తేదీ 26 మార్చి 2024. సీయూఈటీ యూజీ 2024 రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ విండో మరియు ఫీజు చెల్లింపు విండో మార్చి 26, 2024 రాత్రి 11:50 గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత, మార్చి 26 నుంచి మార్చి 28, 2024 రాత్రి 11.50 గంటలకు కరెక్షన్ విండో ఓపెన్ గా ఉంటుంది. సీయూఈటీ 2024 పరీక్ష సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ లను 2024 ఏప్రిల్ 30న విడుదల చేయనున్నారు. సీయూఈటీ (యూజీ) - 2024 పరీక్షను భారతదేశం వెలుపల 26 నగరాలతో సహా మొత్తం 380 నగరాల్లో నిర్వహిస్తామని ఎన్టీఏ తెలిపింది.

ఇలా అప్లై చేయండి..

సీయూఈటీ యూజీ 2024 (CUET UG 2024) కు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ను ఫాలో కావాలి.

ముందుగా ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ https://exams.nta.ac.in/CUET-UG

హోం పేజీపై కనిపించే అప్లికేషన్ ఫామ్ లింక్ ను క్లిక్ చేయాలి.

వ్యక్తిగత వివరాలను నమోదు చేసి కొత్త అభ్యర్థిగా నమోదు చేసుకునేందుకు వీలు కల్పించే పేజీని తెరవండి.

రిజిస్టర్ చేసుకుని మీ లాగిన్ వివరాలు పొందండి.

లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ నింపాలి.

ఫొటో సహా అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయండి.

ధృవీకరణ పేజీని డౌన్లోడ్ చేయండి.

భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ను, ధ్రువీకరణ పేజీని డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోండి.

Whats_app_banner