తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Rahul Gandhi Rae Bareli : ‘సేఫ్​ సీట్​’ రాయ్​ బరేలీలో రాహుల్​ గాంధీ పోటీ.. కాంగ్రెస్​ స్ట్రాటజీ ఇదే!

Rahul Gandhi Rae Bareli : ‘సేఫ్​ సీట్​’ రాయ్​ బరేలీలో రాహుల్​ గాంధీ పోటీ.. కాంగ్రెస్​ స్ట్రాటజీ ఇదే!

Sharath Chitturi HT Telugu

03 May 2024, 13:36 IST

google News
    • Lok Sabha elections Congress : రాహుల్​ గాంధీని రాయ్​ బరేలీ నుంచి కాంగ్రెస్​ ఎందుకు బరిలో దింపింది? దీని వెనుక స్ట్రాటజీ ఏంటి? వయనాడ్​లో కూడా పోటీ చేస్తున్న ఆయన.. రాయ్​ బరేలీలో కూడా గెలిస్తే.. దేనిని వదులుకుంటారు?
రాహుల్​ గాంధీ- ప్రియాంక గాంధీ..
రాహుల్​ గాంధీ- ప్రియాంక గాంధీ..

రాహుల్​ గాంధీ- ప్రియాంక గాంధీ..

Rahul Gandhi Rae Bareli : 2024 లోక్​సభ ఎన్నికల్లో రాయ్​ బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? అన్న ఉత్కంఠకు తెరపడింది. అందరు అనుకున్నట్టు.. తల్లి సోనియా గాంధీ సీటు నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయడం లేదు. రాయ్​ బరేలీలో రాహుల్​ గాంధీ బరిలో దిగుతున్నారు. ఆయన ఇప్పటికే కేరళ వయనాడ్​లో పోటీ చేస్తున్నారు. మరి.. రాహుల్​ గాంధీని రెండు చోట్ల కాంగ్రెస్​ ఎందుకు దింపింది? స్ట్రాటజీ ఏంటి? అసలు రాయ్​ బరేలీకి.. ‘కాంగ్రెస్​ కంచుకోట’ అని పేరెందుకు ఉంది?

అమేఠీ కన్నా రాయ్​ బరేలీ ఇంకా 'సేఫ్​'..!

ఉత్తర్​ ప్రదేశ్​ రాయ్​ బరేలీ.. కాంగ్రెస్​కు కంచుకోట లాంటింది. మరీ ముఖ్యంగా.. ఒక్కసారి మినహాయిస్తే (1977లో ఇందిరా గాంధీ ఓటమి) అక్కడి ప్రజలు.. గాంధీలను, గాంధీ మద్దతుదారులను విడిచిపెట్టింది లేదు.

రాయ్​ బరేలీ.. గాంధీ కుటుంబం మధ్య ఉన్న బంధం 1952 నుంచి కొనసాగుతోంది. 1952లో రాహుల్​ గాంధీ తాత- ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్​ గాంధీ ఇక్కడ తొలిసారిగా పోటీ చేసి గెలిచారు. 1957లో కూడా విజయం సాధించారు. ఆ తర్వాత.. 1967నుంచి 1977 వరకు.. ఇందిరా గాంధీ ఇక్కడ ఎంపీగా కొనసాగారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కానీ.. 1980లో జరిగిన ఎన్నికల్లో రాయ్​ బరేలీతో సహా అప్పటి ఆంధ్రప్రదేశ్​లోని మెదక్​ నుంచి పోటీ చేశారు. రెండింట్లో గెలిచారు. కానీ రాయ్​ బరేలీని ఆమె విడిచిపెట్టేశారు.

Congress Rae Bareli : 1980 నుంచి గాంధీ కుటుంబం మద్దతుదారులు అరుణ్​ నెహ్రూ, శైలా కౌల్​, కెప్టెన్​ సతీశ్​ శర్మలు.. 2004 వరకు రాయ్​ బరేలీలో గెలుస్తూ వచ్చారు. 2004లో సోనియా గాంధీ ఇక్కడ విజయం సాధించారు. 2019 లోక్​సభ ఎన్నికల వరకు ఆమె రాయ్​ బరేలీలో గెలుస్తూ వచ్చారు.

కానీ.. ఆమె ఇటీవలే రాజ్యసభకు షిఫ్ట్​ అయ్యారు. ఆమె స్థానంలో.. ప్రియాంక గాంధీ రాయ్​ బరేలీ నుంచి పోటీ చేస్తారని అందరు భావించారు. కానీ ఇప్పుడు.. ఈ సీటులో రాహుల్​ గాంధీ బరిల దిగుతున్నారు.

వాస్తవానికి.. ఇదే యూపీలో, రాయ్​ బరేలీకి కాస్త దూరంలో ఉండే అమేఠీ కూడా.. 2019 వరకు కాంగ్రెస్​కు కంచుకోటగా వస్తూ వచ్చింది. రాహుల్​ గాంధీ.. ఇక్కడి నుంచి ఎన్నోసార్లు గెలిచి, పార్లమెంట్​కు వెళ్లారు. కానీ 2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతుల్లో ఓడిపోయారు.

ఇప్పుడు మళ్లీ ఆయన అమేఠీలో పోటీ చేసినా.. ఫలితం మారకపోవచ్చని టాక్​ నడుస్తోంది.

Rahul Gandhi latest news : "రాహుల్​ గాంధీ కచ్చితంగా యూపీ నుంచి పోటీ చేయాలి. కానీ అమేఠీలో ఛాన్స్​ లేదు. అమేఠీలో పోటి చేస్తే.. అది రాహుల్​ వర్సెస్​ స్మృతి ఇరానీ అవుతుంది. అప్పుడు.. అమేఠీలో రాహుల్​ ఎక్కువ కాలం ప్రచారాలు చేయాల్సి ఉంటుంది. కానీ రాయ్​ బరేలీ అలా కాదు. రాయ్​ బరేలీ కాంగ్రెస్​కు సేఫ్​ సీట్​," అని ఓ కాంగ్రెస్​ నేత చెప్పుకొచ్చారు.

మరి రెండు సీట్లల్లో గెలిస్తే..?

2019 లోక్​సభ ఎన్నికల్లో రెండు సీట్లల్లో పోటీ చేసి ఒక దాంట్లో గెలిచారు రాహుల్​ గాంధీ. అది.. కేరళ వయనాడ్​. ఇక 2024 లోక్​సభ ఎన్నికల్లోనూ రెండు సీట్లల్లో పోటీ చేస్తున్నారు. వయనాడ్​పై ఆయనకు మంచి పట్టు ఉంది. అదే సమయంలో.. రాయ్​ బరేలీలో సేఫ్​ సీటులో గెలుపపై సందేహాలు లేవు! మరి రెండింట్లో గెలిస్తే.. రాహుల్​ గాంధీ దేనిని వదులుకుంటారు?

"రెండు సీట్లల్లో పోటీ చేయడం అనేది అసలు మంచి విషయం కాదు. రెండింట్లో గెలిస్తే.. ఏదో ఒకటి వదులుకోవాలి. మరి వయనాడ్​ని వదులుకుంటారా? 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు ఆయన వయనాడ్​ని వదిలేస్తే.. అది కాంగ్రెస్​కే చేటు చేస్తుంది. అలా అని.. అనాదిగా వస్తున్న రాయ్​ బరేలీని ఎలా వదులుకుంటారు?," అని రాజకీ విశ్లేషకులు రషీద్​ కిద్వై అభిప్రాయపడ్డారు.

2024 Lok Sabha elections : అయితే.. ఇక్కడ ఇంకో ఆప్షన్​ కూడా ఉంది! ప్రియాంక గాంధీ ఇప్పటివరకు ఎన్నికల బరిలో దిగలేదు. 2024 లోక్​సభ ఎన్నికల్లో రాయ్​ బరేలీ నుంచి రాహుల్​ గాంధీ గెలిస్తే.. ఆ సీటును ఆయన వదులుకునే అవకాశం ఉందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఆయన స్థానంలో.. ఉప ఎన్నికల్లో బరిలో దిగి, ప్రియాంక గాంధీ గెలిచే అవకాశం ఉందని కాంగ్రెస్​లో ప్రచారం నడుస్తోంది.

తదుపరి వ్యాసం