తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  2024 Lok Sabha Elections : ‘అబ్​ కీ బార్​ 400 పార్​’కి అడ్డుగా దక్షిణ భారతం- బీజేపీ కల నెరవేరడం కష్టమేనా?

2024 Lok Sabha elections : ‘అబ్​ కీ బార్​ 400 పార్​’కి అడ్డుగా దక్షిణ భారతం- బీజేపీ కల నెరవేరడం కష్టమేనా?

Sharath Chitturi HT Telugu

28 April 2024, 12:50 IST

google News
    • Lok Sabha elections BJP : 2024 లోక్​సభ ఎన్నికల్లో గెలిచి.. మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందుకోసం టార్గెట్​ 400 పెట్టుకుంది. అయితే.. బీజేపీకి.. 400 సీట్లకు మధ్య ‘దక్షిణ భారతం’ అడ్డుగా ఉంది!
దక్షిణాదిని బీజేపీ ఆకట్టుకుంటుందా..?
దక్షిణాదిని బీజేపీ ఆకట్టుకుంటుందా..?

దక్షిణాదిని బీజేపీ ఆకట్టుకుంటుందా..?

2024 Lok Sabha elections : 'అబ్​ కీ బార్​ 400 పార్​' అంటూ 2024 లోక్​సభ ఎన్నికల బరిలో దిగింది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎన్​డీఏ కూటమి ఈసారి 400 సీట్లు సంపాదించుకోవాలని తీవ్రంగా కృషి చేస్తోంది. బీజేపీ సొంతంగా 370 దాటాలని ఫిక్స్​ అయ్యింది. అయితే.. బీజేపీ పెట్టుకున్న టార్గెట్​కి.. 400 సీట్లల్లో విజయానికి మధ్య హిమాలయ పర్వతమంత భారీ అడ్డు ఒకటి ఉంది. అదే.. 'దక్షిణ భారతం'! ఈ గండాన్ని గట్టెక్కితేనే.. బీజేపీ తన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలదు. అందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి సామాన్య కార్యకర్త వరకు అందరు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరి ఈసారి.. బీజేపీ కలను దక్షిణ భారతం నెరవేరుస్తుందా? ఇక్కడ తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఎనలైజ్​ చేద్దాము..

దక్షిణ భారతంలో బీజేపీ అంతంత మాత్రమే..

2019 లోక్​సభ ఎన్నికల్లో 543 సీట్లకు ఎన్​డీఏ 351 స్థానాల్లో గెలిచింది. ఒక్క బీజేపీయే 303 చోట్ల విజయం సాధించింది. కానీ ఫలితాలను లోతుగా విశ్లేషిస్తే.. అందరికి ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది! ఈ 303లో చాలా వరకు కమలదళం ఉత్తర భారతంలో గెలిచినవే! దక్షిణ భారతంలో ఎన్ని సీట్లు గెలిచిందో తెలిస్తే.. షాక్​ అవ్వాల్సిందే.

2019 లోక్​సభ ఎన్నికల్లో సౌత్​లో బీజేపీ ప్రదర్శన..

అండమాన్​ అండ్​ నికోబార్​ దీవులు:-

మొత్తం సీట్లు- 1; బీజేపీ- 0

ఆంధ్రప్రదేశ్​:-

మొత్తం సీట్లు- 25; బీజేపీ- 0

మొత్తం సీట్లు- 28; బీజేపీ- 25

కేరళ:-

మొత్తం సీట్లు- 20; బీజేపీ- 0

లక్షద్వీప్​:-

మొత్తం సీట్లు- 1, బీజేపీ-0

South India BJP : పుదుచ్చెరి:-

మొత్తం సీట్లు- 1; బీజేపీ-0

మొత్తం సీట్లు- 39; బీజేపీ- 0

తెలంగాణ-

మొత్తం సీట్లు- 17; బీజేపీ- 4

మొత్తం మీద చూసుకుంటే.. దక్షిణాదిన ఉండే 129 సీట్లల్లో బీజేపీ గెలిచింది 29 సీట్లే! అది కూడా.. 25 సీట్లు కర్ణాటకలోనే వచ్చాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​లో బీజేపీ అసలు ఖాతానే తెరవలేదు.

ఇక ఇప్పుడు.. ఒక్కో రాష్ట్రంలో బీజేపీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూద్దాము..

కేరళ:- దేశం మొత్తం మీద బీజేపీ ప్రభావం అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. పార్టీ ఆవిర్భవించిన తర్వాత.. ఇప్పటివరకు ఇక్కడ బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. శబరిమల, కేరళ స్టోరీ వంటి అంశాలను లేవనెత్తినా.. పెద్దగా ఫలితం దక్కలేదు. ఈసారి కూడా ఇదే రిపీట్​ అవ్వొచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. కేరళలో కమ్యునిస్ట్​లు, కాంగ్రెస్​కు మధ్యే తీవ్ర పోటీ ఉంటుంది. ఈసారి కూడా అదే జరగొచ్చు.

PM Modi latest news : తమిళనాడు- తమిళనాడులో బీజేపీ పరిస్థితి అయోమయంగా ఉంది! గత లోక్​సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకుని బరిలో దిగింది బీజేపీ. కానీ ఇప్పుడు ఆ పార్టీతో మైత్రి లేదు. బీజేపీ సొంతంగా బరిలో దిగింది. తమిళనాడులో కూడా బీజేపీ ప్రభావం ఎప్పుడూ పెద్దగా లేదు. పైగా.. హిందీ భాష రుద్దుతున్నారని వ్యతిరేకతే ఎక్కువగా ఉంది. వీటన్నింటి మధ్య.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామైలైపేనే.. భారీ ఆశలు పెట్టుకుంది కమలదళం. ఆయనే అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. లోక్​సభ ఎన్నికల్లోనూ బరిలో నిలిచారు. మరి.. తమిళనాడులో బలంగా లేని బీజేపీని ఆయన గట్టెక్కిస్తారో లేదో చూడాలి.

ఆంధ్రప్రదేశ్​- 2019తో పోల్చుకుంటే.. 2024లో ఆంధ్రప్రదేశ్​లో రాజకీయ సమీకరణలు మారాయి. నాడు సొంతంగా పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీలు.. 2024 ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్​సభ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి.. అధికారంలో ఉన్న జగన్​ నేతృత్వంలోని వైసీపీని ఢీకొడుతున్నాయి. 2019లో బీజేపీ ఇక్కడ ఖాతా తెరవలేదు. ఈసారి కొన్ని సీట్లైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఏదైనా ఉంటే.. టీడీపీకి ఓట్లు పడే అవకాశం ఉంది. టీడీపీ.. ఎన్​డీఏలో భాగంగా ఉంది కాబట్టి.. ఇది పరోక్షంగా కేంద్రంలో బీజేపీకి సాయపడవచ్చు. కానీ.. సొంతంగా మాత్రం బీజేపీ ప్రదర్శనపై పెద్దగా అంచనాలు లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

తెలంగాణ- 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు కాస్త బలంగానే కనిపించిన బీజేపీ.. ఆ తర్వాత చతికిల పడినట్టు కనిపిస్తోంది. నేతల వలసలు కూడా ఇబ్బందిపెడుతున్నాయి. కానీ ప్రధాని మోదీ, అమిత్​ షా, కిషన్​ రెడ్డీలు.. ప్రచారాల్లో కీలకంగా ఉండి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

BJP Lok Sabha elections : కర్ణాటక- దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఆశలన్నీ కర్ణాటకపైనే ఉన్నాయి! సౌత్​లో బీజేపీ బలంగా ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. అది కూడా.. దిగ్గజ నేత బీవై యడియూరప్ప వల్లే! 2019 లోక్​సభ ఎన్నికల్లో ఇక్కడ 25 సీట్లు గెలిచి సంచలనం సృష్టించింది కమలదళం. కానీ ఇప్పుడు అది రిపీట్​ అవుతుందా? అంటే సందేహమే! 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. పైగా.. బలహీనంగా ఉన్న ప్రాంతీయ పార్టీ జేడీఎస్​తో పొత్తు కుదుర్చుకుంది. మరి ఇది ఎంత మేర మంచి చేస్తుందో చూడాలి.

రామ మందిరం ప్రభావం అంతంతమాత్రమే!

దక్షిణాదిలో బీజేపీ దారుణ ప్రదర్శన కొత్తేమీ కాదు. అనాదిగా.. ఇక్కడ బీజేపీకి పెద్దగా పట్టు లేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.

ఉత్తర భారతంతో పోల్చుకుంటే.. ఇక్కడ అభివృద్ధి ఎక్కువ. నార్త్​తో పోల్చుకుంటే.. విద్య, ఆరోగ్యం, అభివృద్ధి వంటి అంశాలపై దక్షిణాది ప్రజలు ఎక్కువగా ఫోకస్​ చేస్తారు.

Lok Sabha elections PM Modi : బీజేపీ ఎంత కాదని చెబుతున్నా.. అయోధ్య రామ మందిరం, రాముడు.. పార్టీ ఎన్నికల అజెండాలో భాగం. అది ఉత్తర భారతంలో క్లిక్​ అవ్వొచ్చు. కానీ దక్షిణాదిన రామ మందిరాన్ని చూసి ఓటు వేసేవారు తక్కువే ఉంటారు!

బీజేపీ హిందుత్వ సిద్ధాంతం కూడా ఇక్కడ పెద్దగా ప్రభావం చూపలేదు. శతాబ్దాలుగా.. దక్షిణాదిలో అన్ని మతాల వారు సామరస్యంగా కలిసి జీవిస్తున్నారు.

దక్షిణ భారతంలో ప్రాంతీయ పార్టీల పట్టు ఎక్కువగా ఉంటుంది. రాజకీయాలు కూడా ప్రాంతీయ అంశాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి.

మరి బీజేపీ టార్గెట్​ 400 సక్సెస్​ అవుతుందా? దక్షిణ భారతం.. మోడీ అండ్​ టీమ్​కి ఓటు వేస్తుందా? లేక.. ఎప్పటిలానే, ఈసారి కూడా సౌత్​లో బీజేపీ డీలా పడుతుందా? అన్న ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలంటే.. ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్​ 4 వరకు వేచి చూడాల్సిందే.

తదుపరి వ్యాసం