AP Nominations : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన(Nominations Scrutiny) ప్రక్రియ ముగిసింది. ఈనెల 26న జరిగిన నామినేషన్ల పరిశీలనలో 25 లోక్ సభ స్థానాలకు 503 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,705 నామినేషన్లను ఆమోదించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా(CEO Mukesh Kumar Meena) తెలిపారు. పార్లమెంట్ స్థానాలకు చెందిన 183 నామినేషన్లు, అసెంబ్లీ స్థానాలకు చెందిన 939 నామినేషన్లను పరిశీలన అనంతరం తిరస్కరించామన్నారు. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మొత్తం 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని లోక్ సభ స్థానాలకు(Lok Sabha Constituencies) సంబంధించి అత్యధికంగా గుంటూరు(Guntur) పార్లమెంట్ స్థానానికి 47 నామినేషన్లు, అత్యల్పంగా శ్రీకాకుళం(Srikakulam) లోక్ సభ నియోజకవర్గానికి 16 నామినేషన్లు దాఖలు అయ్యాయని సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు. నామినేషన్ల ఆమోదం విషయంలో అత్యధికంగా 36 నామినేషన్లు నంద్యాల పార్లమెంట్ స్థానానికి, అత్యల్పంగా 12 నామినేషన్లు రాజమండ్రి లోక్ సభ స్థానానికి ఆమోదించినట్లు తెలిపారు.
అదేవిధంగా శాసనసభ నియోజకవర్గాలకు(Assembly Constituencies) సంబంధించి అత్యధిక మొత్తంలో తిరుపతి(Tirupati) అసెంబ్లీ స్థానానికి 52 నామినేషన్లు, అత్యల్పంగా 8 నామినేషన్లు చోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి దాఖలు అయ్యాయని తెలిపారు. నామినేషన్ల ఆమోదం విషయంలో అత్యధికంగా 48 నామినేషన్లు(Nominations) తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి, అత్యల్పంగా 6 నామినేషన్లు చోడవరం అసెంబ్లీ స్థానానికి ఆమోదించినట్లు ప్రకటించారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందని, నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు మినహా మిగిలిన వారు మే 13న జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుగా పరగణిస్తామని సీఈవో(AP CEO) పేర్కొన్నారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో 17 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఆఖరి రోజున రాష్ట్రవ్యాప్తంగా 632 సెట్ల నామినేషన్లు(Nominations in Telangana) దాఖలయ్యాయి. ఇప్పటివరకు 7 రోజుల్లో మొత్తం 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఆ తర్వాత ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించి కూడా నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ నియోజకవర్గానికి మొత్తం 24 మంది...... 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
సంబంధిత కథనం