TS Nominations : 17 లోక్ సభ స్థానాలకు 893 నామినేషన్లు - ఈ స్థానం నుంచే అత్యధికం..!-893 candidates have filed nominations for 17 lok sabha seats in telangana ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ts Nominations : 17 లోక్ సభ స్థానాలకు 893 నామినేషన్లు - ఈ స్థానం నుంచే అత్యధికం..!

TS Nominations : 17 లోక్ సభ స్థానాలకు 893 నామినేషన్లు - ఈ స్థానం నుంచే అత్యధికం..!

HT Telugu Desk HT Telugu
Apr 26, 2024 03:05 PM IST

Lok Sabha Elections in Telangana : తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు 893 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా మాల్కాజ్ గిరి స్థానం నుంచి దాఖలయ్యాయి.

తెలంగాణలో నామినేషన్లు
తెలంగాణలో నామినేషన్లు

Nominations For Lok Sabha Elections in Telangana 2024: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఆఖరి రోజున రాష్ట్రవ్యాప్తంగా 632 సెట్ల నామినేషన్లు(Nominations in Telangana) దాఖలయ్యాయి. ఇప్పటివరకు 7 రోజుల్లో మొత్తం 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఆ తర్వాత ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉపెన్నికకు సంబంధించి కూడా నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ నియోజకవర్గానికి మొత్తం 24 మంది...... 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

అత్యధికంగా ఇక్కడే……

ఇక దేశంలోని అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గమైన మల్కాజిగిరి లోక్ సభ(Malkajgiri parliamentary constituency) స్థానానికి అత్యధికంగా 114 మంది అభ్యర్థులు 177 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి మరియు చేవెళ్ల ఎంపీ స్థానాలకు మొత్తంగా 316 నామినేషన్లు దాఖలు అయ్యాయి.హైదరాబాద్ స్థానానికి చివరి రోజైన గురువారం 25 మంది 37 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.హైదరాబాద్ స్థానానికి మొత్తం 57 మంది నుంచి 85 సెట్ల నామినేషన్లు అందాయి.ఇక సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి చివరి రోజైన గురువారం 23 మంది 26 సెట్ల నామినేషన్లు వేశారు.ఈ సెగ్మెంట్లలో మొత్తంగా 57 మంది నుంచి 75 నామినేషన్లు అందాయి.

దేశంలోనే అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గం అయిన మల్కాజిగిరి(Malkajgiri parliamentary constituency) ఎంపి స్థానానికి చివరి రోజు 61 మంది అభ్యర్థుల నుంచి 91 సెట్ల నామినేషన్లు ఎన్నికల అధికారులకు అందాయి. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన జగగుద్వర్ రావు అనే దివ్యాంగుడు గురువారం మల్కాజిగిరి స్థానానికి నామినేషన్ వేశారు. దేశవ్యాప్తంగా 15 శాతం మంది దివ్యంగా కుటుంబాలు ఉన్నాయని.......దాదాపు 10 కోట్ల దివ్యంగా ఓటర్లు ఉన్నారని జగదీశ్వర్ రావు తెలిపారు. పార్లమెంట్ లో వారు గొంతుకగా తాను వినిపిస్తానని జగదీశ్వర్ రావు తెలిపారు.ఇక చేవెళ్ల ఎంపీ స్థానానికి మొత్తంగా 82 మంది 88 సెట్ల నామినేషన్లు వేశారు. చివరి రోజు 30 మంది నుంచి 32 నామినేషన్ దాఖలు అయ్యాయి.వీటితో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 24 మంది అభ్యర్థులు 50 చెట్ల నామినేషన్లు వేశారు. గురువారం 15 మంది అభ్యర్థులు నుంచి 25 సెట్ల నామినేషన్లు దాఖలు అయ్యాయి.

మొత్తం 893 మంది అభ్యర్థులు......

• అదిలాబాద్ - 23

• పెద్దపల్లి - 63

• కరీంనగర్ - 53

• నిజామాబాద్ - 42

• జహీరాబాద్ - 40

• మెదక్ - 54

• మల్కాజిగిరి - 114

• సికింద్రాబాద్ - 57

• హైదరాబాద్ - 57

• చేవెళ్ల - 64

• మహబూబాబాద్ - 30

• మహబూబ్ నగర్ - 42

• నాగర్ కర్నూల్ - 34

• ఖమ్మం - 45

• నల్గొండ - 56

• భువనగిరి - 61

• వరంగల్ - 58

రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

WhatsApp channel