(1 / 5)
శుక్రవారం సాయంత్రం మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షా నిర్వహించారు.
(2 / 5)
సికింద్రాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ ర్యాలీని చేపట్టారు. మోదీ ఉన్న వాహనంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రమే ఉన్నారు.
(3 / 5)
మోదీకి మహిళలు ఘన స్వాగతం పలికారు. మోదీ నినాదాలతో హోరెత్తించారు.
(4 / 5)
మీర్జాలగూడ నుంచి మల్కాజ్ గిరి వరకు ఈ రోడ్ షో కొనసాగింది. దాదాపు 1.2 కిమీ మేర పరిధిలో గంటకుపైగా రోడ్ షో సాగింది. కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు సాగారు.
(5 / 5)
రోడ్ షో తర్వాత రాజ్ భవన్ కు వెళ్లారు ప్రధాని మోదీ. శుక్రవారం రాజ్ భవన్ లోనే బస చేయనున్న ఆయన…. శనివారం (మార్చి 16) నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
ఇతర గ్యాలరీలు