Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!
19 May 2024, 9:00 IST
CSK vs RCB IPL 2024 Virat Kohli Umpire Fight: ఐపీఎల్ 2024 సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ ప్లేఆఫ్స్ మ్యాచ్ మధ్యలో అంపైర్‌తో విరాట్ కోహ్లీ వాగ్వాదానికి దిగాడు. నో బాల్ విషయంలో అంపైర్‌తో ఫెర్గ్యూసన్ చేస్తున్న ఆర్గ్యుమెంట్‌లో విరాట్ గొడవకు దిగాడు.
అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!
CSK vs RCB IPL 2024 Highlights: ఐపీఎల్ 2024 (IPL 2024)లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)కు డూ ఆర్ డై మ్యాచ్ వాడీవేడీగా సాగింది. ఆద్యంతం సూపర్ థ్రిల్లింగ్‌గా సాగింది. ఎవరు విన్ అవుతారనే విషయం చివరి వరకు చాలా సస్పెన్స్‌గా నిలిచింది. అప్పుడే సీఎస్కే బ్యాటింగ్‌తో మెరుపులు సృష్టిస్తే అప్పటికప్పుడే ఆర్సీబీ మ్యాజిక్ చేసింది.
కుప్పకూలిన సీఎస్కే
మే 18న చినస్వామి స్టేడియంలో జరిగిన సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ (CSK vs RCB) మ్యాచ్ మొత్తానికి చివరి వరకు మంచి ఉత్కంఠంగా సాగింది. 219 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. 27 పరుగుల తేడాతో సీఎస్కే ఓటమి చూసింది. వరుసగా ఆరోసారి విజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది రాజస్థాన్ బెంగళూరు.
వర్షం కారణంగా
అయితే, ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో 12వ ఓవర్ వద్ద అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. వర్షం కారణంగా బాల్ స్లిప్ అవుతూ వచ్చింది. సీఎస్కే ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర (Rachin Ravindra) బ్యాటింగ్ చేస్తన్న సమయంలో 12వ ఓవర్‌లో లోకి ఫెర్గ్యూసన్ బంతిని విసిరాడు. కానీ, అది స్లిప్ అయి నో బాల్‌గా పడింది. దాన్ని బౌండరీ దాటించాడు రచీన్ రవీంద్ర. దాంతో సీఎస్కేకు బాల్ కౌంట్ లేకుండా 5 పరుగులు వచ్చాయి.
చేంజ్ చేయమంటూ
ఆ తర్వాత వేసిన బాల్ కూడా స్లిప్ అవుతూ ఫుల్ టాస్ పడింది. అలా వరుసగా రెండు సార్లు బాల్ స్లిప్ కావడంతో బంతిని చేంజ్ చేయమని అంపైర్‌తో ఫెర్గ్యూసన్, డూప్లెసిస్ కోరారు. కానీ, దానికి అంపైర్ నిరాకరించాడు. వెంటనే ఆ ఆర్గ్యుమెంట్‌లోకి విరాట్ కోహ్లీ దిగాడు. చాలా కోపంగా బంతిని మార్చమంటూ ఫైర్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అంపైర్‌పై ఒత్తిడి
బంతి ఫ్లిప్ అవుతుంది, కచ్చితంగా చేంజ్ చేయాలంటూ అంపైర్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు విరాట్ కోహ్లీ, ఫెర్గ్యూసన్. కానీ, అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు అంపైర్. చివరిగా అదే బంతితో ఆటను కొనసాగించారు. అయితే ఇలా బంతి ఫెర్గ్యూసన్‌కు మాత్రమే స్లిప్ అవుతూ వచ్చింది. 19వ ఓవర్‌లో కూడా ఓసారి ఇలాగే స్లిప్ అయింది. మిగతా బౌలర్స్ మాత్రం కట్టుదిట్టంగానే బౌలింగ్ చేశారు. ఫలింతగా ఆర్సీబీ విజయం సాధించింది.
అద్భుతం చేస్తాడని
ఇక మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ కోపంగా ఫైట్‌కు దిగడం, ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం ఇదేం కొత్త కాదు. ఇదివరకు చాలా మ్యాచుల్లో విరాట్ తన కోపాన్ని ప్రదర్శించాడు. ఇదిలా ఉంటే, గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో ధోనీ అద్భుతం చేసి సీఎస్కేను గెలిపిస్తాడని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, కొన్ని బౌండరీలు, రెండు సిక్స్‌లతో సరిపెట్టాడు తల.
ఆశలు గల్లంతు
రెండు చివరి ఓవర్స్ ఉండగా రవీంద్ర జడేజా బౌండరి కొట్టి అభిమానుల్లో ఆశలు చిగురించాడు. అనంతరం వచ్చిన ఎమ్ఎస్ ధోనీ సైతం సిక్స్ బాది మరింత ఉత్సాహాన్ని రేకెత్తించాడు. కానీ, దయాల్ వేసిన బాల్‌కు బౌండరి వద్ద ఔట్ అయ్యాడు ఎమ్ఎస్ ధోనీ. దాంతో సీఎస్కే ఆశలు ఒక్కసారిగా గల్లంతు అయ్యాయి.
టాపిక్