తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kavya Maran: కేఎల్ రాహుల్‌పై కన్నేసిన కావ్య మారన్? ఐపీఎల్ 2025 వేలం ముంగిట సన్‌రైజర్స్ హింట్

Kavya Maran: కేఎల్ రాహుల్‌పై కన్నేసిన కావ్య మారన్? ఐపీఎల్ 2025 వేలం ముంగిట సన్‌రైజర్స్ హింట్

Galeti Rajendra HT Telugu

12 November 2024, 20:22 IST

google News
  • SRH IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేఎల్ రాహుల్‌ని కొనుగోలు చేయాలా? వద్దా అని కావ్య మారన్ ప్రశ్నించగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ముక్తకంఠంతో ఒకే మాట చెప్తున్నారు. 

కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ (Hindustan Times)

కేఎల్ రాహుల్

ఐపీఎల్ 2025 మెగా వేలం ముంగిట సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకి ఉత్సాహానిచ్చే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలం జరగనుంది. ఈ వేలంలో కేఎల్ రాహుల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయబోతున్నట్లు ఓనర్ కావ్య మారన్ సోషల్ మీడియాలో హింట్ ఇచ్చింది.

వేలంలో రాహుల్

వాస్తవానికి గత కొంతకాలంగా కేఎల్ రాహుల్ పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్నాడు. భారత్ వన్డే, టీ20 జట్టులో ఇప్పటికే చోటు కోల్పోయిన కేఎల్ రాహుల్.. టెస్టు టీమ్‌లోనూ రెగ్యులర్ ప్లేయర్‌గా లేడు. దాంతో ఐపీఎల్‌‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ అతడ్ని రిటెన్ చేసుకోకుండా వేలంలోకి వదిలేసింది.

నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియాతో బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భారత్ జట్టు తలపడనుంది. మొత్తం ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో ఆడేందుకు ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపైకి వెళ్లిన కేఎల్ రాహుల్.. అక్కడ అనధికార టెస్టు మ్యాచ్‌లోనూ ఫెయిలయ్యాడు.

ఐపీఎల్‌లో రాహుల్ రికార్డ్స్

ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్‌కి మెరుగైన రికార్డ్ ఉంది. ఇప్పటి వరకు 132 మ్యాచ్‌లు ఆడిన రాహుల్.. 134.6 స్ట్రైక్‌రేట్‌తో 4,683 పరుగులు చేశాడు. కానీ.. గత రెండు సీజన్లుగా రాహుల్ ఆటలో వేగం తగ్గిందని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ ఆరోపిస్తోంది. ఎంతలా అంటే? రాహుల్ ఎక్కువ సేపు క్రీజులో ఉన్న మ్యాచ్‌ల్లో లక్నో టీమ్ ఓడిపోయింది. ఇదే విషయాన్ని బూచిగా చూపిస్తూ అతడ్ని వేలంలోకి లక్నో ఫ్రాంఛైజీ వదిలేసింది.

ఐపీఎల్ లాంటి టోర్నీల్లో నిలకడగా పరుగులు చేయడం కంటే.. వేగంగా పరుగులు చేయడం ముఖ్యం. కానీ.. కెప్టెన్సీ బాధ్యతను భారంగా ఫీలైన రాహుల్.. స్వేచ్ఛగా ఆడలేకపోయాడు.

హైదరాబాద్ పర్స్‌లో రూ.45 కోట్లు

వేలంలోకి వచ్చిన కేఎల్ రాహుల్‌పై ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కూడా కన్నేసింది. కర్నాటకకి చెందిన రాహుల్ టీమ్‌లో ఉంటే.. ఆ జట్టు క్రేజ్ మరింత పెరగనుంది. దానికి తోడు గతంలోనూ బెంగళూరు టీమ్‌లో రాహుల్ కొన్ని సీజన్లు ఆడాడు. అయితే.. హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. కెప్టెన్సీ అనుభవం ఉన్న భారత ఆటగాడి కోసం చూస్తోంది. ఒకవేళ రాహుల్‌ను టీమ్‌లోకి తీసుకుంటే.. యశస్వి జైశ్వాల్‌కి జోడీగా ఓపెనర్‌ దొరికినట్లువుతుంది.

ఐపీఎల్ 2025 కోసం హైదరాబాద్ రిటెన్ చేసుకున్న ప్లేయర్లలో హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు), పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు),ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు), నితీశ్ కుమార్ రెడ్డి (రూ.6 కోట్లు) ఉన్నారు. రూ.120 కోట్ల పర్స్‌లో ఈ రిటెన్షన్ కోసం రూ.75 కోట్లని హైదరాబాద్ ఇప్పటికే ఖర్చు చేసింది. ఇక మిగిలిన రూ.45 కోట్లతో మిగిలిన ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

కేఎల్ రాహుల్‌ని కొనుగోలు చేయాలా?

ఒకవేళ కేఎల్ రాహుల్ ధర రూ.10 కోట్లు లోపు ఉంటే.. హైదరాబాద్ కొనుగోలు చేసే సాహసం చేయవచ్చు. కానీ.. అంతకు మించి అంటే మాత్రం.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. టీమ్‌లో పాట్ కమిన్స్ మినహా బౌలర్ ఎవరూ లేరు. తెలుగు క్రికెటర్ నితీశ్ రెడ్డి బౌలింగ్ చేసినా.. అతను ఇంకా అనుభవం సాధించాల్సి ఉంది. కాబట్టి.. కనీసం బౌలర్ల కోసం రూ.15 కోట్ల వరకూ పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. అలానే ఆల్‌రౌండర్స్ కూడా అవసరం ఉంటుంది.

ఈ నేపథ్యంలో.. కేఎల్ రాహుల్‌ను కొనుగోలు చేయాలా? వద్దా? అని కావ్య మారన్ అభిమానులను ప్రశ్నించగా.. చాలా మంది వద్దు అని రిప్లై ఇస్తున్నారు. మరి కావ్య మారన్ వేలంలో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

తదుపరి వ్యాసం