IND vs SA 1st T20: టీమిండియాలోకి ఐపీఎల్ స్టార్స్ అరంగేట్రం - తొలి టీ20లో సౌతాఫ్రికాతో తలపడనున్న భారత జట్టు ఇదే!
IND vs SA 1st T20: ఇండియా, సౌతాఫ్రికా మధ్య తొలి 20 మ్యాచ్ నేడు డర్బన్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ స్టార్స్ రమణ్‌దీప్ సింగ్, యశ్ దయాల్ టీమిండియాలోకి అరంగేట్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తిలక్ వర్మ కు తుది జట్టులో చోటు దక్కనున్నట్లు చెబుతోన్నారు.
IND vs SA 1st T20: ఇటీవలే న్యూజిలాండ్ చేతిలో టెస్టుల్లో వైట్‌వాష్‌కు గురైన టీమిండియాను క్రికెట్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. ఈ విమర్శల నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర పోరుకు భారత జట్టు సిద్ధమైంది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో ఫస్ట్ టీ20 మ్యాచ్ నేడు డర్బన్ వేదికగా జరుగనుంది. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన సఫారీలను ఏ విధంగా కట్టడి చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
సంజూ శాంసన్ ఓపెనర్...
ఈ మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కించుకునే భారత ఆటగాళ్లు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్‌పై సెంచరీతో అదరగొట్టి సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలో దిగే అవకాశం ఉంది. అభిషేక్ శర్మతో కలిసి ఇండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
తిలక్ వర్మకు తుది జట్టులో స్థానం దక్కనున్నట్లు సమాచారం. దాదాపు పది నెలల గ్యాప్ తర్వాత ఈ మ్యాచ్ ద్వారా అతడు టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు చెబుతోన్నారు. తిలక్ వర్మతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రింకు సింగ్ లాంటి బ్యాటర్లతో భారత మిడిల్ ఆర్డర్ పటిష్టంగా కనిపించబోతున్నది.
ఐపీఎల్ స్టార్లకు చోటు...
కాగా ఈ తొలి టీ20 మ్యాచ్ ద్వారా ఐపీఎల్ 2024లో అదరగొట్టిన యశ్, దయాల్, రమణ్‌దీప్ సింగ్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. అక్షర్ పటేల్‌తో పాటు రవి బిష్టోయ్ తుది జట్టులో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.
హిట్టర్లతో...
మరోవైపు క్లాసెన్, స్టబ్స్, హెండ్రిక్స్, మిల్లర్ లాంటి హిట్టర్లతో సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. క్లాసెన్, స్టబ్స్, మిల్లర్‌లకు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉండటం ప్లస్ కానుంది. వారిని కట్టడి చేయడంపైనే టీమిండియా గెలుపు అవకాశాలు ఆధారపడ్డాయి. జియో సినిమా ఓటీటీలో రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.
టీమిండియా తుది జట్టు అంచనా...
సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య రమన్ దీప్ సింగ్, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, యశ్ దయాల్, అర్షదీప్ సింగ్