Team India: కెప్టెన్‍గా గిల్: నితీశ్ రెడ్డికి చోటు.. మరో ముగ్గురికి తొలిసారి ప్లేస్.. జింబాబ్వే సిరీస్‍కు భారత జట్టు
Team India vs Zimbabwe: జింబాబ్వే పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు టీ20ల సిరీస్‍కు టీమ్‍ను ఎంపిక చేసింది. తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డికి తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది.
Team India: ప్రస్తుత టీ20 ప్రపంచకప్ తర్వాత జింబాబ్వే పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. జూలై 6వ తేదీన ఈ సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్‍కు 15 మంది ఆటగాళ్లతో భారత జట్టును బీసీసీఐ నేడు (జూన్ 24) ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ ఆడుతున్న ఇద్దరు మాత్రమే బింజాబ్వే పర్యటనకు ఉండగా.. మిగిలిన వారికి రెస్ట్ ఇచ్చింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‍ప్రీత్ బుమ్రా సహా చాలా మందికి విశ్రాంతిని బీసీసీఐ ఇచ్చింది. జింబాబ్వేతో సిరీస్‍కు యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది. భారత యంగ్ ఓపెనర్ శుభ్‍మన్ గిల్ కెప్టెన్సీ చేయనున్నాడు. టీమిండియాకు అతడు తొలిసారి సారథ్యం వహించనున్నాడు.
నలుగురు ప్లేయర్లు తొలిసారి..
జింబాబ్వేతో సిరీస్‍కు నలుగురు కొత్త ప్లేయర్లు టీమిండియాలోకి వచ్చారు. తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్‍పాండే తొలిసారి భారత్‍కు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఐపీఎల్‍లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ నలుగురికి భారత జట్టులో చోటిచ్చారు సెలెక్టర్లు.
ఈ ఏడాది ఐపీఎల్‍లో గుజరాత్ టైటాన్స్ టీమ్‍కు శుభ్‍మన్ గిల్ కెప్టెన్సీ చేశాడు. అతడిని జింబాబ్వేతో సిరీస్‍కు సారథిగా బీసీసీఐ నిర్ణయించింది. ప్రపంచకప్‍కు రిజర్వ్ ఆటగాడిగా ఎంపికైన అతడు ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చేశాడు.
సన్‍రైజర్స్ నుంచి ఇద్దరు
ఈ ఏడాది ఐపీఎల్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ తరఫున తెలుగు ఆల్‍రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టారు. ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. 142 స్ట్రైక్‍రేట్‍తో యావరేజ్‍తో 303 పరుగులు చేశాడు. కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇక సన్‍రైజర్స్ తరఫున అభిషేక్ శర్మ ఈ ఏడాది ధనాధన్ బ్యాటింగ్‍తో దుమ్మురేపాడు. 16 మ్యాచ్‍ల్లో 484 పరుగులతో అదరగొట్టాడు. ముఖ్యంగా మెరుపు హిట్టింగ్‍తో ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్‍లో అదరగొట్టిన నితీశ్, అభిషేక్‍కు తొలిసారి భారత జట్టులో ప్లేస్ దక్కింది.
పరాగ్ కూడా..
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఈ ఏడాది ఐపీఎల్‍లో రియాన్ పరాగ్ సత్తాచాటాడు. 16 మ్యాచ్‍ల్లో 573 పరుగులతో అద్భుతంగా ఆడాడు. టీ20 ప్రపంచకప్‍కు అతడు ఎంపికవుతాడని అంచనాలు వచ్చినా.. అలా జరగలేదు. అయితే, జింబాబ్వేతో సిరీస్ ద్వారా టీమిండియాలో అతడు వస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రాణించిన పేసర్ తుషార్ దేశ్‍పాండే కూడా భారత జట్టులో ప్లేస్ సాధించాడు.
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ జట్టులో ఉన్న సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ మాత్రమే జింబాబ్వేతో సిరీస్‍కు సెలెక్ట్ అయ్యారు. మిగిలిన వారికి విశ్రాంతి దక్కింది. యువ ప్లేయర్లతో కూడిన భారత జట్టు.. జింబాబ్వేను ఢీకొట్టనుంది.
జింబాబ్వేతో టీ20 సిరీస్‍కు భారత జట్టు: శుభ్‍మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే