Stuart Binny: 4 పరుగులకే ఆరు వికెట్లు తీసిన బౌలర్ - అయినా పది మ్యాచ్‌లు కూడా ఆడని బీసీసీఐ ప్రెసిడెంట్ కొడుకు
24 October 2024, 11:02 IST
Stuart Binny: ఇండియా తరఫున అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన క్రికెటర్లలో ఒకరిగా స్టువర్ట్ బిన్నీ నిలిచాడు. 2014 బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. అయినా జట్టులో ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు.
స్టువర్ట్ బిన్నీ
రోజర్ బిన్నీ 1980 -90 దశకంలో టీమిండియా స్టార్ క్రికెటర్లలో ఒకరిగా పేరుతెచ్చుకున్నాడు. 1983 వరల్డ్ విప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగా కొనసాగారు. ఈ వరల్డ్ కప్‌లో 18 వికెట్లు తీసిన టీమిండియాగెలుపులో కీలక భూమిక పోషించాడు. క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన బీసీసీఐ ప్రెసిడెంట్‌గా, అండర్ 19 జట్టుకు కోచ్‌గా రోజర్ బిన్నీ పనిచేశాడు.
తండ్రి బాటలోనే...
రోజర్ బిన్నీ బాటలోనే అతడి అతడు కొడుకు స్టువర్ట్ బిన్నీ కూడా క్రికెటర్‌గా మారాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి టీమిండియాలో స్థానం సంపాదించుకున్నాడు. తక్కువ కాలంలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. మీర్పూర్ వేదికగా 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు సువర్ట్ బిన్నీ.
105 రన్స్‌కే టీమిండియా ఆలౌట్...
ఈ వన్డే మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 105 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బ్యాట్స్‌మెన్స్‌లో సురేష్ రైనా 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పదకొండో స్థానంలో బ్యాటింగ్ దిగిన ఉమేష్ యాదవ్ 17 పరుగులుతో టీమిండియా స్కోరును వంద పరుగులు దాటించాడు.
58 పరుగులు చేసిన బంగ్లాదేశ్...
106 పరుగుల సింపుల్ టార్గెట్‌తో బరిలో దిగిన బంగ్లాదేశ్ స్టువర్ట్ బిన్నీ దెబ్బకు 58 పరుగులకే కుప్పకూలింది. బిన్నీ దెబ్బకు బంగ్లాదేశ్‌లోని ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ డకౌట్ అయ్యారు.
ఈ వన్డే మ్యాచ్‌లో 4.4 ఓవర్లు మాత్రమే వేసిన బిన్నీ నాలుగు రన్స్ ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు. అందులో రెండు మెయిడిన్లు ఉన్నాయి. అతడి ఎకానమీ రేటు 0.85 మాత్రమే కావడం గమనార్హం.
టీమిండియా తరఫున అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన రెండో క్రికెటర్‌గా ఈ మ్యాచ్ ద్వారా బిన్నీ రికార్డ్ క్రియేట్ చేశాడు.
వరల్డ్ రికార్డ్ కానీ...
బంగ్లాదేశ్ మ్యాచ్‌తో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసినా స్టువర్ట్ బిన్నీ ఎక్కువ రోజులు టీమిండియాలో కొనసాగలేకపోయాడు. మొత్తంగా టీమిండియా తరఫున ఆరు టెస్ట్‌లు, పధ్నాలుగు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. బంగ్లాదేశ్ మ్యాచ్ మినహా మిగిలిన వాటిలో దారుణంగా విఫలం కావడంలో జట్టులో స్థానం కోల్పోయాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్‌తోపాటు ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు.