తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Musheer Khan: రంజీ ట్రోఫీలో డ‌బుల్ సెంచ‌రీ చేసిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ త‌మ్ముడు - పృథ్వీ షా, ర‌హానే విఫ‌లం

Musheer Khan: రంజీ ట్రోఫీలో డ‌బుల్ సెంచ‌రీ చేసిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ త‌మ్ముడు - పృథ్వీ షా, ర‌హానే విఫ‌లం

24 February 2024, 20:19 IST

google News
  • Musheer Khan: రంజీ ట్రోఫీలో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ త‌మ్ముడు ముషీర్ ఖాన్ డ‌బుల్ సెంచ‌రీ సాధించాడు. ముషీర్ మెరుపుల‌తో ముంబాయి ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 384 ప‌రుగులు చేసింది. 203 ప‌రుగుల‌తో ముషీర్ నాటౌట్‌గా మిగిలాడు.

ముషీర్ ఖాన్
ముషీర్ ఖాన్

ముషీర్ ఖాన్

Musheer Khan: స‌ర్ఫ‌రాజ్ ఖాన్ త‌మ్ముడు ముషీర్‌ఖాన్ రంజీ ట్రోఫీలో అద‌ర‌గొట్టాడు. డ‌బుల్ సెంచ‌రీ చేశాడు. బ‌రోడాతో జ‌రుగుతోన్న క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్‌లో 203 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఫ‌స్ట్ క్లాస్ కెరీర్‌లో ముషీర్‌ఖాన్‌కు ఇదే తొలి డ‌బుల్ సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం.

ముషీర్ డ‌బుల్ సెంచ‌రీతో తొలి ఇన్నింగ్స్‌లో ముంబాయి 384 ప‌రుగులు చేసింది. ముషీర్ మిన‌హా ముంబాయిలో మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అంద‌రూ విఫ‌ల‌మ‌య్యారు. ముషీర్ ఖాన్ త‌ర్వాత హార్దిక్ తోమ‌రే 57 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

ముషీర్ 203..మిగిలిన వారు 181...

ముంబాయి ఇన్నింగ్స్‌లో ముషీర్ ఖాన్ ఒక్క‌డే 203 ర‌న్స్ చేయ‌గా...మిగిలిన బ్యాట్స్‌మెన్స్ క‌లిసి 181 ప‌రుగులు చేశారు. ముషీర్ ఖాన్ కంటే 22 ప‌రుగులు త‌క్కువే చేశారు. 357 బాల్స్‌లో 18 ఫోర్ల‌తో డ‌బుల్ సెంచ‌రీ చేశాడు ముషీర్‌. ముంబాయి కీల‌క ప్లేయ‌ర్లు పృథ్వీషా, అజింక్య‌ ర‌హానేతో పాటు శార్ధూల్ ఠాకూర్ దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు.

పృథ్వీ షా 33 ర‌న్స్ చేయ‌గా...కెప్టెన్ అంజిక్య ర‌హానే కేవ‌లం మూడు ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. బ‌రోడా బౌల‌ర్ల‌లో భార్గ‌వ్ భ‌ట్ ఒక్క‌డే ముంబాయి బ్యాట్స్‌మెన్స్‌ను ఇబ్బంది పెట్టాడు. ఏడు వికెట్లు తీసుకున్నాడు. మిగిలిన మూడు వికెట్లు నిన‌ద్ ర‌త్వాకు ద‌క్కాయి. రెండో రోజు ముగిసే స‌రికి బ‌రోడా రెండు వికెట్ల న‌ష్టానికి 127 ప‌రుగులు చేసింది. ముంబాయి కంటే 257 ప‌రుగుల వెనుకంజ‌లో ఉంది.

సెకండ్ హ‌య్యెస్ట్ స్కోర‌ర్‌...

ఇటీవ‌ల ముగిసిన అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ముషీర్ ఖాన్ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. 60 యావ‌రేజ్‌తో 360 ప‌రుగులు చేశాడు. అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సెకండ్ హ‌య్యెస్ట్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ముషీర్ ఖాన్ మెరుపుల‌తో అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా ఫైన‌ల్ చేరుకున్న‌ది. కానీ తుది మెట్టులో ఆస్ట్రేలియా చేతిలో బోల్తా ప‌డింది. ర‌న్న‌ర‌ప్‌గా సిరీస్‌ను ముగించింది. వ‌ర‌ల్డ్ క‌ప్ ముషీర్ ఆట‌తీరుపై ప‌లువురు దిగ్గ‌జ క్రికెట‌ర్లు ప్ర‌శంస‌లు కురిపించారు.

స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ఎంట్రీ...

మ‌రోవైపు ముషీర్ ఖాన్ అన్న‌య్య స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ఇంగ్లండ్‌తో జ‌రుగుతోన్న టెస్ట్ సిరీస్ ద్వారా టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. కేఎల్ రాహుల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ గాయాల‌తో సిరీస్ నుంచి దూరం కావ‌డంతో అనూహ్యంగా స‌ర్ఫ‌రాజ్‌ఖాన్‌కు పిలుపు వ‌చ్చింది. అరంగేట్రం చేసిన ఫ‌స్ట్ టెస్ట్‌లోనే రెండు హాఫ్ సెంచ‌రీలు సాధించాడు. రాజ్ కోట్ టెస్ట్‌లో ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 62, సెకండ్ ఇన్నింగ్స్‌లో 68 ప‌రుగులు చేశాడు.

ప్ర‌స్తుతం రాంచీ వేదిక‌గా జ‌రుగుతోన్న నాలుగు టెస్ట్‌లో ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో మాత్రం విఫ‌ల‌మ‌య్యాడు. టీమిండియాలో అన్న‌య్య‌, రంజీ ట్రోఫీలో త‌మ్ముడు ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో అద‌ర‌గొడుతూ క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంటోన్నారు.

గ‌త డిసెంబ‌ర్‌లో జ‌రిగిన ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్ ప్లేయ‌ర్‌గా స‌ర్ఫ‌రాజ్ ఖాన్ నిలిచాడు. రాజ్‌కోట్ టెస్ట్‌తో పాటు దేశ‌వాళీ క్రికెట్‌లో దంచికొట్టిన అత‌డి తీసుకునేందుకు ప‌లు ఫ్రాంచైజ్‌లు ఆస‌క్తిని చూపుతున్నారు. స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌తోపాటు అత‌డి త‌మ్ముడు ముషీర్ ఖాన్ కూడా ఈ ఏడాది ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయ‌మ‌నే క్రికెట్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

టాపిక్

For latest cricket news, live scorestay connected with HT Telugu
తదుపరి వ్యాసం