Sarfaraz khan:అన్న ఇంగ్లాండ్‌పై...తమ్ముడు ఐర్లాండ్‌పై..ఒకేరోజు సెంచరీలు చేసిన సర్ఫరాజ్‌ఖాన్, ముషీర్‌ఖాన్
Sarfaraz khan: సర్ఫరాజ్‌తో పాటు అతడి తమ్ముడు ముషీర్‌ఖాన్ ఒకటే రోజు సెంచరీలు సాధించారు. సర్ఫరాజ్‌ఖాన్ ఇంగ్లాండ్‌పై సెంచరీ చేయగా ముషీర్‌ఖాన్ ఐర్లాండ్‌పై శతకంతో చెలరేగాడు.
Sarfaraz khan: సర్ఫరాజ్‌ఖాన్‌తో పాటు అతడి తమ్ముడు ముషీర్‌ఖాన్ ఒకే రోజు సెంచరీలు చేశారు. సర్ఫరాజ్‌ఖాన్ ఇంగ్లాండ్‌పై సెంచరీ చేయగా...అతడి తమ్ముడు ముషీర్‌ఖాన్ ఐర్లాండ్‌పై సెంచరీ సాధించాడు. అన్నదమ్ములిద్దరు ఒకే రోజు సెంచరీలు చేయడం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘనతను సర్ఫరాజ్, ముషీర్ ఖాన్ సాధించారు.
ఇంగ్లాండ్ లయన్స్‌తో...
ఇంగ్లాండ్ లయన్స్ ఇండియా ఏ అనఫీషియల్ టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. రెండో టెస్ట్‌లో గురువారం సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో చెలరేగాడు. టీ20 తరహాలో రెచ్చిపోయిన సర్ఫరాజ్‌ఖాన్ 160 బాల్స్‌లో పద్దెనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్లతో 161 రన్స్ చేసింది. సర్ఫరాజ్ ఖాన్‌తో దేవదత్ ఫడిక్కల్ కూడా సెంచరీ (105 రన్స్)తో చెలరేగాడు. చివరలో సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ కూడా హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఇండియా ఏ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్ ఆరు వికెట్లు తీసుకున్నాడు.
ఫస్ట్ ఇన్నింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ 23 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. ఈ అనఫీషియల్ టెస్ట్ సిరీస్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఫస్ట్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌ఖాన్ హాఫ్ సెంచరీ సాధించాడు.
ఐర్లాండ్‌పై ముషీర్‌ఖాన్…
అండర్ 19 వరల్డ్ కప్‌లో సర్ఫరాజ్‌ఖాన్ తమ్ముడు ముషీర్‌ఖాన్ ఐర్లాండ్‌పై గురువారం సెంచరీ సాధించాడు. 106 బాల్స్‌లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 118 రన్స్ చేశాడు. ముషీర్‌ఖాన్ జోరుతో ఇండియా తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఏడు వికెట్ల నష్టానికి 301 రన్స్ చేసింది. ముషీర్‌తో పాటు సహరన్ 75 రన్స్ చేశాడు. భారీ లక్ష్య ఛేదనతో బరిలో దిగిన ఐర్లాండ్ వంద పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో 201 పరుగుల తేడాతో ఇండియా విజయాన్ని సాధించింది. ముషీర్‌ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇండియా బౌలర్లు నమన్ తివారి నాలుగు, సౌమీ పాండే మూడు వికెట్లతో ఐర్లాండ్‌ను దెబ్బకొట్టారు.
దేశవాళీలో పరుగుల వరద...
సర్ఫరాజ్‌ఖాన్ దేశవాళీ క్రికెట్‌లో గత కొన్నాళ్లుగా పరుగులు వరద పారిస్తోన్నాడు. 2022 -23 రంజీ సీజన్‌లో తొమ్మిది ఇన్నింగ్స్‌లలోనే 92.66 యావరేజ్‌తో 556 రన్స్ చేశాడు. ఒక సెంచరీ మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. 162 అతడి బెస్ట్ స్కోర్ కావడం గమనార్హం. సౌతాఫ్రికాతో జరిగిన అనఫీషియల్ మ్యాచ్‌లో 61 బాల్స్‌లోనే సెంచరీ చేశాడు. దేశవాళీలో రాణించిన సర్ఫరాజ్ ఖాన్ మాత్రం విఫలమయ్యాడు. ఐపీఎల్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్13 యావరేజ్‌తో 53 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సర్ఫరాజ్ ఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 50 మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 585 రన్స్ చేశాడు. ఒకే ఒక హాఫ్ సెంచరీ సాధించడం గమనార్హం.
టాపిక్