(1 / 7)
ఐపీఎల్ 2024 టోర్నీ మార్చి 22వ తేదీన మొదలుకానుంది. చెన్నై వేదికగా తొలి మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడనున్నాయి. ఈ ఏడాది తొలి దశ షెడ్యూల్‍ను బీసీసీఐ నేడు (ఫిబ్రవరి 22) ప్రకటించింది. ఈ ఏడాది ఐపీఎల్‍లో మార్చి 23న పోరు ప్రారంభించనుంది సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH).
(X/Sunrisers Hyderabad)(2 / 7)
ఐపీఎల్ 2024 తొలి దశలో సన్‍రైజర్స్ హైదరాబాద్ నాలుగు మ్యాచ్‍లు ఆడనుంది. ఇందులో రెండు మ్యాచ్‍లు హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది.
(X/Sunrisers Hyderabad)(3 / 7)
ఐపీఎల్ 2024లో మార్చి 23వ తేదీన కోల్‍కతా నైట్ రైజర్స్ జట్టుతో సన్‍రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. కోల్‍కతా వేదికగా ఆరోజు రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది.
(Photo: IPLT20.com)(4 / 7)
మార్చి 27వ తేదీన హైదరాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో ఎస్‍ఆర్‌హెచ్ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది. మార్చి 31వ తేదీన గుజరాత్ టైటాన్స్ జట్టుతో అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ ఆడనుంది సన్‍రైజర్స్. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు షురూ అవుతుంది.
(Photo: IPL)(5 / 7)
సన్‍రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఏప్రిల్ 5వ తేదీన మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ వేదికగా ఆరోజున రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
(Photo: IPL)(6 / 7)
సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దక్షిణాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్‌రమ్ కెప్టెన్‍గా ఉన్నాడు. అయితే, ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో రూ.20.50కోట్ల కళ్లు చెదిరే ధరతో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను ఎస్ఆర్‌హెచ్ దక్కించుకుంది. మొత్తంగా హైదరాబాద్ జట్టులో 25 మంది ఆటగాళ్లు (8 మంది విదేశీ ప్లేయర్లు) ఉన్నారు.
(IPL)(7 / 7)
ఈ ఏడాది లోక్‍సభ ఎన్నికలు ఉండటంతో ఐపీఎల్ 2024 షెడ్యూల్‍ను రెండు దశలుగా ప్రకటించాలని బీసీసీఐ నిర్ణయించింది. నేడు ప్రకటించిన తొలి షెడ్యూల్‍లో 21 మ్యాచ్‍లను ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో తదుపరి షెడ్యూల్‍ను వెల్లడించనుంది.
ఇతర గ్యాలరీలు