తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma Wife: ఇది చాలా తప్పు: రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై భార్య రియాక్షన్ వైరల్

Rohit Sharma Wife: ఇది చాలా తప్పు: రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై భార్య రియాక్షన్ వైరల్

Hari Prasad S HT Telugu

06 February 2024, 13:57 IST

google News
    • Rohit Sharma Wife: రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించడంపై అతని భార్య రితికా సజ్దే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది చాలా తప్పు అంటూ మార్క్ బౌచర్ వీడియోపై కామెంట్ చేయడం గమనార్హం.
రోహిత్ శర్మతో రితికా సజ్దే
రోహిత్ శర్మతో రితికా సజ్దే

రోహిత్ శర్మతో రితికా సజ్దే

Rohit Sharma Wife: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు ఇవ్వడం అందరి మద్దతుతోనే జరిగిందని ఫ్యాన్స్ భావించారు. దీనికి రోహిత్ కూడా అంగీకరించాడేమో అని అనుకున్నారు. కానీ తాజాగా అతని భార్య రితికా సజ్దే ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.

రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం వెనుక ఉన్న అసలు కారణం వెల్లడిస్తూ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ చేసిన కామెంట్స్ పై ఆమె స్పందించింది. ఇన్‌స్టాలో ఆ వీడియోపై రితికా కామెంట్ చేసింది.

రోహిత్‌ను తప్పించడంపై రితికా రియాక్షన్ ఇదీ

ముంబై ఇండియన్స్ ను రికార్డు స్థాయిలో ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు రోహిత్ శర్మ. కనీసం మరో రెండేళ్లు అతడు ఆ టీమ్ తరఫున ఐపీఎల్లో కెప్టెన్ గా కొనసాగుతాడని అందరూ భావించారు. కానీ సడెన్ గా గుజరాత్ టైటన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకురావడం, తర్వాత కొద్ది రోజులకే రోహిత్ ను తప్పించి అతనికి కెప్టెన్సీ ఇవ్వడం జరిగిపోయింది.

దీనిపై లక్షలాది మంది ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రోహిత్ భార్య రితికా కూడా స్పందించింది. ఈ నిర్ణయం వెనుక కారణాన్ని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో హెడ్ కోచ్ మార్క్ బౌచర్ వెల్లడించాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. దీనికి రితికా కామెంట్ చేసింది. "ఇది చాలా తప్పుడు నిర్ణయం" అని ఆమె అనడం గమనార్హం.

ఆమె కామెంట్ కు వేల మంది అభిమానులు మద్దతు తెలిపారు. లైక్ చేయడంతోపాటు అసలు ఎలాంటి తప్పు జరిగిందో చెప్పాలని కొందరు ఆమెను కోరారు. తాము రోహిత్ శర్మ వీరాభిమానులమని, ఈ విషయంలో రోహిత్ కు పూర్తిగా అండగా ఉంటామని కామెంట్స్ చేశారు.

ఇదొక క్రికెటింగ్ డెసిషన్: బౌచర్

అంతకుముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడాన్ని ఓ క్రికెటింగ్ నిర్ణయంగా హెడ్ కోచ్ మార్క్ బౌచర్ అభివర్ణించాడు. ఈ నిర్ణయంపై అభిమానులు ఎమోషనల్ కావాల్సిన అవసరం లేదని అతడు అన్నాడు. "ఇది పూర్తిగా క్రికెటింగ్ డెసిషన్. హార్దిక్ ను ఓ ప్లేయర్ గా తీసుకురావాలని అనుకున్నాం. నా వరకూ ఇదొక మార్పు జరుగుతున్న సమయం.

ఇండియాలో చాలా మందికి ఈ విషయం అర్థం కాదు. వాళ్లు ఎమోషనల్ అవుతారు. కానీ క్రికెట్ నుంచి ఈ ఎమోషన్స్ ను పక్కన పెట్టాలి. ఈ నిర్ణయం ఓ వ్యక్తిగా, ప్లేయర్ గా రోహిత్ తన అత్యుత్తమ ఆట ప్రదర్శించడానికి తోడ్పడుతుందని నేను నమ్ముతున్నాను. అతడు కెప్టెన్సీ భారం తొలగిపోయి ఓ ప్లేయర్ గా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను" అని బౌచర్ స్మాష్ స్పోర్ట్స్ పాడ్‌కాస్ట్ తో అన్నాడు.

2013లో రికీ పాంటింగ్ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలను రోహిత్ అందుకున్నాడు. అక్కడి నుంచి 2013, 2015, 2017, 2019, 2020లలో ఐదుసార్లు రోహిత్ కెప్టెన్సీలో ముంబై విజయాలు సాధించింది. అయితే గత రెండు సీజన్లుగా అనుకున్న స్థాయిలో ఆ టీమ్ రాణించడం లేదు.

తదుపరి వ్యాసం