Rohit Sharma Mumbai Indians: ముంబై ఇండియన్స్‌పై రోహిత్ ఫ్యాన్స్ ఫైర్.. జెర్సీకి నిప్పు.. 5 లక్షల పాలోవర్లు డౌన్-rohit sharma fans anger on mumbai indians continues a fan burns jersey ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rohit Sharma Mumbai Indians: ముంబై ఇండియన్స్‌పై రోహిత్ ఫ్యాన్స్ ఫైర్.. జెర్సీకి నిప్పు.. 5 లక్షల పాలోవర్లు డౌన్

Rohit Sharma Mumbai Indians: ముంబై ఇండియన్స్‌పై రోహిత్ ఫ్యాన్స్ ఫైర్.. జెర్సీకి నిప్పు.. 5 లక్షల పాలోవర్లు డౌన్

Dec 16, 2023, 05:21 PM IST Chatakonda Krishna Prakash
Dec 16, 2023, 05:21 PM , IST

  • Rohit Sharma - Mumbai Indians: రోహిత్ శర్మను జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడం పట్ల ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌పై అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్‍స్టాగ్రామ్‍లో ఫ్రాంచైజీకి ఫాలోవర్లు తగ్గుతున్నారు. ఓ అభిమాని ఏకంగా జెర్సీకి నిప్పు పెట్టాడు.

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను ఆ ఫ్రాంచైజీ తప్పించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) సీజన్‍లో హార్దిక్ పాండ్యా జట్టుకు కెప్టెన్సీ చేస్తాడని ప్రకటించింది. దీంతో రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

(1 / 5)

జట్టుకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన సక్సెస్ ఫుల్ కెప్టెన్, గ్రేట్ ప్లేయర్ రోహిత్ శర్మను.. సారథ్యం నుంచి ఎలా తప్పిస్తారని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్య పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

(2 / 5)

రోహిత్ శర్మను కెప్టెన్సీని తీసేసినందుకు చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ అకౌంట్లను అన్‍ఫాలో అవుతున్నారు. ఇన్‍స్టాగ్రామ్‍లో ఆ ఫ్రాంచైజీ అకౌంట్‍కు ఒక్క రోజులో 5 లక్షల ఫాలోవర్లు తగ్గారు. ప్రస్తుతం 12.7 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.  

(3 / 5)

రోహిత్ శర్మను కెప్టెన్సీని తీసేసినందుకు చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ అకౌంట్లను అన్‍ఫాలో అవుతున్నారు. ఇన్‍స్టాగ్రామ్‍లో ఆ ఫ్రాంచైజీ అకౌంట్‍కు ఒక్క రోజులో 5 లక్షల ఫాలోవర్లు తగ్గారు. ప్రస్తుతం 12.7 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.  (Twitter)

కొందరు రోహిత్ శర్మ అభిమానులు ముంబై ఇండియన్స్ జెర్సీలను, క్యాప్‍లను కాల్చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ ఫ్రాంచైజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. 

(4 / 5)

కొందరు రోహిత్ శర్మ అభిమానులు ముంబై ఇండియన్స్ జెర్సీలను, క్యాప్‍లను కాల్చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ ఫ్రాంచైజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. 

ముంబై నుంచి గుజరాత్ టైటాన్స్ వెళ్లిన హార్దిక్‍ను తిరిగి తీసుకొచ్చి మరీ కెప్టెన్‍ను చేయడం ఏంటని రోహిత్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. రోహిత్‍కు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆగ్రహిస్తున్నారు. అయితే, కెప్టెన్సీ తొలగింపు గురించి కొన్ని రోజుల కిందటే రోహిత్‍కు ముంబై ఫ్రాంచైజీ చెప్పినట్టు సమాచారం బయటికి వచ్చింది. 

(5 / 5)

ముంబై నుంచి గుజరాత్ టైటాన్స్ వెళ్లిన హార్దిక్‍ను తిరిగి తీసుకొచ్చి మరీ కెప్టెన్‍ను చేయడం ఏంటని రోహిత్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. రోహిత్‍కు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆగ్రహిస్తున్నారు. అయితే, కెప్టెన్సీ తొలగింపు గురించి కొన్ని రోజుల కిందటే రోహిత్‍కు ముంబై ఫ్రాంచైజీ చెప్పినట్టు సమాచారం బయటికి వచ్చింది. (PTI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు