తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma: చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు రోహిత్ శర్మ: అంబటి రాయుడు కామెంట్స్ వైరల్

Rohit Sharma: చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు రోహిత్ శర్మ: అంబటి రాయుడు కామెంట్స్ వైరల్

Hari Prasad S HT Telugu

11 March 2024, 16:10 IST

google News
    • Rohit Sharma: ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ కోల్పోయిన రోహిత్ శర్మను చెన్నై సూపర్ కింగ్స్ లో చూడాలని అనుకుంటున్నట్లు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు రోహిత్ శర్మ: అంబటి రాయుడు కామెంట్స్ వైరల్
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు రోహిత్ శర్మ: అంబటి రాయుడు కామెంట్స్ వైరల్ (PTI)

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు రోహిత్ శర్మ: అంబటి రాయుడు కామెంట్స్ వైరల్

Rohit Sharma: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడు చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడాలని అతడు అనడం గమనార్హం. గతేడాది డిసెంబర్ లో రోహిత్ ను పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ అప్పగించిన విషయం తెలిసిందే. పదేళ్ల పాటు ఆ టీమ్ కెప్టెన్ గా ఉన్న రోహిత్.. ఐదు టైటిల్స్ అందించాడు.

రోహిత్ విషయంలో తొందరపడ్డారు

రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై అభిమానులు తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. నిజానికి రోహిత్ భార్య రితికా కూడా ఇన్‌స్టాగ్రామ్ లో తన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ కెప్టెన్సీలో రోహిత్ ఆడతాడా లేదా అన్న సస్పెన్స్ నెలకొంది. ఇదే సమయంలో ఈ అంశంపై ముంబై, చెన్నై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించాడు.

రోహిత్ కెప్టెన్సీ విషయంలో ముంబై ఫ్రాంఛైజీ తొందరపడిందని అతడు అభిప్రాయపడ్డాడు. "ఈ ఏడాది రోహితే కెప్టెన్ గా కొనసాగాల్సింది. వచ్చే ఏడాది హార్దిక్ కు ఆ బాధ్యతలు అప్పగించాల్సింది. రోహిత్ ఇప్పటికీ టీ20ల్లో ఇండియాకు కెప్టెన్ గా ఉన్నాడు. ఈ విషయంలో ముంబై ఇండియన్స్ తొందరపడినట్లు అనిపిస్తోంది. కానీ ఏది మంచో వాళ్లకే తెలుసు. గుజరాత్ టైటన్స్ కు కెప్టెన్ గా ఉండటం వేరు. ముంబై ఇండియన్స్ లో అందరూ స్టార్లే కావడంతో కెప్టెన్సీ అంత సులువు కాదు. చాలా ఒత్తిడి ఉంటుంది. అందరూ దానిని తట్టుకోలేరు" అని రాయుడు అని అన్నాడు.

సీఎస్కేకు రోహిత్ శర్మ

అంతేకాదు రోహిత్ శర్మను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చూడాలని ఉన్నట్లు కూడా అంబటి రాయుడు చెప్పడం గమనార్హం. రోహిత్ మరో ఐదారేళ్లు ఆడగలడని, అందువల్ల అతన్ని సీఎస్కేలో ఆడితే బాగుంటుందని అన్నాడు. గతంలో అంబటి రాయుడు ముంబై ఇండియన్స్ తోపాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా ఆడాడు.

ఒకవేళ ధోనీ రిటైరైతే వచ్చే సీజన్ నుంచి రోహిత్ సీఎస్కే కెప్టెన్సీ చేపట్టాలా అని ప్రశ్నించినప్పుడు.. "రోహిత్ మరో ఐదారేళ్లు ఆడగలడు. అందుకే రోహిత్ ను నేను సీఎస్కేలో చూడాలనుకుంటున్నాను. ఒకవేళ కెప్టెన్ కావాలనుకుంటే అతడు ప్రపంచంలోనే ఎక్కడైనా కాగలడు. కానీ అది అతనికే వదిలేయాలి. ఇప్పటికే ముంబై ఇండియన్స్ కు ఎన్నో ఏళ్లు ఆడాడు. ఎన్నో టైటిల్స్ సాధించిపెట్టాడు. ఇక ఇప్పుడు సీఎస్కేకు వెళ్లడంలో తప్పేమీ లేదు." అని రాయుడు అన్నాడు.

ముంబై ఇండియన్స్ కు 2013 నుంచి కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ.. ఐదుసార్లు విజేతగా నిలిపాడు. అయితే గత రెండు సీజన్లుగా ఆ టీమ్ రాణించడం లేదు. దీంతో సడెన్ గా గతేడాది గుజరాత్ టైటన్స్ నుంచి తమ మాజీ ప్లేయర్ హార్దిక్ పాండ్యాను వెనక్కి తీసుకొచ్చిన ముంబై ఇండియన్స్.. అతనికి కెప్టెన్సీ అప్పగించింది. గుజరాత్ ను తొలి సీజన్ లో టైటిల్ అందించి, రెండో సీజన్ లోఫైనల్ చేర్చిన హార్దిక్.. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ ఎలా చేస్తోడా చూడాలి.

తదుపరి వ్యాసం