MS Dhoni in IPL 2024: ఐపీఎల్ 2024లో ధోనీ కొత్త రోల్ ఇదే.. సస్పెన్స్‌కు తెరదించిన మిస్టర్ కూల్-ms dhoni new role in ipl 2024 chennai super kings captain reveals his new role with a funny video ipl news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni In Ipl 2024: ఐపీఎల్ 2024లో ధోనీ కొత్త రోల్ ఇదే.. సస్పెన్స్‌కు తెరదించిన మిస్టర్ కూల్

MS Dhoni in IPL 2024: ఐపీఎల్ 2024లో ధోనీ కొత్త రోల్ ఇదే.. సస్పెన్స్‌కు తెరదించిన మిస్టర్ కూల్

Hari Prasad S HT Telugu
Mar 06, 2024 01:17 PM IST

MS Dhoni in IPL 2024: ఐపీఎల్ 2024కు ప్రారంభానికి ముందు కొత్త రోల్ అంటూ అభిమానులను ఉత్కంఠలోకి నెట్టిన ధోనీ.. ఆ రోల్ ఏంటో రివీల్ చేశాడు. ఓ ఫన్నీ వీడియోతో ఈ సస్పెన్స్ కు తెరదించాడు.

ఐపీఎల్ 2024లో తన కొత్త రోల్ ఏంటో రివీల్ చేసిన సస్పెన్స్ కు తెరదించిన ఎమ్మెస్ ధోనీ
ఐపీఎల్ 2024లో తన కొత్త రోల్ ఏంటో రివీల్ చేసిన సస్పెన్స్ కు తెరదించిన ఎమ్మెస్ ధోనీ

MS Dhoni in IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ కొత్త సీజన్ కొత్త రోల్ అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఎంత వైరల్ అయిందో తెలుసు కదా. కొత్త రోల్ అంటే ధోనీ ప్లేయర్ గా తప్పుకొని సీఎస్కేకు కోచ్ అవుతాడా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే మొత్తానికి ఈ కొత్త రోల్ సస్పెన్స్ కు బుధవారం (మార్చి 6) మిస్టర్ కూల్ తెరదించాడు.

ధోనీ కొత్త రోల్ ఇదే

ధోనీ సోమవారం (మార్చి 4) ఫేస్‌బుక్ పేజీలో చేసిన ఓ పోస్ట్ వైరల్ అయింది. "కొత్త సీజన్ కొత్త రోల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని ధోనీ అందులో అన్నాడు. అయితే ఆ రోల్ ఏంటనేది మాత్రం వెల్లడించలేదు. తాజాగా బుధవారం (మార్చి 6) ఆ రోల్ ఐపీఎల్ కోసం చేసిన యాడ్ లో తాను పోషించిన డ్యుయల్ రోల్ అని తేలింది.

ఐపీఎల్ 2024 రాబోతుండటంతో జియో సినిమా ఓ కొత్త యాడ్ రిలీజ్ చేసింది. ఇందులో ధోనీ డ్యుయల్ రోల్లో కనిపించాడు. ఓ యంగ్ ధోనీ కాగా.. మరొకరు వయసు మీద పడిన ధోనీ. ఈ ఇద్దరు ధోనీల యాడ్ ఫన్నీగా సాగిపోయింది. మొబైల్లో యంగ్ ధోనీ మ్యాచ్ చూస్తూ ఉంటాడు. అప్పుడు లోపలి నుంచి తనకు ఛాతీలో నొప్పిగా ఉందంటూ వస్తాడు వయసు మీద పడిన ధోనీ.

ఇద్దరూ మొబైల్లో ఐపీఎల్ మ్యాచ్ లు చూస్తూనే అంబులెన్స్ లో వెళ్తుంటారు. ఈలోపు ఓ క్యాచ్ డ్రాప్ అవడంతో బెడ్ పై ఉన్న ధోనీ లేచి కూర్చొని ఓ పెద్ద త్రేన్పు తీస్తాడు.. నొప్పేమీ లేదు.. ఉత్త గ్యాసే అంటాడు. ఎందుకంటే ఇప్పుడంతా ఇక్కడే.. ఇంకెక్కడ అనే క్యాప్షన్ తో యాడ్ ముగుస్తుంది. ఈసారి ఐపీఎల్ మొత్తం కేవలం జియో సినిమాలోనే అనే యాడ్ ను ఇలా ధోనీ డ్యుయల్ రోల్ తో వినూత్నంగా తీశారు.

ఈ వీడియోను ధోనీ కూడా షేర్ చేశాడు. జియో సినిమాను ట్యాగ్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాడు. కొత్త సీజన్ డబుల్ రోల్.. జియో సినిమాలో మార్చి 22న నుంచి ఐపీఎల్ యాక్షన్ అంతా ఫ్రీగా చూసేయండి అనే క్యాప్షన్ తో ధోనీ ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అవుతుందా?

2020లో ఎప్పుడైతే టీమిండియాకు ధోనీ గుడ్ బై చెప్పాడో అప్పటి నుంచీ గత మూడు ఐపీఎల్ సీజన్లలోనూ ధోనీకి ఇదే చివరి సీజన్ అన్న వాదన వినిపించింది. గతేడాది అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి టైటిల్ గెలవడంతో ఇక ధోనీ రిటైరవడం ఖాయం అనుకున్నారు. కానీ అతడు మాత్రం తన మోకాలి గాయం నుంచి కోలుకొని కొత్త సీజన్ కు రెడీ అయ్యాడు.

మరి ఈ సీజన్ అయినా 42 ఏళ్ల ధోనీకి చివరిది అవుతుందా? దీనికి ధోనీ తప్ప ఎవరూ సమాధానం చెప్పలేరు. పెద్ద పెద్ద నిర్ణయాలను సడెన్ గా తీసుకొని ఆశ్చర్యపరిచే ధోనీ మనసులో ఏముంటుందో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. దీంతో ఐపీఎల్ 2024 ధోనీకి చివరి సీజన్ అవుతుందా అన్నదానికి సమాధానం లేదు.