Hardik Pandya: హార్దిక్ పాండ్యాను ఎందుకు వదిలేశారు.. అతనికో న్యాయం ఇషాన్‌కో న్యాయమా?: బీసీసీఐని నిలదీసిన ఇర్ఫాన్ పఠాన్-irfan pathan questions bcci contract for hardik pandya despite he did not play ranji trophy ishan kishan shreyas iyer ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Hardik Pandya: హార్దిక్ పాండ్యాను ఎందుకు వదిలేశారు.. అతనికో న్యాయం ఇషాన్‌కో న్యాయమా?: బీసీసీఐని నిలదీసిన ఇర్ఫాన్ పఠాన్

Hardik Pandya: హార్దిక్ పాండ్యాను ఎందుకు వదిలేశారు.. అతనికో న్యాయం ఇషాన్‌కో న్యాయమా?: బీసీసీఐని నిలదీసిన ఇర్ఫాన్ పఠాన్

Hari Prasad S HT Telugu
Feb 29, 2024 02:19 PM IST

Irfan Pathan on Hardik Pandya: రంజీ ట్రోఫీ ఆడకపోయినా హార్దిక్ పాండ్యా కాంట్రాక్టును మాత్రం బీసీసీఐ కొనసాగించడాన్ని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నించాడు. అతన్ని మాత్రం ఎందుకు వదిలేశారని నిలదీశాడు.

ఇషాన్ లాగే హార్దిక్ పాండ్యా కూడా రంజీ ట్రోఫీ ఆడకపోయినా అతనికి కాంట్రాక్టు ఇచ్చిన బీసీసీఐ
ఇషాన్ లాగే హార్దిక్ పాండ్యా కూడా రంజీ ట్రోఫీ ఆడకపోయినా అతనికి కాంట్రాక్టు ఇచ్చిన బీసీసీఐ (AP)

Irfan Pathan on Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను లక్ష్యంగా చేసుకున్నాడు మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లాగే గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్దిక్ కూడా రంజీ ట్రోఫీ ఆడలేదు. అయినా బీసీసీఐ మాత్రం అతన్ని వదిలేసింది. మిగిలిన ఇద్దరు క్రికెటర్ల కాంట్రాక్టును మాత్రం రద్దు చేసింది.

ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ వైరల్

బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల జాబితాను బుధవారం (ఫిబ్రవరి 28) అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ లిస్టులో నుంచి ఊహించినట్లే ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ పేర్లను తొలగించారు. బీసీసీఐ పదేపదే చెబుతున్నా వీళ్లు రంజీ ట్రోఫీ ఆడలేదు. దీంతో వాళ్లను తాజా కాంట్రాక్టుల జాబితాలో నుంచి తొలగించారు. అయితే హార్దిక్ పాండ్యా కూడా వీళ్లలాగే రంజీ ట్రోఫీ ఆడకుండా వైట్ బాల్ క్రికెట్ కే ప్రాధాన్యమిచ్చినా బీసీసీఐ అతన్ని చూసీచూడనట్లు వదిలేసింది.

దీనినే తాజాగా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నించాడు. అందరికీ ఒకటే రూల్ లేకపోతే ఇండియన్ క్రికెట్ లో అనుకున్న ఫలితాలను సాధించలేరని అతడు కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఇర్ఫాన్ ట్వీట్ వైరల్ అవుతోంది.

"ఇషాన్, శ్రేయస్ ఇద్దరూ టాలెంట్ ఉన్న ప్లేయర్స్. వాళ్లిద్దరూ బలంగా పుంజుకుంటారని ఆశిస్తున్నా. అయితే హార్దిక్ లాంటి ప్లేయర్స్ రెడ్ బాల్ క్రికెట్ ఆడకపోయినా.. వాళ్లు జాతీయ జట్టులో లేని సమయంలో వైట్ బాల్ క్రికెట్ మాత్రం ఆడొచ్చా? అందరికీ ఒకటే నిబంధన లేకపోతే ఇండియన్ క్రికెట్ లో అనుకున్న ఫలితాలను సాధించలేము" అని ఇర్ఫాన్ చాలా ఘాటుగా ట్వీట్ చేశాడు.

హార్దిక్ పాండ్యా ఎక్కడ?

గతేడాది వరల్డ్ కప్ సందర్భంగా నాలుగో మ్యాచ్ లో హార్దిక్ గాయపడ్డాడు. అతని మడమకు బలమైన గాయం కావడంతో అప్పటి నుంచీ టీమ్ కు దూరంగానే ఉంటున్నాడు. కోలుకున్న తర్వాత కూడా మార్చి 22 నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు కానీ.. రంజీ ట్రోఫీ మాత్రం ఆడలేదు. అతనితోపాటే బరోడాలో ఇషాన్ కూడా ఐపీఎల్ కోసం సిద్ధమయ్యాడు.

ప్రస్తుతం హార్దిక్ డీవై పాటిల్ టీ20 కప్ ఆడుతున్నాడు. అటు విజయ్ హజారే ట్రోఫీకిగానీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి కూడా హార్దిక్ తన పేరు నమోదు చేసుకోలేదు. హార్దిక్ ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడనున్నాడు. అతన్ని మాత్రం బీసీసీఐ చూసీ చూడనట్లు వదిలేయడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.

అంతేకాదు హార్దిక్ ను ఎ గ్రేడ్ లోనే బీసీసీఐ కొనసాగించింది. ఇందులోని ప్లేయర్స్ కు ఏడాదికి రూ.5 కోట్లు ఇస్తారు. ఎ ప్లస్ లో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా, జడేజాలకు రూ.7 కోట్లు దక్కుతాయి. అయితే గతేడాది గ్రేడ్ బిలో ఉన్న శ్రేయస్ అయ్యర్ కు డిమోషన్ కాదు కదా మొత్తానికే లిస్టులో నుంచి తొలగించారు. అటు గ్రేడ్ సిలో ఉన్న ఇషాన్ పరిస్థితీ ఇంతే. బీసీసీఐ పాటిస్తున్న ఈ ద్వంద్వ ప్రమాణాలనే ఇర్ఫాన్ ప్రశ్నించాడు.

Whats_app_banner