Hardik Pandya: హార్దిక్ పాండ్య కోసం ముంబై ఇండియన్స్..గుజరాత్‌కు వంద కోట్లు చెల్లించిందా?
Hardik Pandya: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగుతోన్నాడు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య. గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్ అతడిని కొనుగులు చేసింది. పాండ్య కోసం ముంబై ఇండియన్స్ ..గుజరాత్‌కు వంద కోట్లు చెల్లించినట్లు సమాచారం.
Hardik Pandya: 2024 ఐపీఎల్‌లో భారీగా మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త కెప్టెన్లు, ప్లేయర్లతో ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు బరిలోకి దిగనున్నాయి. వీటిలో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్య మారడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. 2024 ఐపీఎల్ సీజన్‌కు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్య కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
2022 సీజీన్‌తోనే గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ విజేతగా నిలిచింది. 2023లో ఐపీఎల్ రన్నరప్ నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. గుజరాత్‌ను సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజ్‌గా నిలబెట్టడంతో హార్దిక్ పాండ్య కీలక భూమిక పోషించాడు.
అతడిని గుజరాత్ టైటాన్స్ ఎందుకు వదులుకుందన్నది క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే హార్దిక్ పాండ్య కోసం ముంబై ఇండియన్స్ ఏకంగా వంద కోట్ల ట్రాన్స్‌ఫర్ ఫీజుగా గుజరాత్ టైటాన్స్‌కు చెల్లించినట్లు కథనాలు వెలువడుతోన్నాయి.
బీసీసీఐ అనుమతితోనే హార్దిక్ పాండ్యను గుజరాత్ నుంచి ముంబై భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు చెబుతోన్నారు. హార్దిక్ పాండ్యకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొనే ముంబై ఇండియన్స్ వంద కోట్లు చెల్లించినట్లు సమాచారం. ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య కొనసాగుతోన్నాడు.
రోహిత్ తర్వాత వన్డే పగ్గాలు కూడా అతడికే దక్కనుండటం ఖాయంగానే కనిపిస్తోంది. మరోవైపు ఐపీఎల్‌లో ఆల్‌రౌండర్‌గా పాండ్యకు ఉన్న బలమైన రికార్డును దృష్టిలో పెట్టుకొనే అతడి కోసం ముంబై ఇండియన్ వంద కోట్లు ఖర్చుచేసినట్లు చెబుతున్నారు.