తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rcb Playoffs Scenario : ఆర్సీబీకి ప్లేఆఫ్స్​ ​చేరే అవకాశాలు ఇంకా ఉన్నాయి- ఎలా అంటే..

RCB playoffs scenario : ఆర్సీబీకి ప్లేఆఫ్స్​ ​చేరే అవకాశాలు ఇంకా ఉన్నాయి- ఎలా అంటే..

Sharath Chitturi HT Telugu

22 April 2024, 9:57 IST

    • RCB playoffs scenario IPL 2024 : ఆర్సీబీకి ప్లేఆఫ్స్​  అవకాశాలు ఇంకా ఉన్నాయా? అంటే.. అవుననే సమాధానం వస్తుంది. కానీ అది చాలా కష్టం. అది ఎలా అంటే..
ఆర్సీబీ ప్లేఆఫ్స్​ అవకాశాలు ఇంకా ఉన్నాయా?
ఆర్సీబీ ప్లేఆఫ్స్​ అవకాశాలు ఇంకా ఉన్నాయా? (PTI)

ఆర్సీబీ ప్లేఆఫ్స్​ అవకాశాలు ఇంకా ఉన్నాయా?

RCB playoffs scenario IPL 2024 : ఐపీఎల్​ 2024లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు (ఆర్సీబీ) కష్టాలు కొనసాగుతున్నాయి. ఆదివారం.. కోల్​కతా నైట్​ రైడర్స్​తో జరిగిన ఉత్కంఠ పోరులో కూడా విరాట్​ కోహ్లీ టీమ్​ ఓడిపోయింది. ఫలితంగా.. ఈ ఐపీఎల్​ సీజన్​లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో 7సార్లు ఓటమి పాలైంది. ఇక ఐపీఎల్​ 2024 ప్లేఆఫ్స్​ రేసులో ఆర్సీబీ దాదాపు ఎగ్జిట్​ ఇచ్చినట్టేనా? అని అడిగితే మాత్రం.. ఇంకా అవకాశం ఉందనే చెప్పుకోవాలి. అది ఎలా అంటే..

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli on retirement: మళ్లీ మీకు కనిపించను.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

IPL 2024: ఒక్క మ్యాచ్ ఆడ‌కుండా కోట్లు సంపాదించారు - ఈ ఐపీఎల్‌లో బెంచ్‌కే ప‌రిమిత‌మైన స్టార్ క్రికెట‌ర్లు వీళ్లే

India vs Pakistan: టీ20 ప్రపంచకప్‍లో ఇండియా, పాకిస్థాన్ సమరం జరిగే స్టేడియం ప్రారంభం.. లాంచ్ చేసిన పరుగుల వీరుడు

Sunrisers Hyderabad: రాజస్థాన్ వరుస పరాజయాలు.. సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఆ గోల్డెన్ ఛాన్స్

ఆర్సీబీ ప్లేఆఫ్స్​ అవకాశాలు..

ఇందాక చెప్పినట్టు.. ఈ ఐపీఎల్​ 2024లో ఆర్సీబీ ఇప్పటివరకు 8 మ్యాచ్​లు ఆడింది. అందులో ఒక్కటంటే ఒక్క మ్యాచ్​ మాత్రమే గెలిచి.. 2 పాయింట్స సంపాదించుకుని, పాయింట్స్​ టేబుల్​లో చివరి స్థానంలో నిలిచింది. ఇక రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు టీమ్​ నెట్​ రన్​ రేట్​ -1.046గా ఉంది. చెత్త ప్రదర్శనతో ఆర్సీబీ ఫ్యాన్స్​ నిరాశ చెందుతున్నారు. కానీ.. ఆర్సీబీ ప్లేఆఫ్స్​కి చేరే అవకాశం ఇంకా ఉంది. కానీ అది ఆర్సీబీ చేతుల్లో లేదు!

RCB IPL 2024 : ఐపీఎల్​ 2024లో ఆర్సీబీకి ఇంకా 6 మ్యాచ్​లు ఉన్నాయి. వాటన్నింటిలో గెలిస్తే.. ఆర్సీబీకి 14 పాయింట్లు వస్తాయి. సాధారణంగా.. ఒక జట్టు ప్లేఆఫ్స్​కి వెళ్లాలంటే 16 పాయింట్లు ఉండాలి. కానీ కొన్నికొన్ని సార్లు.. 14 పాయింట్లతో కూడా ప్లేఆఫ్స్​కి చేరుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ దాని కోసం.. ఇతర జట్ల ప్రదర్శన, నెట్​ రన్​రేట్​ పై అధికంగా ఆధారపడాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:- IPL 2024 Orange Cap: ఆరెంజ్ క్యాప్‌లో కోహ్లియే టాప్.. పర్పుల్ క్యాప్‌లో బుమ్రాను సమం చేసిన పంజాబ్ బౌలర్

అంటే.. ఐపీఎల్​ 2024లో ఆర్సీబీ ప్లేఆఫ్స్​ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నా.. అది చాలా కష్ట. ముందు కోహ్లీ టీమ్​ మిగిలిన 6 మ్యాచుల్లో కచ్చితంగా గెలవాలి. తమకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడాలని ప్రార్థనలు చేయాలి. అంతే! అలా జరగకుండా.. ఇంకొక్క మ్యాచ్​ ఓడిపోయినా.. ఆర్సీబీ ప్లేఆఫ్స్​ నుంచి ఔట్​ అయినట్టే.

Virat Kohli out today match video : ఆర్సీబీ తదుపరి మ్యాచ్​.. పటిష్ఠ సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరగనుంది. ఏప్రిల్​ 25 సాయంత్రం 7:30 గంటలకు ఉప్పల్​ వేదికగా మ్యాచ్​ మొదలవుతుంది.

కేకేఆర్​ వర్సెస్​ ఆర్సీబీ..

ఇక ఆదివారం జరిగిన మ్యాచ్​ విషయానికొస్తే.. కోల్‍కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‍లో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు ఓటమి పాలైంది. ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీ పరాజయం చెందింది. 

KKR vs RCB IPL 2024 : ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‍కతా నైట్‍రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 48 పరుగులు; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50) హాఫ్ సెంచరీ చేశాడు. చివర్లో రమణ్‍దీప్ సింగ్ (9 బంతుల్లో 24 పరుగులు నాటౌట్) దూకుడుగా ఆడాడు. బెంగళూరు బౌలర్లలో యశ్ దయాల్, కామెరూన్ గ్రీన్ తలా రెండు వికెట్లు తీశారు. మహమ్మద్ సిరాజ్, లూకీ ఫెర్గ్యూసన్‍ చెరో వికెట్ తీసుకున్నారు.

తదుపరి వ్యాసం