Siraj Road Show: హైదరాబాద్‌లో సిరాజ్ రోడ్ షో - ముంబై సెలబ్రేషన్స్‌ను రీక్రియేట్ చేయాలంటూ టీమిండియా క్రికెటర్ పోస్ట్
05 July 2024, 10:55 IST
Siraj Road Show: టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో సభ్యుడైన పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఘనంగా స్వాగతం పలికబోతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. హైదరాబాద్‌లో విజయయాత్రను నిర్వహించబోతున్నారు. ఈ విజయయాత్ర వివరాలను సిరాజ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.
మహ్మద్ సిరాజ్
Siraj Road Show: గురువారం ముంబై వాంఖడే స్టేడియంలో టీమిండియా క్రికెటర్లను ఘనంగా బీసీసీఐ సన్మానించింది. ఈ సన్మాన వేడుక కంటే ముందు ఎయిర్ పోర్ట్ నుంచి నారిమన్ పాయింట్ వరకు భారత టీమ్ ఓపెన్ టాప్ బస్‌లో విజయయాత్రను కొనసాగించింది. ఈ విజయయాత్ర మొత్తం అభిమానుల నినాదాలతో హోరెత్తిపోయింది. క్రికెటర్లపై అడుగడుగునా అభిమానులు పూల వర్షం కురిపించారు. గురువారం ఇండియాలో అడుగుపెట్టిన టీమిండియా క్రికెటర్లు ప్రధాని మోదీని కలిశారు. వరల్డ్ కప్ విజయం తాలూకు సంగతులను మోదీతో పంచుకున్నారు.
హైదరాబాద్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్...
విజయయాత్ర సీన్‌ను హైదరాబాద్‌లో రీక్రియేట్ చేసేందుకు క్రికెట్ అభిమానులు సిద్ధమవుతోన్నారు.వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టులో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా ఉన్నాడు. ముంబై సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న సిరాజ్ నేడు (శుక్రవారం) హైదరాబాద్ రానున్నాడు.
సిరాజ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్...
హైదరాబాద్‌లో సిరాజ్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తోన్నారు క్రికెట్ ఫ్యాన్స్. హైదరాబాద్‌లో ఓ విజయయాత్రను నిర్వహించబోతున్నారు. ఈ విజయయాత్రకు సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మహ్మద్ సిరాజ్ వెల్లడించాడు.
మెహదీపట్నంలోని సరోజిని దేవి ఐ హాస్పిటల్ నుంచి ప్రారంభం కానున్న ఈ విజయ యాత్ర ఈద్గా మైదానం వరకు సాగనున్నట్లు తెలిపాడు. సాయంత్రం ఐదున్నర గంటలకు ఈ విజయయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నాడు.
ముంబైలోని సక్సెస్ సెలబ్రేషన్స్‌ను హైదరాబాద్‌లో రీక్రియేట్ చేద్ధామంటూ క్రికెట్ ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చాడు. హైదరాబాద్‌లో కలుద్దామంటూ సిరాజ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక్క వికెట్ మాత్రమే...
టీ20 వరల్డ్ కప్‌లో సిరాజ్‌అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోయాడు. ఈ వరల్డ్ కప్‌లో కేవలం లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు సిరాజ్. ఒకే వికెట్ మాత్రమే తీశాడు. అది కూడా ఐర్లాండ్‌పై కావడం గమనార్హం.
బ్యాటింగ్‌లో పాకిస్థాన్ జరిగిన మ్యాచ్‌లో ఏడు పరుగులు చేశాడు. వికెట్లు తీయలేకపోవడంలో టీమ్ మేనేజ్‌మెంట్ అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను తీసుకున్నది. కుల్దీప్ రాణించడంలో సిరాజ్ బెంచ్‌కు పరిమితమవ్వాల్సివచ్చింది.
సిరాజ్‌కు విశ్రాంతి...
టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా జింబాబ్వే తో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు సిరాజ్ ఎంపికవ్వలేదు. సిరాజ్, కోహ్లి, రోహిత్‌తో పాటు టీ20 వరల్డ్ కప్ ఆడిన అందరికి బీసీసీఐ విశ్రాంతి నిచ్చింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో యంగ్ టీమ్‌ను జింబాబ్వే సిరీస్‌కు ఎంపికచేసింది.