తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Stats : సెంచరీ కొట్టిన ఐపీఎల్! 100వ శతకం శుభ్​మాన్​ గిల్​దే- స్టాట్స్​ చూసేయండి..

IPL 2024 Stats : సెంచరీ కొట్టిన ఐపీఎల్! 100వ శతకం శుభ్​మాన్​ గిల్​దే- స్టాట్స్​ చూసేయండి..

Sharath Chitturi HT Telugu

11 May 2024, 10:15 IST

google News
    • IPL 2024 Stats : ఐపీఎల్​ సెంచరీ కొట్టేసింది! అంటే.. శుభ్​మాన్​ గిల్​ చేసిన తాజా సెంచరీ.. ఐపీఎల్​లో 100వది! ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ చూసేయండి..
ఐపీఎల్​ స్టాట్స్​ని ఇక్కడ చూసేయండి..
ఐపీఎల్​ స్టాట్స్​ని ఇక్కడ చూసేయండి.. (PTI)

ఐపీఎల్​ స్టాట్స్​ని ఇక్కడ చూసేయండి..

IPL centuries stats : ఐపీఎల్​ 2024లో రికార్డుల మోత మోగుతోంది! రోజుకో రికార్డు బద్దలవ్వడం.. లేదా కొత్త రికార్డు సృష్టించడం జరుగుతోంది. ఇక శుక్రవారం జరిగిన సీఎస్కే వర్సెస్​ గుజరాత్​ టైటాన్స్​ మ్యాచ్​లో సరికొత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్​ సెంచరీ కొట్టేసింది! అంటే.. గుజరాత్​ టైటాన్స్​ సారథి శుభ్​మాన్​ గిల్​ చేసిన సెంచరీ.. ఐపీఎల్​లో 100వ శతకం. ఇలాంటి మరిన్ని ఆసక్తికర స్టాట్స్​ని ఇక్కడ తెలుసుకుందాము..

ఐపీఎల్​ 2024 స్టాట్స్​..

వాస్తవానికి గురువారం జరిగిన ఆర్సీబీ- పంజాబ్​ కింగ్స్​ మ్యాచ్​లోనే 100వ శతకం నమోదవుతుందని అందరు అనుకున్నారు. కానీ.. రన్​ మెషిన్​ విరాట్​ కోహ్ల.. 92 పరుగుల దగ్గర ఔట్​ అయ్యాడు. అయితే.. ఆ మరుసటిరోజే.. రెండు సెంచరీలు నమోదవ్వడంతో.. ఇప్పుడు ఐపీఎల్​లో శతకాల సంఖ్య 101కి చేరింది. సీఎస్కేతో జరిగిన మ్యాచ్​లో గిల్​తో పాటు ఓపెనింగ్​కి దిగిన సాయి సుదర్శన్​ కూడా సెంచరీ నమోదు చేశాడు.

101- ఐపీఎల్​లో నమోదైన సెంచరీలు. క్రికెట్​ ప్రపంచంలో 100వ సెంచరీని తాకిన రెండో లీగ్​.. ఐపీఎల్​. ఇంగ్లాండ్​ టీ20 కప్​లో 21 ఎడిషన్స్​లో 157 సెంచరీలు నమోదయ్యాయి.

93- ఇండియాలో జరిగిన 916 ఐపీఎల్​ మ్యాచ్​లలో నమోదైన సెంచరీలు. 6 సెంచరీలు యూఏఈలో, మరో రెండు సౌతాఫ్రికాలో నమోదయ్యాయి.

IPL 2024 stats : 8- విరాట్​ కోహ్లీ చేసిన శతకాలు. ఐపీఎల్​లో మరే ఇతర బ్యాటర్​ ఇన్ని సెంచరీలు చేయలేదు! అంతేకాదు.. 7 వేరువేరు ఫ్రాంఛేజీలపై శతకాలు చేశాడు కింగ్​ కోహ్లీ. ఇది కూడా ఒక రికార్డే.

30- 2013లో పూణె వారియర్స్​పై సెంచరీ చేసేందుకు ఆర్సీబీ మాజీ ప్లేయర్​ క్రిస్​ గేల్​ ఎదుర్కొన్న బాల్స్​. ఐపీఎల్​లో ఇప్పటికీ ఇదే ఫాస్టెస్ట్​ సెంచరీ. నాటి మ్యాచ్​లో 175 రన్స్​ చేశాడు గేల్​. ఇప్పటికీ ఇదే హయ్యెస్ట్​!

4- 2016లో విరాట్​ కోహ్లీ, 2022 ఐపీఎల్​లో జాస్​ బట్లర్​ కొట్టిన సెంచరీలు. సింగిల్​ ఎడిషన్​లో నమోదైన అత్యధిక సెంచరీలు వీరివే.

3- ముంబై ఇండియన్స్​పై కేఎల్​ రాహుల్​ చేసిన సెంచరీలు. ఒక జట్టుపై ఒక బ్యాటర్​ ఇన్న సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. 2019, 2022లో సెంచరీలు చేశాడు.

IPL 2024 records : 19- ఐపీఎల్​ మొత్తం మీద ఆర్సీబీ నుంచి నమోదైన సెంచరీలు. ఒక ఫ్రాంఛేజ్​ నుంచి ఇదే హయ్యెస్ట్​.

13- ఒక జట్టు నుంచి శతకాలు చేసిన బ్యాటర్లు. ఇది కూడా రికార్డే.

13- ఒక జట్టుపై నమోదైన సెంచరీలు. కేకేఆర్​, ముంబై ఇండియన్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​పై ఈ చెత్త రికార్డు ఉంది.

25- ఓడిపోయిన జట్టు నుంచి వచ్చిన సెంచరీల సంఖ్య. కోహ్లీ మూడు మ్యాచుల్లో కొట్టి సెంచరీలు జట్టుకు సాయం చేయలేదు. ఆర్సీబీ ఓడిపోయింది. ఇదే హైయ్యెస్ట్​.

76- గెలిచిన జట్ల నుంచి వచ్చిన సెంచరీల సంఖ్య. బట్లర్​ కొట్టిన 7 శతకాలతో జట్టు గెలిచింది. ఇదీ అత్యధికమే.

32- ఛేజింగ్​లో నమోదైన సెంచరీలు. ఇందులో మూడు జాస్​ బట్లర్​ పేరు మీద ఉన్నాయి. ఇదే అత్యధికం. మిగిలిన 69 మొదటి ఇన్నింగ్స్​లో నమోదైనవి. కోహ్లీ పేరిట అత్యధికంగా ఆరు శతకాలు ఉన్నాయి.

GT vs CSK IPL 2024 : 93- టాప్​ 3 నుంచి వచ్చిన శతకాల సంఖ్య. 76 సెంచరీలు ఓపెనర్ల నుంచే వచ్చాయి. మిగిలిన 17.. నెంబర్​ 3 బ్యాట్స్​మన్​ కొట్టాడు. నెంబర్​.4 బ్యాటర్​ నుంచి 5 సెంచరీలు నమోదయ్యాయి. నెం.5కి ఆ సంఖ్య 3గా ఉంది.

53- ఐపీఎల్​ చరిత్రలో సెంచరీలు సాధించిన ప్లేయర్ల సంఖ్య. వీరిలో 23 మంది కనీసం రెండు సెంచరీలు చేసిన వారున్నారు. ఇక 9మంది.. మూడు, అంతకన్నా ఎక్కువ శతకాలు బాదారు.

తదుపరి వ్యాసం