తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rcb Bowlers : ‘టీ20ల్లో 300 కొట్టేది.. ఆర్సీబీ బౌలర్సే’- సోషల్​ మీడియోలో పేలుతున్న మీమ్స్​!

RCB bowlers : ‘టీ20ల్లో 300 కొట్టేది.. ఆర్సీబీ బౌలర్సే’- సోషల్​ మీడియోలో పేలుతున్న మీమ్స్​!

Sharath Chitturi HT Telugu

17 April 2024, 9:32 IST

google News
    • RCB vs SRH 2024 : ఎస్​ఆర్​హెచ్​ చేత హయ్యేస్ట్​ స్కోర్​ కొట్టించిన ఆర్సీబీ బౌలర్స్​ను నెటిజన్లు దారుణంగా ట్రోల్​ చేస్తున్నారు. ఆర్సీబీని ఐపీఎల్​ నుంచే తీసేయాలని అంటున్నారు.
ఆర్సీబీ బౌలింగ్​ యూనిట్​పై విపరీతంగా ట్రోల్స్​..
ఆర్సీబీ బౌలింగ్​ యూనిట్​పై విపరీతంగా ట్రోల్స్​.. (PTI)

ఆర్సీబీ బౌలింగ్​ యూనిట్​పై విపరీతంగా ట్రోల్స్​..

RCB Bowlers 2024 : ఐపీఎల్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు (ఆర్సీబీ) బౌలర్ల ప్రదర్శన గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం. జట్టు బ్యాటర్లు ఎంత పెద్ద స్కోర్​ చేసినా.. వాటిని సులభంగా ప్రత్యర్థుల చేత కొట్టించే ఘనులు! ఇక సోమవారం.. సన్​రైజర్స్​ హైదరాబాద్​ (ఎస్​ఆర్​హెచ్​)తో జరిగిన మ్యాచ్​ తర్వాత.. మరో అప్రతిష్ఠ మూటగట్టుకున్నారు ఆర్సీబీ బౌలర్స్​. ఐపీఎల్​ చరిత్రలోనే అత్యధిక పరుగులు కొట్టించేశారు. ఇక ఇప్పుడు.. ఆర్సీబీ బౌలింగ్​ యూనిట్​పై ఆ ఫ్రాంఛైజ్​ ఫ్యాన్స్​తో పాటు క్రికెట్​ లవర్స్​ చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపాన్ని.. సోషల్​ మీడియాలో మీమ్స్​ రూపంలో బయటపెట్టి, ట్రోల్​ చేస్తున్నారు.

ఆర్సీబీ బౌలర్స్​పై ట్రోల్స్​..

చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం జరిగిన ఆర్సీబీ- ఎస్​ఆర్​హెచ్​ మ్యాచ్​లో పరుగుల సునామీ కనిపించింది. ఐపీఎల్​ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసింది ఎస్​ఆర్​హెచ్​. 20 ఓవర్లకు మూడు వికెట్లే కోల్పోయి 287 రన్స్​ కొట్టింది. రెండో ఇన్నింగ్స్​లో.. ఆర్సీబీ 7వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది.

RCB vs SRH IPL 2024 : ఎస్​ఆర్​హెచ్​ కూడా గట్టిగానే పరుగులు సమర్పించుకున్నా.. సోషల్​ మీడియాలో మాత్రం ఆర్సీబీ బౌలర్స్​పై విపరీతంగా ట్రోల్స్​ వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా.. ఆర్సీబీ బౌలర్ల్​ బౌలింగ్​ కార్డ్​ను పోస్ట్​ చేసి.. చాలా మంది "గ్రేట్​ బ్యాటింగ్​ బై ఆర్సీబీ బౌలర్స్​" అని సెటైర్లు వేస్తున్నారు.

"టీ20ల్లో 300 కన్నా ఎక్కువ పరుగులు కొట్టేది.. కేవలం ఆర్సీబీ బౌలర్సే" అని ఓ నెటిజన్​ ఫన్నీగా కామెంట్​ చేశాడు. "భారీ స్కోర్లు ఎలా కొట్టాలో.. ఆర్సీబీ బ్యాటర్లకు తెలుసు. ప్రత్యర్థుల చేత ఆ స్కోర్​ను ఎలా కొట్టించాలో ఆర్సీబీ బౌలర్లకు తెలుసు," అని మరో వ్యక్తి పోస్ట్​ చేశారు.

ఇదీ చూడండి:- RCB vs SRH: రికార్డుల హోరుతో సన్‍రైజర్స్ గ్రాండ్ విక్టరీ.. కార్తీక్ అద్భుత పోరాటం.. 549 పరుగులతో కొత్త చరిత్ర

"ఆర్సీబీ బౌలింగ్​ చూస్తే.. విరాట్​ కోహ్లీకి ఒకప్పుడు కోపం వచ్చేది. కానీ ఇప్పుడు.. బాధ పడుతున్నాడు. ఒకప్పుడు.. బౌలర్లపై విరుచుకుపడేవాడు. కానీ ఇప్పుడు.. బాధతో నిలబడిపోతున్నాడు. నిస్సహాయత స్థితిలో ఉండిపోతున్నాడు. రైట్​ మ్యాన్​ ఇని రాంగ్​ టీమ్​," అని మరో నెటిజన్​ కామెంట్​ చేశారు.

RCB IPL 2024 : "ఆర్సీబీ బౌలర్స్​, ఆర్సీబీ మేనేజ్​మెంట్​ని ఐపీఎల్​ నుంచి తీసిపడేయాలి. ఈ టీమ్​ పెద్ద జోక్​ అని కోహ్లీకి కూడా తెలుసు," అని ఓ నెటిజన్​ రాసుకొచ్చారు.

ఆర్సీబీ ప్లేఆఫ్​కు కష్టమే..!

IPL 2024 latest updates : తాజా ఓటమితో ఆర్సీబీ ప్లేఆఫ్​కు చేరడం మరింత కష్టంగా మారింది. 7 మ్యాచ్​లలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్​ మాత్రమే గెలిచి.. టేబుల్​ చివరి స్థానంలో ఉంది ఆర్సీబీ. ప్లేఆఫ్​కు చేరాలంటే.. ఇప్పటి నుంచి మిగిలిన అన్ని మ్యాచ్​లు గెలవాలి. అప్పటికీ.. డైరక్ట్​గా ప్లేఆఫ్​లో ఛాన్స్​ దక్కకపోవచ్చు. ఇతర జట్ల రన్​రేట్​పై భారీగా ఆధారపడాల్సి ఉంటుంది. మరి ఆర్సీబీ ఏం చేస్తుందో చూడాలి.

తదుపరి వ్యాసం