RCB playoffs scenario : ఈ ఐపీఎల్​​లో అస్సాం బండి మొదట ఎక్కేది ఆర్సీబీయేనా? లేక ఇంకా అవకాశం ఉందా?-ipl 2024 rcb playoffs scenario explained can kohlis team make it ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rcb Playoffs Scenario : ఈ ఐపీఎల్​​లో అస్సాం బండి మొదట ఎక్కేది ఆర్సీబీయేనా? లేక ఇంకా అవకాశం ఉందా?

RCB playoffs scenario : ఈ ఐపీఎల్​​లో అస్సాం బండి మొదట ఎక్కేది ఆర్సీబీయేనా? లేక ఇంకా అవకాశం ఉందా?

Sharath Chitturi HT Telugu
Apr 13, 2024 06:44 AM IST

RCB playoffs chances : ఆడిన 6 మ్యాచ్​లలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్​లో గెలిచిన ఆర్సీబీకి.. ప్లేఆఫ్​ అవకాశాలు ఇంకా ఉన్నాయా? లేక ఐపీఎల్​ 2024లో అస్సాం బండి ఎక్కే మొదటి జట్టు ఆర్సీబీయేనా?

ఐపీఎల్​ 2024లో ఆర్సీబీ ప్లేఆఫ్​ అవకాశాలు ఇవే..
ఐపీఎల్​ 2024లో ఆర్సీబీ ప్లేఆఫ్​ అవకాశాలు ఇవే.. (PTI)

RCB IPL 2024 : ఎప్పటిలాగానే ఈసారి కూడా.. ఐపీఎల్​ 2024లో ఆర్సీబీ (రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు) దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు 6 మ్యాచ్​లు ఆడిన విరాట్​ కోహ్లీ టీమ్​.. కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్​లో గెలిచి.. పాయింట్స్​ టేబుల్​లో చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఫలితంగా.. సీజన్​ మొదట్లో "ఈసాలా కప్​ నమ్దే.. ఈ సాలా కప్​ నమ్దే" అన్న ఫ్యాన్స్​.. ఇప్పుడు ఆర్సీబీ ప్లేఆఫ్​ పరిస్థితిపై ప్రెడిక్షన్​ టేబుల్స్​ వేసుకోవడంలో మునిగిపోయారు. ఇంతకి.. ఐపీఎల్​ 2024లో ఆర్సీబీ ప్లేఆఫ్​లకు చేరే అవకాశం ఇంకా ఉందా? లేక ఈ సీజన్​లో తొలుత అస్సాం బండి ఎక్కేది ఆ జట్టేనా?

yearly horoscope entry point

ఐపీఎల్​ 2024 ఆర్సీబీ ప్లేఆఫ్స్​కు​ చేరాలంటే..

ఇందాక చెప్పినట్టు.. ఈ సీజన్​లో ఆడిన 6 మ్యాచ్​లలో 1 మ్యాచ్​లో గెలిచి 2 పాయింట్లు సంపాదించుకుంది ఆర్సీబీ. ఇక ఇప్పుడు.. డుప్లెసిస్ సేన ప్ల్​ఆఫ్​కు చేరాలంటే.. తదుపరి ఎనిమిది మ్యాచ్​ల్లో ఏడింటిలో విజయం సాధించాలి!అప్పుడే 16 పాయింట్లతో టాప్-4లో నిలుస్తుంది. ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచిన బెంగళూరు మిగిలిన ఎనిమిది మ్యాచ్​ల్లో 7 విజయాలు సాధిస్తే.. 16 పాయింట్లతో టాప్-4లో నిలిచే అవకాశం ఉంది.

RCB playoffs scenario : వరుసగా 8 మ్యాచ్​లు గెలిస్తే మొత్తం 18 పాయింట్లతో సులువుగా ప్లేఆఫ్స్​కు చేరుకుంటుంది విరాట్​ కోహ్లీ టీమ్​. అయితే ఒక మ్యాచ్​లో ఓడినా 16 పాయింట్లతో ప్లేఆఫ్స్​కు చేరే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ రన్​ రేట్​ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతానికైతే ఆర్సీబీ నెట్​ రన్​రేట్​ కూడా దారుణంగానే ఉంది. ఆ టీమ్​ ఎన్​ఆర్​ఆర్​.. -1.124. ఐపీఎల్​ 2024లోని 10 టీమ్స్​లో ఈ జట్టుతే అత్యల్ప రన్​రేట్​.

కానీ.. ఐపీఎల్​ 2024లో మిగిలిన ఎనిమిది మ్యాచుల్లో రెండింటిలో ఓడిపోతే.. ఆర్సీబీ టీమ్​ ప్లేఆఫ్స్​కు చేరడం మరింత కష్టమవుతుంది! ఆ జట్టుకు 14 పాయింట్లు వచ్చినా.. మిగిలిన మ్యాచ్​ల ఫలితాలు ఆర్సీబీపై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితిలోనూ జట్టు నెట్ రన్ రేట్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

IPL 2024 points table : 2022, 2023లో 16 పాయింట్లు సంపాదించుకున్న జట్లు మాత్రమే ప్లేఆఫ్స్​కు చేరుకున్నాయి. 2022లో ఆర్సీబీ కూడా అంతే పాయింట్లు సాధించి టాప్​-4 టీమ్స్​లో చోటు దక్కించుకుంది. 2023లో ముంబై ఇండియన్స్​ కూడా 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ ఆడింది.

గురువారం ముంబై ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో ఓడిపోయిన ఆర్సీబీ.. సొంతగడ్డపై ఏప్రిల్​ 15న సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఎస్​ఆర్​హెచ్​తో తలపడనుంది.

ఫ్యాన్స్​కి సెల్యూట్​..!

Virat Kohli RCB : గత కొంతకాలంగా ఐపీఎల్​లో దారుణ ప్రదర్శన చేసి.. ఎలిమినేట్​ అవుతున్న జట్లపై సోషల్​ మీడియాలో విపరీతంగా మీమ్స్​ పేలుతున్నాయి. వాటిల్లో ఒకటి.. ఈ ‘అస్సాం బండి’. మరి ఈసారి ఆర్సీబీ పరిస్థితేంటో చూడాలి.

ఏదిఏమైనా.. ఆర్సీబీ అభిమానులకు మాత్రం సెల్యూట్​ చేయాల్సిందే! ఐపీఎల్​లో ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ కొట్టకపోయినా.. కోహ్లీ టీమ్​కి మద్దతిస్తూనే ఉంటున్నారు. లాయల్​ ఫ్యాన్​ బేస్​ ఉన్న టీమ్స్​లో ఆర్సీబీ ఒకటి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Whats_app_banner

సంబంధిత కథనం