SRH vs KKR : ‘డౌటే లేదు.. కేకేఆర్ ఫైనల్‌కి వెళుతుంది’- వసీమ్ అక్రమ్..
21 May 2024, 12:45 IST
- IPL 2024 Qualifier 1 : ఎస్ఆర్హెచ్ని ఓడించి.. కేకేఆర్ జట్టు ఐపీఎల్ ఫైనల్‌కి వెళుతుందని పాకిస్థాన్ మాజీ బౌలర్ వసీమ్ అక్రమ్ అభిప్రాయపడ్డాడు. ఇందుకు బలమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నాడు.
ఐపీఎల్ 2024 క్వాలిఫయర్స్ 1లో.. కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్..
SRH vs KKR IPL 2024 Qualifier 1 : ఐపీఎల్ 2024 క్వాలిఫయర్స్ 1కి సమయం ఆసన్నమైంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా.. ఇంకొన్ని గంటల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. భీకరమైన ఫామ్‌తో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది కేకేఆర్. అటు ఎస్ఆర్హెచ్ జట్టు బాదుడు చూస్తుంటే.. ప్రత్యర్థి జట్టు బెంబేలెత్తిపోతోంది. మరి ఈ రెండు జట్లలో ఎవరు గెలుస్తారు? అనేది ఉత్కంఠగా మారింది. కానీ.. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీమ్ అక్రమ్ మాత్రం.. కేకేఆర్ గెలుస్తుందని తేల్చేశాడు! ఇందుకు కారణాలను కూడా చెప్పాడు.
ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్- ఐపీఎల్ 2024 క్వాలిఫయర్స్ 1..
ఐపీఎల్ 2024 క్వాలిఫయర్స్ 1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధిస్తుందని, అందుకు కారణం శ్రేయస్ సేన బౌలింగ్ యూనిట్ అని వసీమ్ అక్రమ్ అంటున్నాడు. కేకేఆర్ బౌలింగ్ యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.
SRH vs KKR qualifier 1 : "కేకేఆర్‌లో కన్సిస్టెంట్గా వికెట్లు తీసే బౌలర్లు ఉన్నారు. ఎంఐ, ఎల్ఎస్జీ మ్యాచుల్లో మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఐపీఎల్ 2024 టాప్ 15 బౌలర్లలో కేకేఆర్ నుంచే నలుగురు ఉన్నారు. ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్లో కేకేఆర్ టాప్‌లో ఉండటానికి కారణం ఆ జట్టు బౌలింగ్ యూనిట్. వికెట్లు తీసే జట్లు.. మ్యాచ్‌లు గెలుస్తాయి. స్టార్క్ కూడా ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించాడు. నమ్మకం, ధైర్యం, ప్రశాంతంగా.. కేకేఆర్ జట్టు ఫైనల్స్‌కు వెళుతుంది," అని అక్రమ్ అన్నాడు.
కేకేఆర్‌కు వసీమ్ అక్రమ్ గతంలో బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు.
కేకేఆర్ బౌలింగ్ యూనిట్‌పై అక్రమ చెప్పిన మాటలు నిజమే! ఈ సీజన్లో.. వరుణ్ చక్రవర్తి 18 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా 16, ఆండ్రూ రస్సెల్ 15, సునీల్ నరైన్ 15, మిచెల్ స్టార్క్ 12 వికెట్లు తీశారు.
SRH vs KKR 2024 : కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో దాదాపు ప్రతి ఒక్కరు ఫామ్‌లో ఉన్నారని, కాకపోతే.. ఫిల్ సాల్ట్ లేకపోవడం టీమ్‌కి నష్టం కలిగించే విషయం అని వసీమ్ అక్రమ్ అభిప్రాయపడ్డాడు.
"దాదాపు అందరు మంచి ప్రదర్శన చేశారు. ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన మనీశ్ పాండే కూడా బాగా ఆడాడు. అందరు సంతోషంగా, నమ్మకంగా ఉన్నట్టు అర్థమవుతోంది. వాళ్లు అగ్రెసివ్‌గా కూడా ఉన్నారు. అది కంట్రోల్డ్ అగ్రెషన్. కానీ ఫిల్ సాల్ట్ లేకపోవడం మైనస్ అవుతుంది," అని పాక్ మాజీ బౌలర్ చెప్పుకొచ్చాడు.
ఈ ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైటర్ రైడర్స్‌కు సెకెండ్ హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచాడు ఫిల్ సాల్ట్. 12 ఇన్నింగ్స్‌లలో 435 రన్స్ చేశాడు. 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 182. కానీ.. టీ20 వరల్డ్ కప్ ప్రిపరేషన్ కోసం అతను ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు.
SRH vs KKR head to head : ఐపీఎల్ 2024 క్వాలిఫయర్స్ 1లో.. ఫిల్ సాల్ట్ స్థానాన్ని రహ్మతుల్లా గుర్బజ్ భర్తీ చేసే అవకాశం ఉంది.
క్వాలిఫయర్స్ 1లో రెండు జట్లపై పెద్దగా స్ట్రెస్ ఉండదు. కానీ.. ఈ మ్యచ్ గెలిచిన జట్టు.. డైరక్ట్‌గా ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెడుతుంది. మరో జట్టు.. (ఎలిమినేటర్‌లో గెలిచిన టీమ్‌తో) క్వాలిఫయర్స్ 2 ఆడుతుంది. ఎలాగైనా డైరక్ట్‌గా ఫైనల్‌కి వెళ్లిపోవాలని కేకేఆర్, ఎస్ఆర్హెచ్లు కచ్చితంగా ప్రయత్నిస్తాయి. అందుకే.. ఐపీఎల్ లవర్స్.. పవర్ ప్యాక్డ్ యాక్షన్‌ని ఆశిస్తున్నారు.