IPL 2024: కోహ్లి వర్సెస్ రోహిత్ - ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ ఫైవ్‌లో నలుగురు ఇండియన్స్ - ఫస్ట్ ప్లేస్‌లో ఎవరంటే?
19 April 2024, 12:07 IST
IPL 2024: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లి టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్నాడు. పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 36 పరుగులు చేసిన రోహిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు.
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ
IPL 2024: ఐపీఎల్ 2024లో ఇండియన్ బ్యాట్స్‌మెన్స్ డామినేషన్ కొనసాగుతోంది. ఈ సీజన్‌లో సీనియర్లతో పాటు యంగ్ ప్లేయర్లు పోటీపడి పరుగుల వరద పారిస్తున్నారు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. చెన్నైపై సెంచరీ సాధించి అనూహ్యంగా ఆరెంజ్ క్యాప్ రేసులోకి వచ్చాడు ముంబై క్రికెటర్ రోహిత్ శర్మ. తాజాగా పంజాబ్‌పై 36 పరుగులు చేసిన రోహిత్ శర్మ సునీల్ నరైన్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకున్నాడు.
కోహ్లి టాప్...
ఈ సీజన్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి అదరగొడుతోన్నారు. ఐపీఎల్ 2024లో ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లి టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్నాడు. ఏడు మ్యాచుల్లో కోహ్లి 361 రన్స్ చేశాడు. 72. 20 యావరేజ్, 147 స్ట్రైక్ రేట్‌తో కోహ్లి దమ్మురేపుతోన్నాడు.ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌పై కోహ్లి సెంచరీ సాధించాడు. ఐపీఎల్‌లో అతడికి ఎనిమిదో సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా కోహ్లి రికార్డ్ నెలకొల్పాడు.
రియాన్ పరాగ్ సెకండ్ ప్లేస్...
కోహ్లి తర్వాత ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో రాజస్థాన్ రాయల్స్ యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్ సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోన్నాడు. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో వీరవిహారం చేస్తోన్న రియాన్ పరాగ్ ఏడు మ్యాచుల్లో 318 రన్స్ చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. రియాన్ పరాగ్ ఐపీఎల్ కెరీర్‌లో ఇదే బెస్ట్ సీజన్ కావడం గమనార్హం. గత సీజన్‌లో ఏడు మ్యాచుల్లో కేవలం 78 పరుగుల మాత్రమే చేసిన అతడు జట్టులో చోటు కోల్పోయాడు. గత సీజన్‌లో ఎ దురైన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సీజన్‌లో అదరగొడుతోన్నాడు.
రోహిత్ శర్మ మూడో స్థానం...
ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు. సునీల్ నరైన్ ప్లేస్‌ను అధిగమించాడు. ఈ సీజన్‌లో ఏడు మ్యాచుల్లో రోహిత్ శర్మ ఓ సెంచరీతో 297 రన్స్ చేశాడు. సునీల్ నరైన్ 276 పరుగులతో నాలుగో స్థానంలో కొనసాగుతోండగా...సంజు శాంసన్ 276 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ 263 రన్స్‌తో ఆరో స్థానంలో ఉన్నాడు.
టాప్ ఫైవ్‌లో నలుగురు ఇండియన్స్..
ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ ఫైవ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్స్‌లో సునీల్ నరైన్ మినహా మిగిలిన వారందరూ ఇండియన్ క్రికెటర్స్ కావడం గమనార్హం.
పాయింట్స్ టేబుల్‌లో వెనుకంజ...
కోహ్లి, రోహిత్ చెలరేగుతోన్న వారి టీమ్‌లు మాత్రం ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో వెనుకబడ్డాయి. ఏడు మ్యాచుల్లో మూడు విజయాలు, నాలుగు ఓటములతో ముంబై ఇండియన్స్ ఏడో స్థానంలో నిలచింది. ఈ సీజన్‌లో వరుస ఓటములతో బెంగళూరు పరిస్థితి దారుణంగా మారింది. ఏడు మ్యాచుల్లో ఒకే ఒక విజయంతో పాయింట్స్ టేబుల్‌లో చివరి ప్లేస్‌లో బెంగళూరు ఉంది. కోహ్లి, కార్తీక్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ రాణించలేకపోతున్నారు. బెంగళూరు బౌలర్లు పూర్తిగా తేలిపోతున్నారు. భారీ స్కోర్లను కూడా కాపాడలేకపోతున్నారు.