IND vs BAN Asia Cup: టీమ్ ఇండియా టార్గెట్ 266 రన్స్ - తడబడి నిలబడిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్స్
IND vs BAN Asia Cup: ఆసియా కప్ సూపర్ ఫోర్‌లో నామమాత్రమైన మ్యాచ్‌లో టీమ్ ఇండియా ముందు బంగ్లాదేశ్ 266 పరుగుల టార్గెట్‌ను విధించింది. 59 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను 80 రన్స్‌తో షకీబ్ అల్ హసన్ ఆదుకున్నాడు
IND vs BAN Asia Cup: ఆసియా కప్ సూపర్ 4 రౌండ్‌లో భాగంగా టీమ్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తడబడి నిలబడింది. టీమ్ ఇండియా ముందు 266 పరుగుల లక్ష్యాన్ని విధించింది.
59 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్‌తో పాటు తౌహిద్, నసూమ్ అహ్మద్ బ్యాటింగ్ మెరుపులతో యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 265 పరుగులు చేసింది.85 బాల్స్‌లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో షకీబ్ 80 రన్స్ చేశాడు.
ఐదో వికెట్‌కు షకీబ్, తౌహిద్ కలిసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ప్రమాదకరంగా మారిన షకీబ్‌ను ఔట్ చేసి టీమ్ ఇండియాకు శార్దూల్ బ్రేక్ ఇచ్చాడు. తౌహిద్ (54 రన్స్)తో పాటు చివరలోనసూమ్ అహ్మద్ (44 పరుగులు), మెహదీ హసన్ బ్యాట్ ఝులిపించడంతో బంగ్లాదేశ్ 265 పరుగులు చేసింది.
మెహదీ హసన్ 29 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. టీమ్ ఇండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా షమీ రెండు, ప్రసిద్ధ్ కృష్ణ, జడేజా, అక్షర్ పటేల్‌లకు తలో ఒక్క వికెట్ దక్కింది.