తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Opening Ceremony: అదిరిపోయిన ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ.. చిదంబరం స్టేడియంలో బాలీవుడ్ ఫైర్‌వర్క్స్

IPL 2024 Opening Ceremony: అదిరిపోయిన ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ.. చిదంబరం స్టేడియంలో బాలీవుడ్ ఫైర్‌వర్క్స్

Hari Prasad S HT Telugu

22 March 2024, 19:17 IST

google News
    • IPL 2024 Opening Ceremony: ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ అదిరిపోయింది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ సెర్మనీ మొత్తం బాలీవుడ్ ఫైర్‌వర్క్స్ తో నిండిపోయింది.
అదిరిపోయిన ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ.. చిదంబరం స్టేడియంలో బాలీవుడ్ ఫైర్‌వర్క్స్
అదిరిపోయిన ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ.. చిదంబరం స్టేడియంలో బాలీవుడ్ ఫైర్‌వర్క్స్

అదిరిపోయిన ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ.. చిదంబరం స్టేడియంలో బాలీవుడ్ ఫైర్‌వర్క్స్

IPL 2024 Opening Ceremony: ఐపీఎల్ 2024 ఘనంగా మొదలైంది. ఈ మెగా లీగ్ 17వ సీజన్ ఓపెనింగ్ సెర్మనీని చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ కు ముందు ఈ ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించారు. ఇందులో బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, ఏఆర్ రెహమాన్, సోను నిగమ్ లాంటి వాళ్లు పర్ఫామ్ చేశారు.

ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ

ఐపీఎల్ 17వ సీజన్ మొదలైంది. శుక్రవారం (మార్చి 22) సాయంత్రం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ సెర్మనీ నిర్వహించారు. మొదట బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ పర్ఫార్మెన్స్ తో ఈ సెర్మనీ మొదలైంది. ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని అక్షయ్ తనదైన స్టైల్లో గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత టైగర్ ష్రాఫ్ తో కలిసి కొన్ని బాలీవుడ్ సాంగ్స్ కు కొన్ని స్టెప్స్ వేశాడు.

ఈ ఇద్దరూ కలిసి నటించిన బడే మియా చోటే మియా మూవీ త్వరలోనే రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. దీంతో ఓపెనింగ్ సెర్మనీలో పర్ఫామ్ చేసి తమ మూవీ ప్రమోషన్లు కూడా వీళ్లు నిర్వహించారు. ఇక వీళ్లిద్దరి తర్వాత మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్, సోను నిగమ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరూ కొన్ని సూపర్ హిట్ బాలీవుడ్ సాంగ్స్ తోపాటు చెన్నై ప్రేక్షకుల కోసం కొన్ని తమిళ పాటలు కూడా పాడారు.

ఈ సందర్భంగా ఫీల్డ్ లో ఓ భారీ ఐపీఎల్ ట్రోఫీ నమూనా కూడా ఏర్పాటు చేశారు. ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఫీల్డ్ మధ్యలో చేసిన లేజర్ షో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో దేశ గొప్పతనాన్ని సూచించే ప్రదర్శనలతోపాటు ఐపీఎల్ 2024లో పాల్గొనే టీమ్స్, వాటి కెప్టెన్ల ఫొటోలను కూడా ప్రదర్శించారు. రెహమాన్ తన సూపర్ హిట్ సాంగ్ వందేమాతరంతో మొదలుపెట్టి.. తన ఆస్కార్ విన్నింగ్ సాంగ్ జయహోతో ముగించాడు. అతడు పర్ఫామ్ చేస్తున్నంతసేపూ స్టేడియం మార్మోగిపోయింది. చివరగా కళ్లు చెదిరే ఫైర్ వర్క్స్ తో ఓపెనింగ్ సెర్మనీ ముగిసింది.

సీఎస్కే వెర్సెస్ ఆర్సీబీ

ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ ప్రారంభానికి ఒక రోజు ముందు చెన్నై కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ చేపట్టాడు. అతని కెప్టెన్సీలో ఆర్సీబీతో తొలి మ్యాచ్ సీఎస్కే ఆడుతోంది.

మరోవైపు తమకు అసలు కలిసిరాని చిదంబరం స్టేడియంలో ఆర్సీబీ ఈ సీజన్ తొలి మ్యాచ్ ఆడుతోంది. ఇక్కడ ఆ టీమ్ కేవలం ఒక్క మ్యాచ్ గెలిచి, ఏడింట్లో ఓడిపోయింది. కోహ్లి, ధోనీ మధ్య జరిగే అదిరిపోయే యుద్ధం కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

తదుపరి వ్యాసం