Virat Kohli: ఐపీఎల్‌లో సీఎస్‌కేపై కోహ్లి రికార్డులు ఇవే - అరుదైన ఘనతకు ఆరు పరుగులు దూరంలో విరాట్
Virat Kohli: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు దూరమైన కోహ్లి సీఎస్‌కేతో శుక్రవారం (నేడు) జరుగనున్న ఐపీఎల్ ఆరంభపోరుతో క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి పలు రికార్డులపై కన్నేశాడు. ఆ రికార్డులు ఏవంటే?
Virat Kohli: ఐపీఎల్ 2024 క్రికెట్ సమరం నేటి నుంచి మొదలుకానుంది. ఆరంభ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడనుంది. తొలి పోరులో కోహ్లి ఎలా ఆడుతాడన్నది క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కొడుకు పుట్టడంతో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు కోహ్లి. దాంతో అతడి బ్యాటింగ్ మెరుపులను అభిమానులు మిస్సయ్యారు. ఐపీఎల్ ఆరంభ పోరుతోనే కోహ్లి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లిపైనే అభిమానుల కళ్లు ఉన్నాయి. కోహ్లి బ్యాట్ ఝులిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
చెపాక్‌లో కోహ్లి రికార్డులు ఇవే...
చెపాక్ స్టేడియంలో కోహ్లి రికార్డులు ఏమంత గొప్పగా లేవు. ఇప్పటివరకు చెపాక్ స్టేడియంలో 12 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 30.16 యావరేజ్‌తో 362 రన్స్ చేశాడు. ఈ స్టేడియంలో అతడి హయ్యెస్ట్ స్కోరు 58 పరుగులు మాత్రమే. 2013 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే ఈ హాఫ్ సెంచరీ సాధించాడు కోహ్లి. చెపాక్ స్టేడియంలో ఇప్పటివరకు కేవలం రెండు మాత్రమే హాఫ్ సెంచరీలు చేశాడు కోహ్లి. ఐపీఎల్‌లో కోహ్లికి చెపాక్ అంతగా అచ్చిరాలేదు. ఆ ముద్రను కోహ్లి దూరం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మరో ఆరు పరుగుల దూరంలో...
టీ20 ఫార్మెట్‌లో ఓ అరుదైన రికార్డుకు కోహ్లి మరో ఆరు పరుగుల దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ కలిపి టీ20ల్లో ఇప్పటివరకు కోహ్లి 11994 పరుగులు చేశాడు. మరో ఆరు పరుగులు చేస్తే 12000 క్లబ్‌లో కోహ్లి చేరుతాడు. పొట్టి ఫార్మెట్‌లో ఈ ఘనతను సాధించిన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్‌గా కోహ్లి నిలుస్తాడు. సీఎస్‌కే మ్యాచ్ ద్వారా కోహ్లి ఈ రికార్డును బ్రేక్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
కోహ్లి ఐదో స్థానంలో...
టీ20 ఫార్మెట్‌లో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్ల జాబితాలో 14562 పరుగులతో గేల్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్‌లో షోయబ్ మాలిక్ (13360 రన్స్), పొల్లార్డ్ (12900) మూడో స్థానంలో కొనసాగుతోన్నారు. ఈ జాబితాలో కోహ్లి ఆరో స్థానంలో ఉన్నాడు. మరో 71 పరుగులు చేస్తే వార్నర్‌ను అధిగమించి టాఫ్ ఫైవ్‌లోకి కోహ్లి ఎంట్రీ ఇస్తాడు.
ధావన్ తర్వాత...
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కోహ్లి ఇప్పటివరకు 985 రన్స్ చేశాడు. ఈ లీగ్‌లో చెన్నై టీమ్‌పై అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. 1057 పరుగులతో శిఖర్ ధావన్ టాప్‌ప్లేస్‌లో కొనసాగుతోన్నాడు. మరో 73 పరుగులు చేస్తే ధావన్ రికార్డును అధిగమించి సీఎస్‌కేపై ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా కోహ్లి నిలుస్తాడు.