AR Rahman Prabhu Deva: 25 ఏళ్ల తర్వాత మళ్లీ చేతులు కలిపిన రెహమాన్, ప్రభుదేవా.. కొత్త మూవీ అనౌన్స్‌మెంట్-ar rahman prabhu deva reunites after 25 years new tamil movie arrpd6 announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ar Rahman Prabhu Deva Reunites After 25 Years New Tamil Movie Arrpd6 Announced

AR Rahman Prabhu Deva: 25 ఏళ్ల తర్వాత మళ్లీ చేతులు కలిపిన రెహమాన్, ప్రభుదేవా.. కొత్త మూవీ అనౌన్స్‌మెంట్

Hari Prasad S HT Telugu
Mar 22, 2024 05:52 PM IST

AR Rahman Prabhu Deva: ఇండియన్ మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్, ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరుగాంచిన ప్రభుదేవా 25 ఏళ్ల తర్వాత మళ్లీ చేతులు కలిపారు. వీళ్ల కాంబినేషన్ లో ఓ కొత్త మూవీ రాబోతోంది.

25 ఏళ్ల తర్వాత మళ్లీ చేతులు కలిపిన రెహమాన్, ప్రభుదేవా.. కొత్త మూవీ అనౌన్స్‌మెంట్
25 ఏళ్ల తర్వాత మళ్లీ చేతులు కలిపిన రెహమాన్, ప్రభుదేవా.. కొత్త మూవీ అనౌన్స్‌మెంట్

AR Rahman Prabhu Deva: 25 ఏళ్ల తర్వాత మరోసారి ఓ సూపర్ కాంబినేషన్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, టాప్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కలిసి సినిమా చేయబోతున్నారు. వీళ్ల కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ చేసిందో 1990ల్లో వచ్చిన సినిమాలు చూస్తే తెలుస్తుంది.

రెహమాన్, ప్రభుదేవా మళ్లీ..

రెహమాన్, ప్రభుదేవా చివరిసారి 25 ఏళ్ల కిందట ఓ సినిమా చేశారు. అప్పట్లో వచ్చిన మెరుపు కలలు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇక ఇప్పుడు ఏఆర్ఆర్‌పీడీ6 పేరుతో ఓ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ మనోజ్ ఎంఎస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో యోగి బాబు, వర్గీస్, అర్జున్ అశోకన్, డాక్టర్ సంతోష్ జాకబ్, సుష్మితా నాయక్, మొట్టా రాజేంద్రన్ లాంటి వాళ్లు నటిస్తున్నారు.

ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను శుక్రవారం (మార్చి 22) లాంచ్ చేశారు. ఇందులో ఆల్ టైమ్ హిట్ సాంగ్ ముక్కాలా ముకాబులా సాంగ్ లో ప్రభుదేవా స్టెప్ కు సంబంధించిన ఫొటోతోపాటు బ్యాక్‌గ్రౌండ్ లో రెహమాన్ పాడుతున్న పిక్చర్ ను కూడా ఉంచారు. ఈ కొత్త సినిమాను బిహైండ్‌వుడ్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. సినిమాటోగ్రాఫర్ అనూప్ శైలజ, ఎడిటర్ రేమాండ్ డెరిక్ ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు.

ఈ ఇద్దరి కాంబినేషన్లో ఐదు సినిమాలు

ఏఆర్ రెహమాన్, ప్రభుదేవా కాంబినేషన్ లో 1990ల్లో ఐదు సినిమాలు వచ్చాయి. అవన్నీ సూపర్ డూపర్ హిట్టే. తొలిసారి 1993లో జెంటిల్మేన్ మూవీ చేశారు. అందులోని చికు బుకు చికు బుకు రైలే సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత ప్రేమికుడు మూవీ చేశారు. ఇందులో ప్రభుదేవానే పూర్తిస్థాయి హీరోగా ఉన్నాడు.

అందులోని ఊర్వశి, ఓ చెలియా సాంగ్స్ ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఆ తర్వాత లవ్ బర్డ్స్, మిస్టర్ రోమియో, మెరుపు కలలులాంటి సినిమాలు చేశారు. ఈ మూవీస్ లోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మెరుపు కలలులోని వెన్నెలవే పాట, అందులో ప్రభుదేవా స్టెప్స్ ఇప్పటికీ అభిమానుల మదిలో మెదులుతూనే ఉన్నాయి.

ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ ఆరో ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. అందుకే ఈ మూవీకి ప్రస్తుతానికి ఏఆర్ఆర్‌పీడీ6 (ARRPD6) అంటూ ఏఆర్ రెహమాన్ ప్రభుదేవా పేర్లు వచ్చేలా ఓ టైటిల్ పెట్టారు. రెండున్నర దశాబ్దాల తర్వాత ఈ కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ చూస్తుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ప్రస్తుతం ప్రభుదేవా దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ కోసం పని చేస్తున్నాడు.

ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా ప్రభుదేవాకు పేరుంది. తాను సినిమాల్లో వేసిన స్టెప్స్ తోపాటు ఎన్నో సినిమాాలకు అతడు చేసిన కొరియోగ్రఫీ మూడు దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. తమిళ, తెలుగు ప్రేక్షకులకే కాదు.. బాలీవుడ్ లోనూ ప్రభుదేవా పేరు మార్మోగిపోయింది.

IPL_Entry_Point