Thalapathy Vijay The GOAT: దళపతి విజయ్ మూవీలో దివంగత విజయ్‌కాంత్.. ఏఐతో సాధ్యం చేస్తున్న మేకర్స్-thalapathy vijay the goat movie vijaykanth to act with the help of ai ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thalapathy Vijay The Goat: దళపతి విజయ్ మూవీలో దివంగత విజయ్‌కాంత్.. ఏఐతో సాధ్యం చేస్తున్న మేకర్స్

Thalapathy Vijay The GOAT: దళపతి విజయ్ మూవీలో దివంగత విజయ్‌కాంత్.. ఏఐతో సాధ్యం చేస్తున్న మేకర్స్

Hari Prasad S HT Telugu
Feb 13, 2024 08:40 AM IST

Thalapathy Vijay The GOAT: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The GOAT) మూవీలో దివంగత విజయ్‌కాంత్ కనిపించబోతున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో మేకర్స్ దీనిని సాధ్యం చేయబోతున్నారు.

దళపతి విజయ్ ది గోట్ మూవీలో ఏఐ సాయంతో విజయ్ కాంత్ అతిథి పాత్ర
దళపతి విజయ్ ది గోట్ మూవీలో ఏఐ సాయంతో విజయ్ కాంత్ అతిథి పాత్ర

Thalapathy Vijay The GOAT: ఈ మధ్యే కన్నుమూసిన తమిళ స్టార్ హీరో, ప్రముఖ రాజకీయ నాయకుడు విజయ్‌కాంత్ కు వినూత్నం పద్ధతిలో నివాళి అర్పించబోతున్నాడు దళపతి విజయ్. తన నెక్ట్స్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The GOAT) మూవీలో కెప్టెన్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో నటింపజేసి వినూత్నంగా నివాళి అర్పించనున్నారు.

ఏఐతో విజయ్‌కాంత్

గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీలో విజయ్ కాంత్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని, దీనికోసం ఏఐ టెక్నాలజీని మేకర్స్ వాడనున్నట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ క్రియేటైంది. నాగ చైతన్యతో కస్టడీ మూవీ చేసిన వెంకట్ ప్రభు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్‌కాంత్ ను ఇలా అతిథిపాత్రలో చూపించాలని అనుకుంటున్నట్లు అతని కుటుంబంతో చెప్పగా వాళ్లు కూడా అందుకు అనుమతించినట్లు సమాచారం.

దళపతి విజయ్ ఈ మూవీలో డ్యుయల్ రోల్లో కనిపిస్తున్నాడు. విజయ్ యంగ్‌గా కనిపించే సీన్లలో విజయ్‌కాంత్ ఏఐ పాత్ర ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ ని 18 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిగా చూపించడానికి మూవీ టీమ్ డీఏజింగ్ టెక్నాలజీని వాడుతోంది. ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ కోసమే భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

విజయ్‌కాంత్ కు తమిళనాడు వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కెప్టెన్ అని ముద్దుగా పిలుచుకునే ఫ్యాన్స్ ను ఇప్పుడతని ఏఐ రూపం అలరించనుంది. విజయ్‌కాంత్ కన్నుమూసిన సమయంలోనూ అతని అంత్యక్రియలకు విజయ్ వెళ్లాడు. తన అభిమాన నటుడిని అలా చూసి కంటతడి పెట్టాడు. ఇప్పుడిలా తన నెక్ట్స్ మూవీలో అతని రూపాన్ని ఆవిష్కరించి నివాళులర్పించాలని నిర్ణయించుకున్నాడు.

టైటిల్‍తో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’కు సూపర్ క్రేజ్ వచ్చింది. ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకుంది. ఈ మూవీలో డ్యుయల్ రోల్ చేస్తున్నారు విజయ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ సాగుతోంది. ఈ తరుణంలో ఈ చిత్రం ఓటీటీ హక్కుల ఒప్పందం జరిగినట్టు సమాచారం బయటికి వచ్చింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు సమాచారం.

అప్పుడు లాల్ సలామ్.. ఇప్పుడు ది గోట్

విజయ్ 18 ఏళ్ల వయసులో కనిపించే పాత్ర 1990లనాటిదిగా మూవీలో చూపించనున్నారు. ఆ సమయంలోనే విజయ్‌కాంత్ పాత్రను చూపించబోతున్నట్లు సమాచారం. ఈ బజ్ అభిమానులను ఎంతో ఆనందానికి గురి చేస్తోంది. నిజంగా ఇది గొప్ప నివాళి అవుతుందని వాళ్లు అంటున్నారు. కోhariలీవుడ్ లో ఏఐ టెక్నాలజీ వాడకం ఈ మధ్యకాలంలోనే ఇది రెండోసారి.

ఈ మధ్యే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా లాల్ సలామ్ సినిమా కోసం ఇద్దరు దివంగత సింగర్లతో పాడించిన విషయం తెలిసిందే. బంబా బాక్యా, హమీద్ ల గళాలను రెహమాన్ ఏఐ సాయంతో రీక్రియేట్ చేశాడు. దీనికోసం వాళ్ల కుటుంబాల అనుమతి తీసుకొని, వాళ్లకు తగిన రెమ్యునరేషన్ కూడా ఇచ్చినట్లు చెప్పాడు.

ఇక ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీలో విజయ్ కాంత్ ఇలా ఏఐ రూపంలో కనిపించబోతున్నాడు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. విజయ్ తోపాటు ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, జయరాం, యోగిబాబులాంటి సీనియర్ నటీనటులు ఈ మూవీలో నటిస్తున్నారు.