తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 : సిక్స్​ల మోత.. రికార్డు రన్​ రేట్​.. కానీ సెంచరీ నిల్​!

IPL 2024 : సిక్స్​ల మోత.. రికార్డు రన్​ రేట్​.. కానీ సెంచరీ నిల్​!

Sharath Chitturi HT Telugu

06 April 2024, 7:12 IST

google News
    • IPL 2024 Early Trends : ఐపీఎల్​ 2024లో రికార్డు స్థాయి రన్​- రేట్లు నమోదవుతున్నాయి. బ్యాటర్లు సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా నమోదవ్వలేదు!
ఐపీఎల్​ 2024లో పరుగుల వరద..
ఐపీఎల్​ 2024లో పరుగుల వరద.. (PTI)

ఐపీఎల్​ 2024లో పరుగుల వరద..

IPL 2024 analysis : ఐపీఎల్​ 2024 దుమ్మురేపుతోంది! ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 17వ ఎడిషన్​లో పరుగల వరద కనిపిస్తోంది. ఇదే కొనసాగితే.. ఐపీఎల్​ చరిత్రలోనే ది బెస్ట్​ రన్​ రేట్​ కలిగిన సీజన్​గా 17వ ఎడిషన్​ నిలుస్తుంది! ఇదంతా.. ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా నమోదవ్వకుండా జరగడం విశేషం.

రన్​ రేట్​ సూపరో.. సూపరు..

ఐపీఎల్​ 2024 మొదటి 17 మ్యాచ్​లను ఎనాలసిస్​ చేస్తే.. రికార్డు స్థాయి రన్​ రెట్​ నమోదైంది. ఈ సీజన్​లోని మొదటి 17 మ్యాచ్​లలో యావరేజ్​ రన్​ రేట్​ 8.84గా ఉంది. బ్యాటర్ల బాదుడు ఈ విధంగానే కొనసాగితే.. హయ్యెస్ట్​ రన్​ రేట్​ నమోదైన సీజన్​గా ఐపీఎల్​ 2024 నిలుస్తుంది. 2023 సీజన్​లో రనర్​ రేట్​ 8.5గా ఉంది. ఇప్పటివరకు ఇదే అత్యధికం.

ఇక గత ఐదు ఐపీఎల్​ ఎడిషన్స్​ని పరిశీలిస్తే.. 2019లో 8.02గా ఉన్న రన్​ రేట్​.. 2020లో 7.9కి పడింది. 2021లో అయితే మరింత కిందకు పడి 7.62గా నమోదైంది. కానీ ఆ సమయంలో కొవిడ్​ సంక్షోభం ఉందని గుర్తుపెట్టుకోవాలి.

IPL 2024 stats in Telugu : ఇక 2022లో రన్​ రేట్​ మళ్లీ పుంజుకుని 8.04కి చేరింది. 2023లో అది 8.5గా నమోదైంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఐపీఎల్​ 2023లో జరిగిన మొదటి 17 మ్యాచ్​లలో రన్​ రేట్​ 8.95శాతంగా ఉండేది. అంటే ప్రస్తుత సీజన్​ కన్నా ఎక్కువే!

ఇదీ చూడండి:- SRH vs CSK Live: ఉప్పల్లో మరో గెలుపు.. చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తుగా ఓడించిన సన్ రైజర్స్ హైదరాబాద్

సిక్స్​ల మోత.. కానీ సెంచరీ నిల్​!

ఐపీఎల్​ 2024లో ఇప్పటివరకు 312 సిక్స్​లు బాదారు. ఏ సీజన్​లోనైనా (మొదటి 17 మ్యాచ్​లు) ఇదే అత్యధికం. ఐపీఎల్​ 2023లో అది 259గా ఉండేది.

ఇక ఐపీల్​ చరిత్రలోనే అత్యధిక టోటల్స్​ కూడా ఈ సీజన్​లోనే నమొదయ్యాయి. ఎస్​ఆర్​హెచ్​ ఏకంగా 277 కొట్టి అందరిని ఆశ్చర్యపరిస్తే.. వారం తిరగకుండానే కేకేఆర్​ 272 బాదింది.

IPL score : ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఐపీఎల్​ 2024లో పరుగల ప్రవాహం కనిపిస్తున్నప్పటికీ.. ఇంకా ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు! వాస్తవానికి ఇది 2023 సీజన్​లో కూడా కనిపించింది. ఐపీఎల్​ 2023 19వ మ్యాచ్​లో తొలి సెంచరీ నమోదైంది. కేకేఆర్​పై ఎస్​ఆర్​హెచ్​ బ్యాటర్​ హారీ బ్రూక్​ సెంచరీ కొట్టాడు.

వాస్తవానికి బ్యాటర్లు సెంచరీల కన్నా స్ట్రైక్​ రేట్​పై ఎక్కువ ఫోకస్​ చేస్తున్నారు. టీ20 ఫార్మాట్​కు కట్టుబడి.. వచ్చామా, బాదామా, వెళ్లామా అన్నట్టు ఉంటున్నారు. అందుకే.. సెంచరీలు లేకపోయినా, అత్యధిక పరుగులు రాబడుతున్నారు.

మరి ఐపీఎల్​ మిగిలిన మ్యాచ్​లలో కూడా ఇదే కొనసాగితే.. 17వ ఎడిషన్​లో చాలా రికార్డులు బ్రేక అవ్వడం ఖాయం!

తదుపరి వ్యాసం