IPL 2024 Stars: ఒక్క మ్యాచ్‌తో ఐపీఎల్ 2024లో స్టార్లుగా మారిపోయిన ప్లేయర్స్ వీళ్లే
- IPL 2024 Stars: ఐపీఎల్ 2024లో కొందరు యువ ప్లేయర్స్ ఒక్క మ్యాచ్ తోనే సూపర్ స్టార్లుగా ఎదిగిపోయారు. ఇప్పటి వరకూ కనీసం వీళ్ల పేర్లు కూడా తెలియకపోయినా.. తమ జట్లను ఒంటిచేత్తో గెలిపించి హీరోలయ్యారు.
- IPL 2024 Stars: ఐపీఎల్ 2024లో కొందరు యువ ప్లేయర్స్ ఒక్క మ్యాచ్ తోనే సూపర్ స్టార్లుగా ఎదిగిపోయారు. ఇప్పటి వరకూ కనీసం వీళ్ల పేర్లు కూడా తెలియకపోయినా.. తమ జట్లను ఒంటిచేత్తో గెలిపించి హీరోలయ్యారు.
(1 / 6)
IPL 2024 Stars: ఐపీఎల్ ఎంతోమంది యువ ప్లేయర్స్ కు లైఫ్ ఇచ్చింది. తాజాగా జరుగుతున్న 17వ సీజన్ కూడా అలాంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసింది. ఇంత వరకూ అనామకులుగా ఉన్న కొందరు ప్లేయర్స్ ఈ లీగ్ లో ఒక్క మ్యాచ్ లోనే సంచలన ఆటతో స్టార్లలయ్యారు.(ipl 20)
(2 / 6)
IPL 2024 Stars: ఒక్క మెరుపు ఇన్నింగ్స్ తో గుజరాత్ టైటన్స్ కు దిమ్మదిరిగే షాకిచ్చాడు పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్. మ్యాచ్ పై తన టీమ్ కూడా ఆశలు వదిలేసుకున్న సమయంలో 29 బంతుల్లోనే 61 రన్స్ చేసి సంచలన విజయం సాధించి పెట్టాడు. పొరపాటున వేలంలో అతన్ని తీసుకుంది పంజాబ్ కింగ్స్. కానీ ఇప్పుడదే ప్లేయర్ గెలిపించాడు.(ANI)
(3 / 6)
IPL 2024 Stars: ముంబై ఇండియన్స్ ప్లేయర్ నమన్ ధిర్ తొలి రెండు మ్యాచ్ లలో మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ఇరగదీశాడు. 200 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. సూర్యకుమార్ లేకపోవడంతో వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు.(ipl 20)
(4 / 6)
IPL 2024 Stars: అంగ్‌క్రిష్ రఘువంశీ కూడా ఒక్క ఇన్నింగ్స్ తోనే ఐపీఎల్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఈ ప్లేయర్ ఢిల్లీ క్యాపిటల్స్ పై కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి మెరిశాడు.(ipl 20)
(5 / 6)
IPL 2024 Stars: ఈ ఐపీఎల్లో టాప్ బ్యాటర్లను కూడా తన స్పీడుతో బోల్తా కొట్టిస్తున్నాడు లక్నో సూపర్ జెయింట్స్ పేస్ బౌలర్ మయాంక్ యాదవ్. నిలకడగా గంటకు 150 కి.మీ.పైగా వేగంతో అతడు బౌలింగ్ చేస్తున్నాడు. అతన్ని అప్పుడే టీమిండియాలోకి తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.(ipl20)
ఇతర గ్యాలరీలు