తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Zimbabwe: ఈ ఆరుగురు ప్లేయర్స్ ఎక్కడ? మరచిపోయారా? కావాలనే పక్కన పెట్టారా? కనిపించని ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్

India vs Zimbabwe: ఈ ఆరుగురు ప్లేయర్స్ ఎక్కడ? మరచిపోయారా? కావాలనే పక్కన పెట్టారా? కనిపించని ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్

Hari Prasad S HT Telugu

03 July 2024, 8:56 IST

google News
    • India vs Zimbabwe: జింబాబ్వే పర్యటనకు పూర్తిగా యంగిండియాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే టీమిండియాలో ఈ ఆరుగురు ప్లేయర్స్ ను మాత్రం మరచిపోయారా లేక కావాలనే పక్కన పెట్టారా అన్న చర్చ జరుగుతోంది.
ఈ ఆరుగురు ప్లేయర్స్ ఎక్కడ? మరచిపోయారా? కావాలనే పక్కన పెట్టారా?  కనిపించని ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్
ఈ ఆరుగురు ప్లేయర్స్ ఎక్కడ? మరచిపోయారా? కావాలనే పక్కన పెట్టారా? కనిపించని ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ (AFP)

ఈ ఆరుగురు ప్లేయర్స్ ఎక్కడ? మరచిపోయారా? కావాలనే పక్కన పెట్టారా? కనిపించని ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్

India vs Zimbabwe: ఐపీఎల్ గెలిచిన కెప్టెన్ ఎక్కడ? అదే ఐపీఎల్లో తన పేస్ తో వణికించిన బౌలర్ ఎక్కడ? ఆ స్టార్ వికెట్ కీపర్ ఎక్కడ?.. ఇలా జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియాలో కచ్చితంగా ఉంటారని భావించిన ఆరుగురు ప్లేయర్స్ మాత్రం కనిపించలేదు. దీనికి కారణమేంటో అని అభిమానులు ఆరా తీస్తున్నారు. వీళ్లలో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు.

మార్పులు చేసినా కానరాని ప్లేయర్స్

జింబాబ్వేతో సిరీస్ కోసం టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలోనే సెలెక్టర్లు జట్టును ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో పూర్తిగా యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు. అయితే ఈ జట్టుకు రెండుసార్లు మార్పులు చేశారు. మొదట నితీష్ కుమార్ రెడ్డి గాయపడటంతో అతని స్థానంలో శివమ్ దూబెను తీసుకున్నారు. తర్వాత వరల్డ్ కప్ జట్టుతో ఉన్న ముగ్గురు ప్లేయర్స్ శివమ్ దూబె, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ కోసం మరోసారి మార్చారు.

ఈ ముగ్గురి స్థానంలో సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలను ఎంపిక చేశారు. అయితే మొదటి జట్టులో అయినా, మార్పులు చేసిన తర్వాత అయినా.. జట్టులో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, ఉమ్రాన్ మాలిక్, వరుణ్ చక్రవర్తి, మయాంక్ యాదవ్, యశ్ దయాల్ లాంటి ప్లేయర్స్ ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. దీనికి కారణమేంటన్నది అంతుబట్టడం లేదు.

ఇషాన్ కిషన్ ఎక్కడ?

రిషబ్ పంత్ రావడంతో ఇషాన్ కిషన్ ను వరల్డ్ కప్ కోసం సెలెక్టర్లు పక్కన పెట్టారు. కానీ తర్వాత కనీసం జింబాబ్వే టూర్ కైనా అతన్ని తీసుకోలేదు. గతేడాది వరల్డ్ కప్ తర్వాత అతడు ఇండియన్ టీమ్ తరఫున కేవలం మూడు టీ20లు మాత్రమే ఆడాడు. జింబాబ్వే పర్యటనకు అతన్ని కాదని ధృవ్ జురెల్, సంజూ శాంసన్, తాజాగా జితేశ్ శర్మలను తీసుకోవడం విశేషం.

అతన్ని కావాలనే పక్కన పెట్టారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను కూడా సెలక్టర్లు పట్టించుకోలేదు. నిజానికి ఈ ఇద్దరు ప్లేయర్స్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులను కూడా కోల్పోయారు. తర్వాత ఐపీఎల్లో రాణిస్తూ సెలక్టర్లపై శ్రేయస్ పరోక్షంగా పంచ్‌లేశాడు. దీంతో కావాలనే ఈ ఇద్దరినీ అసలు పరిగణనలోకి తీసుకోలేదన్న వాదన వినిపిస్తోంది.

ఆ యువ ప్లేయర్స్ సంగతేంటి?

ఈ ఇద్దరే కాదు కేకేఆర్ తరఫున ఐపీఎల్లో రాణించిన వరుణ్ చక్రవర్తినీ పట్టించుకోలేదు. ఈ ఏడాది ఐపీఎల్లో అతడు అత్యధిక వికెట్లు తీసిన వాళ్లలో రెండో స్థానంలో ఉన్నాడు. 15 మ్యాచ్ లలో 21 వికెట్లు తీశాడు. ఇక లక్నో తరఫున తన పేస్ తో వణికించిన మయాంక్ యాదవ్, సన్ రైజర్స్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్ కూడా జింబాబ్వే పర్యటనకు లేరు.

ఆర్సీబీ తరఫున రాణించిన యశ్ దయాల్, రాజస్తాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మలను కూడా సెలెక్టర్ల పట్టించుకోనట్లు తెలుస్తోంది. యువ జట్టునే ఎంపిక చేయాలనుకున్నట్లయితే ఇషాన్, శ్రేయస్ ను పక్కన పెట్టినా.. మయాంక్, వరుణ్, ఉమ్రాన్ లాంటి వాళ్లను ఎంపిక చేసి ఉండాల్సిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

తదుపరి వ్యాసం