India vs Zimbabwe: జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు శాంసన్, దూబే, యశస్వి ఔట్.. కారణం ఇదే
India vs Zimbabwe T20 Series: జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‍ను భారత్ ఆడనుంది. అయితే, ఈ సిరీస్‍కు ఎంపికైన సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ తొలి రెండు మ్యాచ్‍లకు దూరమయ్యారు.
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ గెలిచి ఫుల్ జోష్‍లో ఉంది టీమిండియా. 17 ఏళ్ల తర్వాత టీ20 టైటిల్ కైవసం చేసుకొని అదరగొట్టింది. వెస్టిండీస్‍లోని బార్బడోస్ వేదికగా జూన్ 29న జరిగిన ఫైనల్‍లో దక్షిణాఫ్రికా ఓడించి విశ్వవిజేతగా భారత్ నిలిచింది. తదుపరి జింబాబ్వేతో ఐదు టీ20 సిరీస్‍ను టీమిండియా ఆడనుంది. టీ20 ప్రపంచకప్ ఆడిన జట్టులో ముగ్గురు మినహా అందరికీ ఈ జింబాబ్వే పర్యటన నుంచి బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. అయితే, ప్రపంచకప్ ఆడిన జట్టులో ఉండి జింబాబ్వే పర్యటనకు ఎంపికయ్యారు సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్. అయితే, జింబాజ్వేతో తొలి రెండు టీ20లకు వారు దూరమయ్యారు.
కారణం ఇదే
టీ20 ప్రపంచకప్ ఆడిన భారత జట్టు ప్రస్తుతం బార్బడోస్‍లోనే ఉంది. బెరిల్ తుఫాను తీవ్రంగా ఉండటంతో స్వదేశానికి టీమిండియా రావడం ఆలస్యమవుతోంది. శాంసన్, శివమ్ దూబే, యశస్వి అక్కడే ఉన్నారు. ఈ కారణంతోనే జింబాజ్వేతో తొలి రెండు టీ20లకు ఆ ముగ్గురిని బీసీసీఐ తప్పించింది.
జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‍లో తొలి మ్యాచ్ జూలై 6న హరారేలో, రెండో టీ20 జూలై 7న జరగనుంది. ఈ రెండు మ్యాచ్‍ల నుంచి సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ ఔటయ్యారు.
వారి ప్లేస్‍లో..
జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు శాంసన్, దూబే, జైస్వాల్ స్థానంలో సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాలకు చోటు దక్కింది. భారత జట్టుతో వీరి జింబాబ్వే పయనమయ్యారు. ఈ సిరీస్‍కు భారత యంగ్ ప్లేయర్ శుభ్‍మన్ గిల్ కెప్టెన్సీ చేయనున్నాడు.
హరారే చేరిన టీమిండియా
నయా కెప్టెన్ శుభ్‍మన్ గిల్ సహా భారత జట్టు జింబాబ్వేలోని హరారేకు నేడు (జూలై 2) చేరుకుంది. రేపటి నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టే అవకాశం ఉంది.
జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, హర్షిత్ రాణా
భారత్, జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్
భారత్, జింబాబ్వే మధ్య ఈ సిరీస్‍లోని ఐదు టీ20లు హరారే వేదికగానే జరగనున్నాయి.
తొలి టీ20 - జూలై 6
రెండో టీ20 - జూలై 7
మూడో టీ20 - జూలై 10
నాలుగో టీ20 - జూలై 13
ఐదో టీ20 - జూలై 14
ప్రత్యేక విమానంలో ప్రపంచకప్ టీమ్!
టీ20 ప్రపంచకప్ ఆడిన భారత ఆటగాళ్లు వెస్టిండీస్‍లోని బార్బడోస్‍లోనే ఉన్నారు. తుపాను తీవ్రంగా ఉండటంతో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ తరుణంలో టీమిండియా కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ సిద్ధమైందని తెలుస్తోంది. ప్రత్యేక విమానం ద్వారా భారత జట్టును ఇండియా తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. జూన్ 3న భారత బృందం స్వదేశంలో అడుగుపెట్టే అవకాశం ఉంది.