Hardik Pandya : ‘మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి’- విమర్శలపై హార్దిక్ కామెంట్స్!
02 April 2024, 13:45 IST
- Hardik Pandya Mumbai Indians : విమర్శలపై ఎట్టకేలకు స్పందించాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. విమర్శించే వారిని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు.
విమర్శలపై హార్దిక్ పాండ్యా ట్వీట్..
Hardik Pandya latest news : రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించాలని ముంబై ఇండియన్స్ నిర్ణయించుకున్నప్పటి నుంచి.. ఐపీఎల్ 2024లో ఆ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు! ఆడిన మూడు మ్యాచ్‌లలో ఆ జట్టు ఘోరంగా ఓడిపోయింది. ఇక రోహిత్ నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్న హార్దిక్ పాండ్యా.. ఎక్కడికి వెళ్లినా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. స్టేడియం లోపల అయితే పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. పాండ్యాని అందరు ఎగతాళి చేస్తున్నారు. వీటన్నింటిపై ఇప్పటివరకు మౌనంగా ఉన్న హార్దిక్ పాండ్యా.. తొలిసారిగా స్పందించాడు. అందరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశాడు.
హార్దిక్ పాండ్యా కామెంట్స్..
తన మీద, ముంబై ఇండియన్స్ జట్టు మీద వస్తున్న విమర్శలపై ఎట్టకేలకు మంగళవారం స్పందించాడు హార్దిక్ పాండ్యా.
Mumbai Indian IPL 2024 : "ఈ జట్టు గురించి మీరు తెలుసుకోవాల్సినది ఏదైనా ఉంటే.. అది 'వీ నెవర్ గివప్' (మేము వదలము). పోరాడుతూనే ఉంటాము. ముందుకు వెళుతునే ఉంటాము," అని ట్వీట్ చేశాడు పాండ్యా.
అదే పనిగా పాండ్యాను విమర్శిస్తున్న వారందరు.. ఇప్పుడు అతని ట్వీట్‌కి ఏ విధంగా జవాబిస్తారో చూడాలి.
ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే.. ఐపీఎల్ 2024లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌లు ఓడిపోయింది. కానీ.. ఇది ఎంఐకి చెత్త ప్రదర్శన కాదు. 2015లో రోహిత్ శర్మ సారథ్యంలో మొదటి 4 మ్యాచ్‌లు ఓడిపోయిన ముంబై ఇండియన్స్.. కనీవినీ ఎరుగని విధంగా పుంజుకుని ఏకంగా టైటిల్‌నే కైవశం చేసుకుంది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.
IPL 2024 latest news : సోమవారం.. ఆర్ఆర్తో ముంబైలో ఆడిన మ్యాచ్‌ని ఓడిపోయింది హార్దిక్ సేన. తదుపరి మ్యాచ్.. ముంబైలోనే, డీసీతో ఏప్రిల్ 7న జరగనుంది. దాదాపు వారం రోజుల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లో.. గెలుపు బాటపట్టేందుకు జట్టు ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో అని అందరు ఆసక్తిగా ఉన్నారు.
ముంబైలోనూ హార్దిక్ పాండ్యా పరిస్థితి ఇదే.!
హ్యాట్రిక్ ఓటములతో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది ముంబై ఇండియన్స్. చూస్తుంటే.. జట్టు ప్రదర్శనను ఎంఐ ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేరు! వారి ఫోకస్ అంతా హార్దిక్ పాండ్యా మీదే, అతడిని 'బూ' చేయడం మీదే ఉన్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కాస్త శృతి మించినట్టే ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే.. వాంఖడేలో ఇలాంటి సీన్స్ కొత్తేమీ కాదు. లెజెండరీ ప్లేయర్, క్రికెట్ గాడ్‌గా పేరు సంపాదించుకున్న సచిన్ టెండుల్కర్ని కూడా ముంబై ఫ్యాన్స్ వదల్లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.