Mumbai Indians : సచిన్​ టెండుల్కర్​ని కూడా వదలని ముంబై ఫ్యాన్స్​! హార్దిక్​ని​ 'బూ' చేసినట్టే..-mi vs rr wankhede vents its ire as skipper hardik pandya booed again in ipl 2024 ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Mi Vs Rr Wankhede Vents Its Ire As Skipper Hardik Pandya Booed Again In Ipl 2024

Mumbai Indians : సచిన్​ టెండుల్కర్​ని కూడా వదలని ముంబై ఫ్యాన్స్​! హార్దిక్​ని​ 'బూ' చేసినట్టే..

Sharath Chitturi HT Telugu
Apr 02, 2024 06:51 AM IST

MI vs RR : ముంబై ఇండియన్స్​ సొంత గ్రౌండ్​లోనూ హార్దిక్​ పాండ్యాకు చేదు అనుభవం తప్పలేదు. మరి ఎంఐ ఫ్యాన్స్​ని శాంతింపజేయాలంటే పాండ్యా ఏం చేయాలి?

ఆర్​ఆర్​తో మ్యాచ్​లో హర్దిక్​ పాండ్యా, రోహిత్​ శర్మ
ఆర్​ఆర్​తో మ్యాచ్​లో హర్దిక్​ పాండ్యా, రోహిత్​ శర్మ (AP)

Hardik Pandya latest news : హ్యాట్రిక్​ ఓటములతో ఐపీఎల్​ 2024 పాయింట్స్​ టేబుల్​లో అట్టడుగు స్థానంలో నిలిచింది ముంబై ఇండియన్స్​. చూస్తుంటే.. జట్టు ప్రదర్శనను ఎంఐ ఫ్యాన్స్​ పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేరు! వారి ఫోకస్​ అంతా హార్దిక్​ పాండ్యా మీదే, అతడిని 'బూ' చేయడం మీదే ఉన్నట్టు కనిపిస్తోంది. సోమవారం రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​ ఫ్యాన్స్​ కాస్త శృతి మించినట్టే ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే.. వాంఖడేలో ఇలాంటి సీన్స్​ కొత్తేమీ కాదు. లెజెండరీ ప్లేయర్​, క్రికెట్​ గాడ్​గా పేరు సంపాదించుకున్న సచిన్​ టెండుల్కర్​ని కూడా ముంబై ఫ్యాన్స్​ వదల్లేదు.

ట్రెండింగ్ వార్తలు

హార్దిక్​.. సచిన్​.. కోహ్లీ- ఎవ్వరిని వదల్లేదు!

ఐపీఎల్​ 2024లో గుజరాత్​ టైటాన్స్​ నుంచి తీసుకొచ్చి మరీ.. హార్దిక్​ పాండ్యాను కెప్టెన్​ చేసింది ముంబై ఇండియన్స్​. ఇది రోహిత్​ ఫ్యాన్స్​తో పాటు ఎంఐ ఫ్యాన్స్​కి అస్సలు నచ్చలేదు. ఫలితంగా.. జట్టు ఎక్కడికి వెళ్లినా.. హార్దిక్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అభిమానులు. సోమవారం ఆర్​ఆర్​తో జరిగిన మ్యాచ్​లో కూడా ఈ దృశ్యాలు కనిపించాయి. టాస్​ కోసం గ్రౌండ్​లోకి వెళ్లిన హార్దిక్​ని ముంబై ఫ్యాన్స్​ తెగ ఎగతాళి చేశారు. 'మర్యాదగా ప్రవర్తించండి' అని కామెంటేటర్​ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఫ్యాన్స్​ అక్కడితో ఆగలేదు. మ్యాచ్​ ఆశాంతం.. హర్దిక్​ని బూ చేస్తూనే ఉన్నారు.

MI vs RR IPL 2024 : అయితే.. వాంఖడేలో ఇలాంటి సీన్స్​ సాధారణమే! సచిన్​ టెండుల్కర్​కి కూడా ఇలాంటివి తప్పలేదు. 2005-06లో సచిన్​కి రఫ్​ ప్యాచ్​ నడుస్తున్న సమయంలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో పరుగులు చేయడానికి కష్టపడుతున్న సచిన్​ టెండులర్క్​ని ముంబై ప్రేక్షకులు ఎగతాళి చేశారు.

ఇక విరాట్​ కోహ్లీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. 2013లో అప్పటి ముంబై ఇండియన్స్​ ప్లేయర్​ అంబటి రాయుడును విరాట్​ కోహ్లీ రనౌట్​ చేసిన తీరు వివాదాస్పదమైంది. ఫ్యాన్స్​ మాత్రం.. కోహ్లీని గట్టిగా బూ చేశారు. ముంబై రంజీ జట్టు మాజీ కెప్టెన్​, ప్రస్తుత బీసీసీఐ చీఫ్​ సెలక్టర్​ అజిత్​ అగార్కర్​.. కేకేఆర్​ జెర్సీ వేసుకుని వాంఖడేలో కనిపించినప్పుడు కూడా.. ప్రేక్షకులు ఎగతాళి చేశారు.

హార్దిక్​ పాండ్యా ఇప్పుడేం చేయాలి?

రోహిత్​ ఒక సీనియర్​ ప్లేయర్​. ముంబై ఇండియన్స్​కి 5సార్లు ఐపీఎల్​ ట్రోఫీని అందించాడు. కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోవడానికి కాస్త సమయం పడుతుంది. హార్దిక్​ పాండ్యాపై కోపాన్ని చూపించడం తగ్గించుకోవడానికి కూడా టైమ్​ పడుతుంది. మరి పాండ్యా ఇప్పుడేం చేయాలి? అన్న ప్రశ్నకు.. సోమవారం జరిగిన మ్యాచ్​లోనే సమాధానం దొరికింది.

Hardik Pandya Mumbai Indians : ముంబై ఇండియన్స్​ 20/4తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజ్​లోకి వచ్చాడు హార్దిక్​. ప్రేక్షకుల్లో అయోమయం కనిపించింది. జట్టు కష్టాల్లో ఉందని బాధపడాలా.. లేక హార్దిక్​ పాండ్యాని బూ చేయాలా? అని అర్థం కాలేదు. ఆ సమయంలోనే.. 21 బాల్స్​లో 34 పరుగులు చేశాడు హార్దిక్​ పాండ్యా. అతను కొట్టిన ప్రతి బౌండరీకి.. ప్రేక్షకుల నుంచి మద్దతు లభించింది. అంటే.. ముంబై ఇండియన్స్​ ఫ్యాన్స్​ని తనవైపు తిప్పుకుని, ఇప్పటికే వరుస ఓటములతో పాయింట్స్​ టేబుల్​లో అట్టడుగున్న ఉన్న ఎంఐ జట్టును మళ్లీ పైకి లేపాలంటే.. కెప్టెన్​గా, ఆల్​రౌండర్​గా హార్దిక్​ పాండ్యా మంచి ప్రదర్శన చేయాల్సిందే!

WhatsApp channel

సంబంధిత కథనం