MS Dhoni : సీఎస్కే వర్సెస్ ఆర్ఆర్.. చెపాక్‌లో ధోనీకి ఇదే చివరి మ్యాచ్!
12 May 2024, 16:01 IST
- MS Dhoni latest news : ఆదివారం.. సీఎస్కే వర్సెస్ ఆర్ ఆర్ పోరు.. చెపాక్‌లో ఎంఎస్ ధోనీకి చివరి మ్యాచ్ అవుతుందా? ఈ ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
చెపాక్‌లో ధోనీ చివరి మ్యాచ్ ఇవాళేనా?
MS Dhoni latest news : మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరంటే క్రికెట్ అభిమానులకు ఒక ఎమోషన్. ఐపీఎల్ 2024ని చాలా మంది.. కేవలం ధోనీ కోసమే చూస్తున్నారు. వారందరికి.. తన బ్యాటింగ్‌తో మరచిపోలేని జ్ఞాపకాలు ఇస్తున్నాడు ధోనీ. అయితే.. ఈ ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ చివరి దశకు చేరుకుంది. ఆదివారం జరుగుతున్న చెన్నై సూపర్ కింగ్స్- రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్.. చెపాక్ స్టేడియంలో చివరిది! మరి చెపాక్‌లో ధోనీకి కూడా ఇదే చివరి మ్యాచ్ అవుతుందా?
ఐపీఎల్ 2024- ధోనీకి చివరిదా?
ధోనీ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడట్లేదు. కేవలం ఐపీఎల్ ఆడుతున్నాడు. వాస్తవానికి ఐపీఎల్ 2023లోనే మహేంద్రుడు రిటైర్ అవుతాడని అందురు ఊహించారు. పైగా.. సీఎస్కే కప్ సాధించడంతో, రూమర్స్ మరింత పెరిగాయి. కానీ.. ఐపీఎల్ 2024లో కూడా ధోనీ ఆడుతూ.. ఫ్యాన్స్‌ని కనివిందు చేస్తున్నాడు.
CSK vs RR IPL 2024 : ఏది ఏమైనా.. ఐపీఎల్ 2024లో కూడా ధోనీ రిటైర్మెంట్ వ్యవహారంపై రూమర్స్ జోరుగా సాగుతున్నాయి. ఇదే.. అతని చివరి ఐపీఎల్ సీజన్ అని చాలా మంది భావిస్తున్నారు. అందుకే.. ధోనీ ఎక్కడ మ్యాచ్ ఆడినా, కేవలం అతడిని చూసేందుకే ప్రజలు భారీ సంఖ్యలో స్టేడియంలకు తరలి వెళుతున్నారు. ధోనీని ఒక్కసారైనా చూడాలని తాపత్రయపడుతున్నారు.
అయితే.. ఐపీఎల్ 2024లోకి అడుగు పెడుతూనే.. సీఎస్కే కెప్టెన్సీని ధోనీ వదులుకున్నాడు. మరోవైపు.. రిటైర్మెంట్ వార్తలపై లెజెండ్ ఇంకా స్పందించకుండానే ఐపీఎల్ 2024.. లీగ్ స్టేజ్ చివరి దశకు చేరుకుంది. సీఎస్కే జట్టు ఇంకా ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోలేదు.
ఈ నేపథ్యంలో.. చెపాక్‌లో ఆదివారం జరుగుతున్న ఆర్ఆర్- సీఎస్కే మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల ఫోకస్ పడింది. ఒక వేళ ధోనీ రిటైర్ అయితే.. చెపాక్‌లో ధోనీకి ఇదే చివరి మ్యాచ్ అవుతుంది. సీఎస్కే జట్టు ప్లేఆఫ్స్‌కి చేరకపోతే.. ఇంకొన్ని రోజుల్లో ఆర్సీబీతో జరిగే మ్యాచ్.. ధోనీకి చివరి ఐపీఎల్ మ్యాచ్ అవ్వొచ్చు!
సీఎస్కే వర్సెస్ ఆర్ఆర్..
CSK vs RR MS Dhoni : ఇక ఆదివారం మధ్యాహ్నం జరుగుతున్న సీఎస్కే మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 5ఓవర్లకు వికెట్లేమీ కోల్పోకుండా 36 పరుగలు చేసింది.
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కి సీఎస్కే చేరుతుందా?
మూడు జట్లల్లో కాస్త సౌకర్యవంతమైన స్థితిలో ఉంది సీఎస్కేనే. డీసీ, ఆర్సీబీతో పోల్చుకుంటే.. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. ఆదివారం.. రాజస్థాన్ రాయల్స్‌తో సీఎస్కే తలపడనుంది. మే 18న.. ఆర్సీబీతో చిన్నస్వామి స్టేడియంలో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది.
CSK playoff chances 2024 : ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. సీఎస్కేకి గరిష్ఠంగా 16 పాయింట్లు వస్తాయి. ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కి చేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
రెండు మ్యాచ్‌లలో ఒక్కటే గెలిచినా.. ధోనీ టీమ్ ప్లేఆఫ్స్‌కి వెళ్లాచు. కానీ.. డీసీ ఓడిపోవాలని సీఎస్కే ప్రార్థించాలి.
చెన్నై జట్టు రెండు మ్యాచ్‌లు ఓడిపోతే మాత్రం.. టోర్నీ నుంచి బయటకు వెళ్లిపోతుంది. 12 పాయింట్సే ఉంటాయి. ఎల్ఎస్జీ వర్సెస్ డీసీలో గెలిచిన జట్టుకు 14 పాయింట్స్ వస్తాయి.
డీసీ, ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.