Hardik Pandya: కోహ్లి ...ధోనీ తర్వాత పాండ్యనే - ఫస్ట్ ఇండియన్ క్రికెటర్‌గా రికార్డ్
23 June 2024, 13:25 IST
Hardik Pandya: బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు హార్దిక్ పాండ్య, బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ చేయడమే కాకుండా బౌలింగ్‌లోనూ ఓ వికెట్ తీశాడు. ఈ క్రమంలో కోహ్లి, ధోనీ రికార్డులను బ్రేక్ చేశాడు.
హార్దిక్ పాండ్య
Hardik Pandya: ఐపీఎల్‌లో దారుణంగా విఫలమై విమర్శలను ఎదుర్కొన్న టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం అంచనాలకు మించి రాణిస్తోన్నాడు. బ్యాట్‌తోనే కాకుండా బౌలింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తోన్నాడు.
చివరి బాల్‌కు ఫోర్...
శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో యాభై పరుగులు చేశాడు వంద పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌కు భారీ స్కోరు అందించాడు. చివరి బాల్‌కు ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. బౌలింగ్‌లో రాణించిన పాండ్య బంగ్లాదేశ్ తొలి వికెట్ పడగొట్టాడు. సిక్స్, ఫోర్ కొట్టి ఊపుమీదున్న ఓపెనర్ లిట్టన్ దాస్‌ను ఔట్ చేశాడు.
కోహ్లి రెండు సార్లు...
ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్‌లో ఓ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు వికెట్ తీసిన సెకండ్ ఇండియన్ క్రికెటర్‌గా పాండ్య నిలిచాడు. గతంలో ఈ ఘనతను రెండు సార్లు విరాట్ కోహ్లి మాత్రమే సాధించాడు. 2012 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై కోహ్లి హాఫ్ సెంచరీ (78 రన్స్ నాటౌట్) చేయడంతో బౌలింగ్‌లో మూడు ఓవర్లు వేసి ఓ వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత 2016 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి మరోసారి ఘనతను సాధించాడు.
ఈ మ్యాచ్‌లో కోహ్లి 47 బాల్స్‌లో 89 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ బౌలర్లు విఫలం కావడంతో అప్పటి కెప్టెన్ ధోనీ...విరాట్ చేత బౌలింగ్ చేయించాడు. ధోనీ నమ్మకాన్ని నిలబెడుతూ ఫస్ట్ బాల్‌కు జాన్సన్ ఛార్లెస్ వికెట్ తీశాడు కోహ్లి. అతడి తర్వాత పాండ్య మాత్రమే ఓ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో పాటు వికెట్ తీసిన ప్లేయర్‌గా నిలిచాడు.
తొలి క్రికెటర్...
టీ20 వరల్డ్ కప్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగి హాఫ్ సెంచరీ చేసిన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్‌గా పాండ్య రికార్డ్ నెలకొల్పాడు. గతంలో 45 పరుగులతో ధోనీ పేరున ఈ రికార్డ్ ఉంది. ధోనీ రికార్డును హాఫ్ సెంచరీతో పాండ్య అధిగమించాడు. 2007 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగిన ధోనీ 45 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2012 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాపైనే సురేష్ రైనా 45 రన్స్ చేశారు. వారి రికార్డ్‌ను బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ద్వారా ధోనీ అధిగమించాడు.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన హార్దిక్ పాండ్యకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో టీమిండియా సెమీస్ బెర్తు దాదాపు ఖాయమైంది. గ్రూప్ వన్‌లో రెండు విజయాలతో టీమిండియా టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆస్ట్రేలియా ఆఫ్గానిస్తాన్ తలో విజయంతో సెకండ్ ప్లేస్‌లో నిలిచాయి.